తెలుగు న్యూస్  /  Lifestyle  /  Chinese Byd E6 Electric Mpv Now Available For Private Buyers

BYD e6 ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 కిమీ మైలేజీ.. ధరెంతంటే?

HT Telugu Desk HT Telugu

04 September 2022, 20:20 IST

    • Chinese BYD e6 electric MPV: చైనీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్స్ (BYD) భారతీయ మార్కెట్లో ప్రైవేట్ కొనుగోలుదారుల కోసం e6 MPVని పరిచయం చేసింది. ఈ వాహనం ధర రూ. 29.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా  నిర్ణయించింది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 
BYD e6
BYD e6

BYD e6

చైనీస్ కార్ల తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్స్ (BYD) వ్యక్తిగత కొనుగోలుదారుల కోసం భారతీయ మార్కెట్‌లో తన న్యూ మోడల్ e6 ఎలక్ట్రిక్ MPVని విడుదల చేసింది. గత సంవత్సరం చివరలో, వాణిజ్య వాహనంగా మాత్రమే విడుదల E6 ఇప్పుడు ప్రైవేట్ కస్టమర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్‌ను GL, GLX అనే రెండు వేరియంట్‌లలో వచ్చింది. BYD e6 ప్రస్తుతం ప్రైవేట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ MPV.

ట్రెండింగ్ వార్తలు

Chinta Chiguru Pulihora: చింతచిగురు పులిహోర ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు

Dal water: పప్పు నీళ్లు ప్రతిరోజూ ఇలా తాగితే ఎన్నో ప్రయోజనాలు, పిల్లలకు తాగిస్తే మరీ మంచిది

Cardamom Warm Water Benefits : యాలకుల వేడి నీరు తాగితే మీకు చెప్పలేనన్నీ ప్రయోజనాలు దక్కుతాయి

Chanakya Niti Telugu : ఇలా చేస్తే మరణం తర్వాత కూడా మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది

BYD e6 ధర

BYD e6 కారు ధరను చూస్తే ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 29.15 లక్షలుగా ఉంది.

పవర్, స్పెసిఫికేషన్లు

పవర్, స్పెసిఫికేషన్ల పరంగా, 71.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ద్వారా కారుకు పవర్‌ అందుతుంది. దీని ద్వారా ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తి అందుతుంది. ఇది గరిష్టంగా 95 PS పవర్‌ను, 180 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేగం గురించి చెప్పాలంటే, BYD E6 గరిష్ట వేగం 130 kmph వరకు ఉంటుంది BYD ఒక్కసారి ఛార్జింగ్‌తో 520 కి.మీ వరకు మైలెజ్ ఇస్తుంది. ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది, తద్వారా ఇది 35 నిమిషాల్లో 30 - 80 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. 90 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది. మరోవైపు, GLX ట్రిమ్ వేరియంట్ 40 kW వాల్-మౌంటెడ్ AC ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్ వస్తుంది, దీనిని 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. స్టాండర్డ్ 6.6kW AC ఛార్జర్‌తో దీన్ని ఛార్జ్ చేయడానికి 12 గంటలు పడుతుంది.

BYD e6 ఫీచర్స్

ఈ కారు ఫీచర్ల గురించి మాట్లాడితే, e6 LED DRLలు, లెదర్ సీట్లు, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లతో పాటు CN95 ఎయిర్‌ను అందించారు. బ్లూటూత్‌తో పాటు ఇంటర్నల్ నావిగేషన్‌ను కూడా పొందుతుంది. ఇంటర్నెట్ యాక్సెస్ కోసం Wi-Fi కనెక్టివిటీతో 10.1-అంగుళాల రొటేటబుల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఈ MPV కారులో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించారు. ఈ MPVతో 8 సంవత్సరాలు లేదా 5 లక్షల కిమీల బ్యాటరీ సెల్ వారంటీ వస్తుంది.

టాపిక్