తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exercises For Anxiety, Depression: యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి 6 టిప్స్‌తో ఉపశమనం

Exercises for anxiety, depression: యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి 6 టిప్స్‌తో ఉపశమనం

HT Telugu Desk HT Telugu

28 January 2023, 5:58 IST

    • Exercises for anxiety, depression: యాంగ్జైటీ, డిప్రెషన్ వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటి నుంచి ఉపశమనానికి యోగా నిపుణులు 6 టిప్స్ సూచిస్తున్నారు.
కుంగుబాటు, ఆందోళన నుంచి ఉపశమనానికి టిప్స్
కుంగుబాటు, ఆందోళన నుంచి ఉపశమనానికి టిప్స్ (Pexels)

కుంగుబాటు, ఆందోళన నుంచి ఉపశమనానికి టిప్స్

గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, ఏదో అయిపోతుందన్న ఆందోళన వంటి లక్షణాలు యాంగ్జైటీ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తికి చాలా సుపరిచితం. చంచలంగా, చిరాకుగా, కోపంగా, తిమ్మిరిపట్టినట్టుగా లేదా జలదరింపుగా అనిపించవచ్చు. యాంగ్జైటీ వల్ల తీవ్రమైన భయం, నియంత్రణ కోల్పోవడం, నిస్సహాయత ఫీలవడం సాధారణం. ఆత్రుతగా లేదా నిరుత్సాహంగా ఉండటం మీ జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. బయటపడే మార్గాలు అన్వేషించనట్టయితే మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినవచ్చు. ప్రతి రుగ్మతలాగే యాంగ్జైటీతో పోరాడటానికి ఒక మార్గం ఉంది. ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటారు. అందుకు అనుగుణంగా మార్గాలు అన్వేషించాలి.

ఇంట్లో ఒక గది నుండి మరొక గదికి నడవడం, జాగరూకత సాధన చేయడం, మీకు విశ్రాంతినిచ్చే మీకు ఇష్టమైన కార్యాచరణ అమలు చేయడం, బాగా నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి యాంగ్జైటీని మెరుగ్గా ఎదుర్కోవడంలో మీకు సహాయపడతాయి. ఆందోళన లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు కొన్ని వ్యాయామాలు కూడా ఉన్నాయి.

‘యాంగ్జైటీ, డిప్రెషన్ మానసిక రుగ్మతల్లోని రకాలు. డిప్రెషన్ విచారం, నిస్సహాయత, శక్తిని తగ్గించడం వంటి లక్షణాలను చూపిస్తుంది. యాంగ్జైటీ భయం, ఆందోళన వంటి భావాలను సృష్టిస్తుంది. రెండు పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ యోగా అభ్యాసం వీటి నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది. ఆక్సిజన్‌, రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది. తలనొప్పి, సైనసైటిస్ వంటి వివిధ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శాంతిని పునరుద్ధరిస్తుంది..’ అని యోగా నిపుణులు మాన్సి గులాటీ చెప్పారు.

1. The Forehead (Acupressure) Point: నుదురు భాగంలో ఒత్తిడి కలిగించండి

మీ రెండు చేతులు పిడికిలిలా మార్చి మధ్య వేలు, చూపుడు వేళ్లను మీ నుదుటిపై ఆనించండి. నెమ్మదిగా ఒత్తిడి కలిగించండి. ప్రెజర్ పెడుతూనే పిడికిలిని మీ నుదిటికి రెండువైపులా తీసుకురండి. తిరిగి మధ్యలోకి తీసుకురండి. ఇలా వరుసగా నాలుగు సార్లు చేయండి. విరామం ఇచ్చి ఇదే వ్యాయామాన్ని మూడు విడతలుగా చేయండి.

2. Mindfulness Pose: జాగరూకత భంగిమ అభ్యాసం

జాగరూకతతో ఉండడం వల్ల యాంగ్జటీ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు.

  • రెండు పిడికిళ్లు మీ నుదిటిపై పెట్టండి.
  • మీ పిడికిలి నుంచి మధ్య, చూపుడు వేళ్లతో ప్రెజర్ పెట్టండి
  • నెమ్మదిగా ప్రెజర్ పెంచండి. అలా పెంచుతూ పిడికిళ్లను రెండు వైపులా జరుపుతూ వెళ్లండి.
  • అలా కంటికి, చెవికి మధ్య ఉన్న భాగం వరకు తీసుకెళ్లి తిరిగి ప్రెజర్ అప్లై చేయండి.
  • ఇలా మూడు సార్లు చేయండి.

3. Forehead Stretch Pose: నుదిటిని స్ట్రెచ్ చేయడం

మీ అరచేతులు మీ నుదిటిపై ఉంచండి. ఒత్తిపట్టి మీ చర్మాన్ని కాస్త కిందికి లాగండి. తిరిగి ఇప్పుడు మీ చర్మాన్ని ఇరువైపులకు లాగండి. పైకి చూస్తూ మీ నుదిటిని పైకి కదపండి. మీరు తల భాగం నుంచి నిరోధకతను గమనిస్తారు. మీరు పైకి చూస్తున్నప్పుడు మీ కనుబొమ్మలను కూడా పైకి కదపండి. ఇలా 10 సార్లు చేయండి. కాస్త విరామం ఇచ్చి మళ్లీ చేయండి.

4. Push and Pull Exercise: కనుబొమ్మలు స్ట్రెచ్ చేయండి

మీ కనుబొమ్మలను మీ వేళ్లతో పట్టుకుని.. మధ్య నుంచి చివరలకు లాగినట్టు చేయండి. ఇలా మూడు సార్లు చేయండి. 10 సెకెండ్లపాటు ఆపుతూ ఆ తరువాత సమయాన్ని పెంచండి.

5. Raise Pose: కనుబొమ్మలతో వ్యాయామం

శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ చేయి కనుబొమ్మలపై ఉంచి మీ కనుబొమ్మలను వేళ్లతో 10 సెకెండ్లపాటు పైకి లాగి పట్టుకోండి. ఇప్పుడు శ్వాస వదిలేయండి. మరో 10 సెకెండ్లపాటు కిందికి లాగినట్టు పట్టుకోండి. ఇలా మూడుసార్లు చేయండి.

6. Eyelid Firmer Pose: కనురెప్పలు స్ట్రెచ్ చేయండి

రెండు చేతుల నుంచి మూడేసి వేళ్లు మీ కనుబొమ్మల మూడు భాగాలను తెరవండి. కనురెప్పలు స్ట్రెచ్ అవుతాయి. ఇప్పుడు మీ కళ్లు మూయండి. ఇలా మూడుసార్లు చేయండి.

టాపిక్