తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  డయాబెటిస్ సమస్య కలిగిన వారు ఏ పండ్లు తీసుకోవడం మంచిది, ఏవి తీసుకోవద్దు?

డయాబెటిస్ సమస్య కలిగిన వారు ఏ పండ్లు తీసుకోవడం మంచిది, ఏవి తీసుకోవద్దు?

Manda Vikas HT Telugu

28 December 2021, 9:14 IST

    • సహజసిద్ధంగా లభించే పండ్ల విషయంలోనూ డయాబెటిస్ కలిగిన వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే పండ్లలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో ఫ్రక్టోజ్ అని పిలిచే సహజమైన చక్కెర సమ్మేళనం ఉంటుంది. అలాంటి పండ్లు తీసుకోవడం ద్వారా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
A well-balanced diet filled with colorful fruits and vegetables
A well-balanced diet filled with colorful fruits and vegetables (MINT_PRINT/ istockphoto)

A well-balanced diet filled with colorful fruits and vegetables

డయాబెటిస్ సమస్య ఉన్నవారు కచ్చితమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. తీపి పదార్థాలను ఏమాత్రం తీసుకోకూడదు. సహజసిద్ధంగా లభించే పండ్ల విషయంలోనూ డయాబెటిస్ కలిగిన వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే పండ్లలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో ఫ్రక్టోజ్ అని పిలిచే సహజమైన చక్కెర సమ్మేళనం ఉంటుంది. అలాంటి పండ్లు తీసుకోవడం ద్వారా అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అయినా కూడా కొన్ని రకాల పండ్లను భోజనంలో భాగంగా తీసుకోవడం ద్వారా విటమిన్లు, ఖనిజాలు, ఫైటోకెమికల్స్ శరీరానికి అందుతాయి. ఇవి హైబీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్, స్ట్రోక్, వాపు మొదలగు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతాయి.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం..

షుగర్ ఉన్నవారికి గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున సరైన పండ్లు తీసుకోవడం ఎంతో మంచిది. చాలా పండ్లలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదింపజేసి రక్తంలో చక్కెర పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయగలుగుతారు.

ఈ వ్యాధి కలిగిన వారు ఎలాంటి పండ్లను తీసుకోవాలో తెలియజేస్తున్నాం. ఈ ఫ్రూట్స్ డయాబెటిక్-ఫ్రెండ్లీ మాత్రమే కాకుండా ఇందులో ఫైబర్, నీటి కంటెంట్‌ సమృద్ధిగా ఉంటాయి. అన్నింటికీ మించి ఇందులో చక్కెర శోషణ రేటు తక్కువగా ఉంటుంది.

యాపిల్స్: 

ఒక అధ్యయనం ప్రకారం, ఆపిల్ పండ్లను మితంగా తీసుకుంటే అవి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.

బెర్రీలు: 

బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్ లేదా స్ట్రాబెర్రీలు ఏవైనా కానీ, వీటన్నింటిలో యాంటీఆక్సిడెంట్‌లు, విటమిన్లు, ఫైబర్‌లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్ కలిగిన వారు తినొచ్చు.

బొప్పాయి: 

బొప్పాయి పండులో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

ఆరెంజ్: 

ఈ సిట్రస్ ఫ్రూట్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను నెమ్మదించేలా చేస్తుంది. అంతేకాకుండా ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

కివి పండు: 

కివి పండ్లలో విటమిన్లు ఈ, కే,లతో పాటు పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉండి చక్కెర తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహాం ఉన్నవారు కివీస్ ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.

డ్రాగన్ ఫ్రూట్:

ఈ పండులో ఫైబర్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలున్న వారైనా ఈ పండు తీసుకోవచ్చు.

పుచ్చకాయలు:

మధుమేహం ఉన్నవారుపుచ్చకాయలు "మితంగా" తినాల్సిందిగా సిఫార్సు చేయడమైంది. ఇందులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, సి లాంటి పోషకాలు అందించడంతో పాటు హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

వీటితో పాటు పియర్స్, అవకాడో, స్టార్ ఫ్రూట్స్ , చెర్రీస్, మ్యాంగోస్ కూడా తీసుకోవచ్చు. సలాడ్స్ రూపంలో తీసుకుంటే రుచికోసం దాల్చినచెక్క పొడిగా చేసుకొని చల్లుకోవచ్చు. అలాగే వాల్‌నట్స్, బాదం, అవిసె గింజలు కూడా షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి.

ఏవి తీసుకోకూడదు?

డయాబెటిస్ కలిగిన వారు ఎండిన ఖర్జూరాలు, పైనాపిల్స్, అతిగా పండిన అరటిపండ్లు, ఎక్కువగా పుచ్చకాయలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఏదేమైనా అన్ని రకాల పండ్లలో ఎంతో కొంత చక్కెర శాతం ఉన్నప్పటికీ, అవి అధిక మొత్తంలో పీచును కలిగి ఉంటాయి. ఇది రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను తగ్గిస్తుంది. కాబట్టి పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని అధ్యయనాలు పేర్కొన్నాయి.

టాపిక్