తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Benefits Of Talking : సెక్స్ ఒక్కటే కాదు.. పని అయ్యాక ఇది కూడా ముఖ్యమే

Benefits Of Talking : సెక్స్ ఒక్కటే కాదు.. పని అయ్యాక ఇది కూడా ముఖ్యమే

HT Telugu Desk HT Telugu

12 March 2023, 20:45 IST

    • Benefits Of Talk : సెక్స్ చేశాక చాలా మంది మగాళ్లు.. ఇక సైలెంట్ అయిపోతారు. పని అయిపోయిందిగా.. ఓ కునుకు వేద్దాం అనుకుంటారు. కానీ మహిళలకు అలా నచ్చదట. కాసేపు మాట్లాడితే.. హ్యాపీ ఫీలవుతారట.
సెక్స్ ఎడ్యుకేషన్
సెక్స్ ఎడ్యుకేషన్

సెక్స్ ఎడ్యుకేషన్

సెక్స్ జరగక ముందు ఎన్ని మాట్లాడుకుంటారో.. శృంగారం జరిగాక కూడా.. మాట్లాడుకోవడం చాలా మంచిది. శృంగారం(Sex) అయిపోయాక చాలా మంది మాగాళ్లు.. సైలెంట్ గా పడుకుంటారు. కానీ మహిళలు అలా కాదు.. తమ భాగస్వామి ఎద మీద నిద్రపోవాలని కోరుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడాలని తపిస్తారు. కానీ మగవారు మాత్రం.. నిశ్శబ్ధంగా ఉంటారు. మరికొంతమందైతే.. అస్సలు దగ్గరకు రానివ్వరు. కాని ఇలా చేయడం సరికాదని నిపుణులు చెప్పేమాట.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

సెక్స్ తర్వాత(After Sex).. ఆ ఫీలింగ్ ను పార్టనర్ తో పంచుకుంటేనే.. తర్వాత.. పరిస్థితులు బాగుంటాయట. ఎలా చేయాలో.. ముందుగా మాట్లాడుకుంటారు కదా.. ఎలా చేశారో.. తర్వాత ఎలా చేయాలో కూడా మాట్లాడుకోవడం కూడా ముఖ్యమే. సెక్స్ చేశాక కూడా మీరు ఉండే విధానాన్ని బట్టి.. మీ జీవితం(Life) బాగుంటుంది. సెక్స్ తర్వాత మాట్లాడుకోవాలని ఎక్కువగా అనుకుంటారు ఆడవాళ్లు. అందుకే పని అపిపోయాక.. మగాడికి దగ్గరగా వస్తారు. తన భాగస్వామి ఓన్లీ సెక్స్ కోసం మాత్రమే ఉంటాడు అనే విషయాన్ని తట్టుకోలేరు.

శృంగారం జరిగాక.. మరోవైపు ముఖం తిప్పుకొని పడుకుంటే.. మీ బంధం(Relation) మీద తప్పకుండా ఎఫెక్ట్ పడుతుందట. కాసేపు మాట్లాడితే.. ఆడవారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారట. ఇలా మాట్లాడితే.. ఒకరినొకరు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. సెక్స్ తర్వాత నిశ్శబ్ధంగా ఉంటే.. ఆడవారు ఇష్టపడరు. ఏదో అసౌకర్యంగా ఫీల్ అవుతారు. శృంగారం అయిపోయాక.. ఏం మాట్లాడారు అన్నది కాదు.. ఏదో ఒకటి మాట్లాడండి. మీ ఎద మీద.. మీ భాగస్వామి తల పెట్టుకుని.. కబుర్లు చెప్పండి.

సైలెంట్ గా ఉంటే.. ఆడవారికి నచ్చదు. నాతో పంచుకునేందుకు ఇంకేమీ లేదా.. ఇదే ఒక పని మాత్రమేనా అనే ఆలోచన వారికి రాకుండా చేయాలి. అప్పుడే మీరు హ్యాపీగా ఉంటారు. నమ్మకమైన, ఎమోషనల్(Emotional) రిలేషన్ షిప్ లో ఉండేందుకు ఇష్టపడే స్త్రీలు.., సెక్స్ తర్వాత సైలెన్స్ ను ఇష్టపడరు. అలా ఉండే బాధపడుతారు. ఇంటరాక్షన్ వల్ల ఇద్దరూ ఒకరికొకరు ఇంకా దగ్గర అవుతారని భావిస్తారు. ఈ సమయంలో వారి ఆశలు, కోరికలు, ఎదుర్కొంటున్న ఒత్తిడి(Stress) గురించి మాట్లాడాలని అనుకుంటారు.

శరీరాలు ఏకం చేసే అనుభవం తర్వాత.. గుడ్ నైట్(Good Night) చెప్పేసి పడుకుంటే.. ఆడవారు అభద్రతా భావానికి లోనవుతారట. సెక్క్ ఒక్కటే కాదు.. ఆ తర్వాత సమయం కూడా ముఖ్యమే. అయితే కొంతమంది ఆడవాళ్లు.. సైలెంట్ గా కూడా ఉండొచ్చు. అది వారి మైండ్ సెట్ ను బట్టి ఉంటుంది.