తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Diabetes Day 2022: డిన్నర్ చేయడానికి ఏ టైమ్ బెస్ట్? ఏది వరస్ట్..

World Diabetes Day 2022: డిన్నర్ చేయడానికి ఏ టైమ్ బెస్ట్? ఏది వరస్ట్..

HT Telugu Desk HT Telugu

14 November 2022, 14:33 IST

    • World Diabetes Day 2022: డయాబెటిస్ పేషెంట్లు రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. మరి భోజనం ఏ సమయంలో చేస్తే మేలు? ఏ సమయంలో చేయకూడదు? నిపుణులు ఏమంటున్నారో చూడండి.
రాత్రిపూట భోజనం ఏ సమయంలో చేయాలి?
రాత్రిపూట భోజనం ఏ సమయంలో చేయాలి? (Freepik)

రాత్రిపూట భోజనం ఏ సమయంలో చేయాలి?

Best time for dinner: మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో భోజనం చేసే సమయం కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో స్థిరమైన లేదా అనియంత్రిత గ్లూకోజ్ స్థాయిల వెనుక నిర్ణయాత్మక పాత్ర పోషించే రాత్రి భోజనం ఇంకా కీలకం అవుతుంది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసేవారు, నిద్రవేళలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకునేవారు అధిక షుగర్ లెవల్స్, ఊబకాయంతో బాధపడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి భోజనం త్వరితగతిన ముగించడం వల్ల ఆకస్మిక గ్లూకోజ్ స్థాయి పెరుగుదలను నివారించవచ్చు. అధిక ప్రోటీన్, ఫైబర్ ఉండి, కార్బోహైడ్రేట్లు పరిమితంగా ఉన్న ఆహారం కూడా గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉండేందుకు సాయపడతాయి. మధుమేహం ఉన్నవారు డిన్నర్ చేయడానికి సరైన సమయం గురించి ఇక్కడ తెలుసుకోండి.

problem with late-night eating: ఆలస్యంగా డిన్నర్ చేస్తే ఏమవుతుంది?

‘రాత్రిపూట ఆలస్యంగా తినడం, అది కూడా అధిక కార్బొహైడ్రేట్లు గల ఆహారం తీసుకోవడం, ప్రాసెస్‌డ్ ఫుడ్ తీసుకోవడం, వేళకు సరిగా నిద్రపోకపోవడం, వంటి అంశాలన్నీ శరీరంలో ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయి. రాత్రిపూట లేటుగా తినే వారు, డిన్నర్ సమయంలో ఎక్కువగా పిండి పదార్థాలు ( కార్బొహైడ్రేట్స్) ఉన్న ఆహారం తీసుకునే వారు, నిద్ర వేళలు సక్రమంగా లేనివారిలో అధిక షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది..’ అని ఎండోక్రైనాలజీ, డయాబెటీస్ డిపార్ట్‌మెంట్ హెడ్, సీనియర్ డాక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ మిశ్రా చెప్పారు.

రాత్రి పూట త్వరగా భోజనం చేయాలని, తక్కువ మొత్తంలో కార్బొహైడ్రేట్ ఉన్న ఫుడ్ స్వీకరించాలని, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ కారణంగా జీర్ణ ప్రక్రియ స్మూత్‌గా జరుగుతుందని, రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణంగా ఉంటుందని తెలిపారు.

‘ఒకవేళ తక్కువ స్థాయి గ్లూకోజ్ లెవెల్స్ (హైపోగ్లైసీమియా) ఉంటే కూడా పడుకోవడానికి 2 గంటల ముందు డిన్నర్ తీసుకోవాలి. తిన్న వెంటనే పడుకోవద్దు. అలాగే నూనెలు అధికంగా ఉన్న, పిండిపదార్థాలు అధికంగా ఉన్న ఆహారం జోలికి వెళ్లొద్దు..’ అని డాక్టర్ మిశ్రా చెప్పారు.

