Trade deficit: 26.18 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్య లోటు
Trade deficit: ఇండియా వాణిజ్య లోటు జూన్ 2022లో రికార్డు స్తాయిలో 26.18 డాలర్లకు పెరిగింది.
న్యూఢిల్లీ, జూలై 14: జూన్‌లో భారత సరుకుల ఎగుమతులు 23.52 శాతం పెరిగి 40.13 బిలియన్ డాలర్లకు చేరుకోగా, వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో 26.18 బిలియన్ డాలర్లకు చేరుకుందని గురువారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
గతేడాదితో పోలిస్తే జూన్‌లో దిగుమతులు 57.55 శాతం పెరిగి 66.31 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని డేటా వెల్లడించింది. జూన్ 2021లో వాణిజ్య లోటు 9.60 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఏప్రిల్-జూన్ 2022-23లో మొత్తం కలిపి ఎగుమతులు దాదాపు 24.51 శాతం పెరిగి 118.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దిగుమతులు 49.47 శాతం పెరిగి 189.76 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో వాణిజ్య లోటు 31.42 బిలియన్ డాలర్ల నుంచి 70.80 బిలియన్ డాలర్లకు పెరిగింది.
కాగా జూన్ నెలలో రీటైల్, హోల్ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్భణ రేట్లు స్వల్పంగా తగ్గాయి.
సంబంధిత కథనం