తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exam Anxiety: ఎగ్జామ్స్ యాంగ్జైటీని చిత్తు చేసే 6 మార్గాలు

Exam anxiety: ఎగ్జామ్స్ యాంగ్జైటీని చిత్తు చేసే 6 మార్గాలు

Zarafshan Shiraz HT Telugu

22 February 2023, 20:01 IST

google News
    • Exam anxiety: ఎగ్జామ్స్ యాంగ్జైటీ పిల్లల్లో సర్వసాధారణం. క్రమబద్ధంగా చదవకపోతే ఫలితాలపై ప్రభావం పడుతుంది. అందువల్ల ఈ యాంగ్జైటీని దూరం చేసుకునేందుకు ఉన్న 6 మార్గాలు ఇక్కడ చూడండి.
పరీక్షల కారణంగా ఆందోళనను తొలగించేందుకు 6 మార్గాలు
పరీక్షల కారణంగా ఆందోళనను తొలగించేందుకు 6 మార్గాలు (Photo by Tony Tran on Unsplash)

పరీక్షల కారణంగా ఆందోళనను తొలగించేందుకు 6 మార్గాలు

పరీక్షల వల్ల కలిగే ఆందోళన జీవితంపై మీ దృక్పథాన్ని, మీ చదువులు, వృత్తిపరమైన పనితీరును పరిమితం చేస్తుంది. అంతేకాకుండా రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రభావితం చేస్తుంది. పరీక్షలకు కొన్ని వారాల ముందే ఆ యాంగ్జైటీ మిమ్మల్ని వెన్నాడుతుంది. పరీక్ష రోజు వచ్చేసరికి అది పరాకాష్టకు చేరుకుంటుంది. ఈ ఎగ్జామ్ యాంగ్జైటీ ప్రతికూల ప్రభావం చూపి ఫలితాలను పరిమితం చేస్తుంది.

భావోద్వేగాలు, మానసిక ఆరోగ్య సంబంధిత కోచ్, లెటజ్ టాక్ ఫౌండర్ కంచన్ రాయ్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాలపై చర్చించారు. యాంగ్జైటీని దూరం పెట్టేందుకు కొన్ని సలహాలు ఇచ్చారు.

1. Banish all negative energy: ప్రతికూల శక్తిని నిషేధించండి

మీకు ప్రతికూల ఆలోచనలతో మీ మెదుడు పాడవుతుంటే మీరు చేస్తున్నదానిని ఆపేసి మీ మెదడును ఖాళీ చేయండి. కాస్త మీ ఊహాశక్తికి పనిచెప్పండి. మీరు మీ ఆత్మీయ స్నేహితులతో రిలాక్స్ అవుతున్నట్టు ఊహించుకోండి. మీ టెన్షన్ తగ్గేంతవరకు ఆగి తిరిగి మీ చదువుపై దృష్టి పెట్టండి.

2. Make a plan and stick to it: ప్రణాళిక బద్ధంగా చదవండి

ఎగ్జామ్ తేదీలు రాగానే చదవడం మొదలు పెట్టేస్తుంటాం. కానీ అంతకుముందు నుంచే ఒక ప్లాన్ తయారు చేసుకుని దానిని అనుసరించడం మేలు చేస్తుంది. పరీక్ష సమీపించే వరకూ వేచి ఉండకండి. ఇది మీలో యాంగ్జైటీని పెంచుతుంది. పరీక్షకు ముందు రోజు అస్సలు ఏమీ చదవకుండా పోతారు.

3. Psychological need: మానసిక అవసరాలు గుర్తించండి

పరీక్షలు దగ్గరయ్యే సరికి విద్యార్థులు చురుగ్గా ఉండడం మానేస్తారు. ఆటలు, వ్యాయామానికి దూరమవుతారు. కానీ ఇవి మానసిక ఆరోగ్యానికి కూడా ముఖ్యమని గుర్తించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తగినంతగా నిద్ర పోతేనే మీ మెదుడు చురుగ్గా పనిచేస్తుంది. ఇవేవీ పాటించకుండా ఉంటే పరీక్ష రోజు చురుగ్గా ఉండలేరు.

4. Study a little earlier: బండెడంతా ఒకేసారి కాకుండా

క్రమం తప్పకుండా రోజూ కొంచెం చదవడం, దానిని అర్థం చేసుకోవడం వల్ల నిద్రలో అడిగినా ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీరు చెప్పేస్తారు. అందువల్ల పరీక్షలు దగ్గరపడిన తరువాత బండెడు సిలబస్ ఒకేసారి చదవడం కాకుండా ప్రణాళికబద్ధంగా సబ్జెక్టును అర్థం చేసుకోవడం ముఖ్యం. పరీక్షలు దగ్గరపడ్డాక రివిజన్ చేసుకుంటే చాలు.

5. Explore relaxation practices: రిలేక్సేషన్ ప్రాక్టీస్ చేయండి

పరీక్షలకు ముందు, పరీక్షల సమయంలో ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా ఉండాలంటే మీరు రిలాక్సేషన్ టెక్నిక్స్ తెలుసుకోండి. డీప్ బ్రీత్, సానుకూల భావాలను విజువలైజ్ చేసుకోవడం అలవరుచుకోండి.

6. Focus more on discipline: క్రమశిక్షణపై దృష్టి పెట్టండి

ఉత్తమ ప్రణాళికలు, లక్ష్యాలు, వాటిని అనుసరించడం మీ క్రమశిక్షణను పెంచుతుంది. లక్ష్యాలు చేరుకోవడంలో మీ క్రమశిక్షణ విధానం ఉపయోగపడుతుంది. మీ చదువు క్రమబద్ధంగా సాగేందుకు తగిన ప్రేరణ కూడా అవసరం.

తదుపరి వ్యాసం