Benefits of eating early dinner for diabetics: త్వరగా డిన్నర్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి?

‘సరైన ఆహారం సరైన సమయాల్లో తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రిపూట భోజనం ఆలస్యం చేస్తే మెటబాలిజం దెబ్బతింటుంది. త్వరగా భోజనం తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్‌పై సానుకూల ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెజర్, ట్రైగ్లైజరిడ్స్‌ కూడా అదుపులో ఉంటాయి. త్వరగా డిన్నర్ ముగించిన టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లలో మెరుగైన ఫలితాలు వెలువడ్డాయని ఒక తాజా అధ్యయనం తెలిపింది..’ అని డాక్టర్ తెలిపారు.

How eating late at night could spike sugar levels: రాత్రి లేటైతే షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి?

‘ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. రాత్రి సమయంలో అధిక కేలరీలు, అధిక కార్బొహైడ్రేట్లు తీసుకున్నప్పుడు శరీరం గ్లూకోజు వినియోగించుకోవాల్సిన సమయాన్ని పెంచుతుంది. పగటి పూట అయితే మనం మెలకువతోనే ఉంటున్నందున, శారీరక కదలికలు, శారీరక శ్రమ ఉంటున్నందున శరీరం గ్లూకోజును వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రమిస్తుంది కాబట్టి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కొద్దిసేపటికి లివర్ శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. రాత్రి పూట భోజనం చేసిన తరువాత కార్బొహైడ్రేట్స్‌తో కూడిన ఏవైనా స్నాక్స్ తిన్న వారు మరుసటి రోజు ఉదయం పూట రక్తంలో అధిక షుగర్ లెవెల్స్ కనిపించడం గమనించవచ్చు..’ అని డాక్టర్ మిశ్రా చెప్పారు.

What feeling hungry in the middle of the night means: అర్ధరాత్రి ఆకలేసినట్టు అనిపిస్తోందా?

అర్ధరాత్రి ఆకలి వేసినట్టు అనిపించడం షుగర్ లెవల్స్ పడిపోయినట్టు సూచిస్తుంది. ఇలాంటి వారు డయాబెటిస్ ఉన్నప్పుడు తగిన డైట్ తీసుకోవడం ఉపశమనాన్ని ఇస్తుంది. డయాబెటిస్ పేషెంట్లు మందులు గానీ, ఇన్సూలిన్ గానీ తీసుకునే సందర్భాల్లో కూడా షుగర్ లెవెల్స్ పడిపోయి అర్ధరాత్రి ఆకలిగా అనిపించవచ్చు.

‘ఇలాంటి సందర్భాల్లో, అంటే అర్ధరాత్రి ఆకలి వేసినప్పుడు పేషెంట్లు వారి షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పడిపోయేలా చేసేవి కాకుండా, నిధానంగా షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచే మెడిసిన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అలాంటప్పుడు హైపర్ గ్లైసీమియా పరిస్థితి రాదు. షుగర్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఒకవేళ మీ ఔషధాలకు అలాంటి స్వభావం లేనప్పుడు అతిగా భోజనం చేసే అలవాటు మానుకోవాలి. ఇక కుకీస్ వంటి వాటి స్థానంలో నట్స్, గింజ ధాన్యాలు, పండ్లు అలవాటు చేసుకోవాలి..’ అని డాక్టర్ సూచించారు.

Best and worst time to have dinner for diabetics: ఏది ఉత్తమ సమయం? ఏది చెత్త సమయం?

రాత్రిపూట 8 నుంచి 9 లోపే డిన్నర్ పూర్తి చేయడానికి అత్యుత్తమ సమయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు గానీ, రాత్రిపూట ఆలస్యంగా గానీ డిన్నర్ చేయరాదని సూచిస్తున్నారు.

ఇంకా ఆయుర్వేద వైద్య నిపుణులైతే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యే భోజనం ముగించాలని సూచిస్తున్నారు.

టాపిక్