Low Sex Desire : సెక్స్ చేయాలని ఉన్నా.. ఆ సమస్య ఎదురవుతుందా?-low sex desire sign men shows fat blood blocked veins seriously symptom high cholesterol details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Low Sex Desire Sign Men Shows Fat Blood Blocked Veins Seriously Symptom High Cholesterol Details Inside

Low Sex Desire : సెక్స్ చేయాలని ఉన్నా.. ఆ సమస్య ఎదురవుతుందా?

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 09:00 PM IST

Low Sex Desire : కొంతమంది సెక్స్ చేయాలని ఉన్నా.. కొన్ని కారణాలతో చేయడం కుదరదు. భాగస్వామితో చెప్పుకోలేరు. ఏదో తెలియని టెన్షన్ మెుదలవుతుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

సెక్స్ సమస్యలు
సెక్స్ సమస్యలు

మీరు అకస్మాత్తుగా సెక్స్ చేయాలని భావిస్తే, చేసేందుకు సిద్ధంగా లేకపోతే.. అది నరాల అడ్డంకికి సంకేతం కావచ్చు. చాలా సార్లు నరాలలో అడ్డంకులు పెరిగినప్పుడు, టెస్టోస్టెరాన్(testosterone) స్థాయి కూడా తగ్గుతుంది. ఇది సెక్స్ కోరిక(Sex Desire)ను తగ్గిస్తుంది. ఇది మాత్రమే కాదు, అధిక కొలెస్ట్రాల్ సైడ్ ఎఫెక్ట్ కూడా తక్కువ లిబిడోకు కారణం అవుతుంది.

సిరల్లో కొవ్వు స్థాయి పెరిగినప్పుడు, రక్త ప్రసరణ ప్రభావితం కావడం ప్రారంభమవుతుంది. ఈ కారణంగా రక్తం ప్రవాహం శరీరంలోని అన్ని భాగాలకు, ముఖ్యంగా నడుము కిందకు చేరదు. కింది నుంచి పైభాగానికి రక్తం ప్రవహించడం చాలా నెమ్మదిగా ఉంటుంది. దీని కారణంగా కాళ్లలో నొప్పి, కండరాలలో ఉద్రిక్తత తక్కువగా ఉంటుంది. పురుషులు సెక్స్‌(Sex)కు సంబంధించిన సమస్యలను చూస్తున్నట్లయితే, వారు అప్రమత్తంగా ఉండాలి.

మీకు సెక్స్ చేయాలనే కోరిక అనిపించినా, పురుషాంగం సహకరించకపోయినా.., గట్టిపడకపోయినా.., నరాల అడ్డుపడే సంకేతం. ఇది చాలా ప్రమాదకరం. రక్త ప్రసరణ లేకపోవడం, దీని వెనుక కారణం అధిక కొలెస్ట్రాల్ కావచ్చు.

యూనివర్శిటీ ఆఫ్ టొరంటో అధ్యయనం ప్రకారం, మీ సెక్స్ కోరిక అకస్మాత్తుగా తగ్గిపోయి. లిబిడోను ప్రేరేపించే అన్ని ప్రయత్నాలు విఫలమైతే, మీ టెస్టోస్టెరాన్ స్థాయి చాలా తక్కువగా ఉందని అర్థం. దీని వెనుక అధిక కొలెస్ట్రాల్(cholesterol) కూడా కారణం. ఇది ప్రమాదానికి సంకేతం. మెదడులో రక్త ప్రసరణ ప్రభావితం అయినప్పుడు హార్మోన్లు కూడా ప్రభావితమవుతాయి. కొన్నిసార్లు నరాలలో అడ్డుపడటం వలన సెక్స్ డ్రైవ్(Sex Drive) కూడా ప్రభావితమవుతుంది.

అధిక కొలెస్ట్రాల్ కారణంగా నెమ్మదిగా రక్త ప్రసరణ జరుగుతుంది. దీనిద్వారా సమస్యలు వస్తాయి. చాలా సార్లు కాళ్లలో విపరీతమైన నొప్పిని కూడా కలిగిస్తుంది. చేతులు, కాళ్ళలో జలదరింపు లేదా సూదిలా పొడిచిన అనుభూతి. అకస్మాత్తుగా చేయి, పాదాలు ఉబ్బుతాయి. శ్రమ లేకున్నా.. అలసిపోయినట్లు అనిపిస్తుంది. పని మీద ఏకాగ్రత లేక పోవడం లేదా నెర్వస్ ఫీలింగ్ ఉంటుంది. చర్మం(Skin) రంగు పసుపు రంగులోకి మారడం జరుగుతుంది. కీళ్లలో నొప్పి, కండరాల ఉద్రిక్తతతో పాటు జలదరింపు వస్తుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు కూడా వస్తాయి.

గమనిక : ఈ కథనం సమాచారాన్ని అందించడం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel