తెలుగు న్యూస్  /  Lifestyle  /  Diy Keratin Treatment For Hair Growth, Know Step By Step Method

DIY Keratin Treatment | మీ జుట్టుకు ప్రోటీన్ పోషణ.. ఇంట్లోనే కెరాటిన్ చికిత్స ఇలా!

HT Telugu Desk HT Telugu

03 May 2023, 17:11 IST

    • DIY Keratin Treatment: కెరాటిన్ చికిత్సలో ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, జుట్టు పెరుగుదలను (Hair Growth) ప్రోత్సహించే ఇతర పోషకాలను అందిస్తారు. మీకు మీరుగా ఇంట్లోనే మీ జుట్టుకు కెరాటిన్ చికిత్సను చేసుకోవచ్చు.
DIY Keratin Treatment
DIY Keratin Treatment (istock)

DIY Keratin Treatment

Keratin Treatment For Hair: జుట్టు సంరక్షణ కోసం అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, అయితే కెరాటిన్ చికిత్సలు మీ జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్ పదార్థం. కెరాటిన్ చికిత్సలో భాగంగా ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, జుట్టు పెరుగుదలను (Hair Growth) ప్రోత్సహించే ఇతర పోషకాలను అందిస్తారు. ఫలితంగా జుట్టుకు మంచి పోషణ లభించి, ఆరోగ్యవంతగా మారతాయి. ఈ చికిత్స హెయిర్ స్టైలింగ్ (Hair Styling) ను సులభం చేస్తుంది. జుట్టు పొడిబారటం, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

అయితే ఈ కెరాటిన్ చికిత్స కోసం మీరు ప్రత్యేకంగా పార్లర్ కు వెళ్లాల్సిన పనిలేదు మీకు మీరుగా ఇంట్లోనే మీ జుట్టుకు కెరాటిన్ చికిత్సను చేసుకోవచ్చు. ప్రోటీన్లు కలిగిన కొన్ని పదార్థాలను తీసుకొని DIY కెరాటిన్ చికిత్సను ఎలా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

DIY కెరాటిన్ చికిత్సకు కావలసినవి

మినపపప్పు, పెరుగు, కొబ్బరిపాలు, ఆముదము నూనె, కలబంద జిగురు తీసుకొని హెయిర్ మాస్క్ (Hair Mask) సిద్ధం చేసుకోవాలి.

మినపపప్పు

ఒక గిన్నెలో సగానికి మినపపప్పు తీసుకొని దానికి రెండు రేట్లు నీరు పోసి కనీసం మూడు గంటలు నానబెట్టండి. రాత్రంత్రా నానబెట్టిన మినపపప్పును కూడా ఉపయోగించవచ్చు. మినపపప్పులో మీ జుట్టుకు అవసరమైన ప్రోటీన్లు ఉంటాయి.

పెరుగు

పెరుగులో కూడా ప్రోటీన్లు ఉంటాయి, పెరుగు మీ జుట్టుకు మృదుత్వాన్ని అందిస్తుంది. నానబెట్టిన మినపప్పు, పెరుగును మిక్స్ చేసి మెత్తని పేస్టులాగా రుబ్బుకోవాలి.

ఆముదము నూనె

హెయిర్ మాస్క్‌ తయారుచేసేందుకు మీకు రెండు టేబుల్‌స్పూన్ల ఆముదం నూనె (Castor oil) అవసరం అవుతుంది. ఆముదం జుట్టు వేగంగా పెరగడానికి అనుమతిస్తుంది. మీరు ఆముదంతో సౌకర్యంగా లేకుంటే బాదం, కొబ్బరి, ఆలివ్ నూనె వంటి వాటిలో దేనినైనా ఉపయోగించవచ్చు. కానీ ఆముదం మీ జుట్టు ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

అలోవెరా జెల్

కలబంద మీ జుట్టు పెరుగుదలను పెంచుతుంది, బలమైన జుట్టును ప్రోత్సహిస్తుంది. మీ జుట్టుకు తక్షణ మృదుత్వాన్ని అందించే ఏజెంట్ లాగా ఉపయోగకరంగా ఉంటుంది.

కొబ్బరిపాలు

హెయిర్ మాస్క్‌కి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు అవసరం. ఈ కొబ్బరి పాలు మీ జుట్టుకు మాయిశ్చరైజింగ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది మీ జుట్టుకు అద్భుతమైన సహజ కండీషనర్.

DIY Keratin Treatment:

ఇపుడు అన్ని పదార్థాలను కలపండి, ముద్దలు లేకుండా మృదువైన క్రీము పేస్ట్‌గా తయారు చేయండి. ఒక బ్రష్‌ని ఉపయోగించి మీ జుట్టు మూలాల వరకు ఈ పేస్టును అప్లై చేసుకొని, ఆరాక శుభ్రంచేసుకోవాలి. పేస్ట్ అప్లై చేసుకున్నాక తలకు మసాజ్ చేసుకొని, ఆవిరి పెట్టుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.