తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blaupunkt 75-inch 4k Tv। భారీ సైజ్ స్క్రీన్, Dts సౌండ్.. దద్దరిల్లి పోవాల్సిందే!

Blaupunkt 75-Inch 4K TV। భారీ సైజ్ స్క్రీన్, DTS సౌండ్.. దద్దరిల్లి పోవాల్సిందే!

HT Telugu Desk HT Telugu

20 September 2022, 23:03 IST

    • Blaupunkt అనే బ్రాండ్ 75-అంగుళాల స్క్రీన్ పరిమాణం కలిగిన స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. డాల్బీ విజన్, డాల్బీ డీటీఎస్ సౌండ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
Blaupunkt 75-Inch 4K TV
Blaupunkt 75-Inch 4K TV

Blaupunkt 75-Inch 4K TV

జర్మనీకి చెందిన ఆడియో-విజువల్ బ్రాండ్ Blaupunkt, తాజాగా 75-అంగుళాల భారీ స్క్రీన్ పరిమాణం కలిగిన స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టీవీలో అనేక ప్రీమియం ఫీచర్లను అందించారు. ఆండ్రాయిడ్ ఆధారితమైన ఈ స్మార్ట్ టీవీ 4K స్క్రీన్ రిజల్యూషన్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ విజన్, డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మోస్ ఇంకా DTS TruSurround సౌండ్ టెక్నాలజీతో దద్దరిల్లే ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా స్మార్ట్ టీవీకి సినిమాటిక్, రిచ్ సౌండ్ క్వాలిటీ సపోర్ట్ ఉంది. మీరు సినీ ప్రేమికులైతే ఇది మీకు ఇంట్లోనే పెద్ద స్క్రీన్, డిజిటల్ శబ్ధాలతో థియేటర్ స్థాయి వినోదాన్ని అందిచడంలో ఏమాత్రం రాజీపడదు.

అదనంగా ఈ టీవీలో డిజిటల్ నాయిస్ ఫిల్టర్, Google అసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి. టీవీలో ఇన్-బిల్ట్ గా 6000 కంటే ఎక్కువ వినోదపు యాప్‌లు, గేమింగ్ యాప్‌లను కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, జీ5 ఒటీటీలు ఉన్నాయి. ఇవన్నీ మిమ్మల్ని మరింత సౌకర్యవంతంగా దృశ్యాన్ని ఆస్వాదించేందుకు ఉపయోగపడతాయి.

ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ఈ టీవీ ధర ఎంత, లభ్యత తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Blaupunkt 75-Inch 4K TV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 4K రిజల్యూషన్‌కు కలిగిన 75-అంగుళాల ఆల్ట్రా HD QLED స్క్రీన్
  • 2 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్
  • క్వాడ్-కోర్ MediaTek MT9602 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిట్ TV 10 ఓఎస్
  • డాల్బీ ఆడియో, డాల్బీ విజన్
  • 60W DTS ట్రూ- సరౌండ్ స్పీకర్లు

కనెక్టివిటీ కోసం WiFi 802.11 ac, బ్లూటూత్ 5.0, 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, AV ఇన్‌పుట్, 1 ఈథర్నెట్ పోర్ట్ ఫీచర్లను కలిగి ఉంది.

Blaupunkt 75-Inch 4K TV ధర

Blaupunkt QLED 75-Inch 4K స్మార్ట్ టీవీ ధర రూ. 84,999గా ఉంది. ఈ టీవీ సెప్టెంబర్ 23, 2022 నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అమ్మకానికి వస్తుంది. వీటితో పాటు 50, 55, 65 అంగుళాల స్క్రీన్ సైజులలో ఇటీవల విడుదల చేసిన QLED TV మోడల్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో అమ్మకానికి ఉంటాయి.

ఈ సేల్‌లో, మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే 8 శాతం తగ్గింపు లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు అలాగే Paytm ద్వారా కొనుగోళ్లపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభించనుంది.