Vu GloLED 4K TV । ఇన్-బిల్ట్ సబ్ వూఫర్ సౌండ్ సిస్టమ్‌తో వచ్చిన గ్లోలెడ్ టీవీలు!
Vu టెలివిజన్స్ బ్రాండ్ నుంచి Vu GloLED TVలు విడుదలయ్యాయి. ఇవి మూడు స్క్రీన్ సైజుల్లో లభిస్తున్నాయి. 104W సబ్ వూఫర్ సౌండ్ సిస్టమ్‌తో వచ్చిన ఈ టీవీలోని ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
భారతీయ వ్యాపారవేత్త దేవిత సరాఫ్ స్థాపించిన 'Vu టెలివిజన్స్' బ్రాండ్, తాజాగా సరికొత్త Vu గ్లోలెడ్ TV సిరీస్ టీవీలను మార్కెట్లో విడుదల చేసింది. ఈ Vu GloLED 4K టీవీలు తమ స్వంత GloPanel డిస్‌ప్లే టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ టెక్నాలజీ ప్రకాశాన్ని 60 శాతం మేర పెంచగలదు. OLED స్థాయి దృశ్యాన్ని వీక్షించవచ్చు. అలాగే ఇందులోని NTSC కలర్ గామట్ 94 శాతంగా ఉంది, ఇది సాధారణ 4K LED TV కంటే చాలా ఎక్కువ. దీంతో టీవీలో చూసే దృశ్యాలు మిమ్మల్ని లీనమయ్యేలా చేస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
అంతేకాదు ఈ టీవీలు 104 వాట్ల సౌండ్ అవుట్‌పుట్ కలిగిన అంతర్నిర్మిత DJ సబ్‌వూఫర్ సౌండ్ సిస్టమ్‌తో వచ్చాయి. కాబట్టి అదనంగా అదనపు సబ్ వూఫర్ యూనిట్ అవసరం లేకుండానే మీరు థియేటర్ లాంటి అనుభూతిని పొందవచ్చు. ఇంకా ప్రత్యేకమైన అడ్వాన్స్‌డ్ క్రికెట్ మోడ్‌ను కలిగి ఉంది. ఇది క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించే సమయంలో 100% బాల్ విజిబిలిటీని అందజేస్తుందని బ్రాండ్ పేర్కొంది.
ఇంకా ఈ టీవీలు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్‌ని కలిగి ఉంటాయి. ఇది వినియోగదారులు తమ టీవీని రిమోట్ లేకుండా నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. టీవీ బ్రైట్ నెస్ దానంతటదే నియంత్రించే యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా కలిగి ఉన్నాయి.
ఈ సరికొత్త Vu GloLED 4K TV సిరీస్, మూడు స్క్రీన్ పరిమాణాలలో వస్తుంది. ఇందులో భాగంగా బేస్ మోడల్ 50-అంగుళాలు , మీడియం రేంజ్ 55-అంగుళాలు అలాగే టాప్-స్పెక్ మోడల్ టీవీ 65-అంగుళాల స్క్రీన్ పరిమాణంతో వచ్చింది. ప్రస్తుతం ఈ మూడు వేరియంట్లు మార్కెట్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ. 34 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మరొక వేరియంట్ 43 అంగుళాల Vu GloLED TV దీపావళి సందర్భంగా విడుదల అవుతుందని కంపెనీ పేర్కొంది.
Vu GloLED 4K TV సిరీస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 4K వీడియో క్వాలిటీ అందించే 50/55/60 అంగుళాల GloPanel డిస్‌ప్లే
- డాల్బీ విజన్, HDR 10+ , 100Hz రిఫ్రెష్ రేట్
- 2 GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్
- Vu Glo AI ప్రాసెసర్
- Google TV OS
- ఇన్-బిల్ట్ DJ క్లాస్ సబ్ వూఫర్, సరౌండ్ సౌండ్ సిటమ్
- Google అసిస్టెంట్- టీవీ రిమోట్
Vu GloLED 4K TV లైనప్ ధరలు, లభ్యత
Vu GloLED 4K TV, 50-అంగుళాల మోడల్ ధర రూ. 33,999/-
Vu GloLED 4K TV, 55-అంగుళాల మోడల్ ధర రూ. 38,999/-
Vu GloLED 4K TV, 65-అంగుళాల మోడల్ ధర రూ. 57,999/-
ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. SBI, HDFC బ్యాంకుల కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.2,000 ప్రారంభోత్సవ డిస్కౌంట్ పొందవచ్చు.
సంబంధిత కథనం