తెలుగు న్యూస్  /  Lifestyle  /  Adventure Safety Tips Dos And Don'ts For Attempting Adventure Sports This Summer

Adventure Safety Tips | బంగీ జంప్‌లు కూడా మీ భంగిమను మార్చేయగలవు.. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే!

HT Telugu Desk HT Telugu

11 May 2023, 13:41 IST

    • Adventure Safety Tips: మీకు సాహసక్రీడలలో పాల్గొనటం ఇష్టమా? అడ్వెంచర్లు చేసేటపుడు చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి.
Adventure Safety Tips:
Adventure Safety Tips: (Unsplash)

Adventure Safety Tips:

Adventure Safety Tips: వేసవి సెలవులను ఆస్వాదిస్తున్నారా? మనలో చాలా మంది ఇప్పటికే విహారయాత్రలు ప్లాన్ చేసుకొని ఉండవచ్చు ఇందులో భాగంగా సాహసక్రీడలను ఇష్టపడేవారు ఉత్కంఠభరితమైన క్షణాలను ఆస్వాదించడానికి ఎదురు చూస్తుండవచ్చు. అడ్వెంచర్స్ చేయాలని ఇష్టపడే వారికి వాటర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్, రాక్ క్లైంబింగ్, స్కైడైవింగ్ ఇలా ఎన్నో రకాల సాహస క్రీడలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యకలాపాలన్నీ దాదాపు సురక్షితమైనవే, మీకు ఉల్లాసాన్ని, ఉత్కంఠతను పంచేవే. అయినప్పటికీ వీటితో రిస్క్‌లు, సవాళ్లు కూడా ఉన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ క్రీడలు కూడా ప్రమాదకరంగా మారతాయి.

బంగీ జంప్ లాంటివి మీ భంగిమను కూడా మార్చేయగలవు. ఎందుకంటే మీ వెన్నుపూస చాలా సున్నితమైన భాగం. మిమ్మల్ని తల కిందకు, కాళ్లు పైకి వచ్చేలా తాడుతో వేలాడదీసి పైకి లాగినప్పుడు మీ శరీరం ఎదుర్కొనే తీవ్రమైన ఒత్తిళ్ల వల్ల దానికి హాని కలగవచ్చు. కంప్రెషన్ ఫ్రాక్చర్స్, వెన్నెముక ఎముకలు విరగటం, హెర్నియేటెడ్ డిస్క్‌లు, వెన్నుపూసల మధ్య ఖాళీలు రావడం జరగవచ్చు. ఇది మీ శరీరాకృతిని మార్చగలదు. ఒక్క బంగీ జంప్ మాత్రమే ప్రమాదకరమైనది అని చెప్పడం లేదు, సాహసకృత్యాలలో పాల్గొనకుండా భయపెట్టాలని కాదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ ఉద్దేశ్యం.

సెలవుల్లో మీ విహారయాత్ర మనోహరమైన యాత్రగా సాగాలంటే, సాహస క్రీడలను ప్రయత్నించే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను జంపిన్ హైట్స్ బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ నిహారిక నిగమ్ HT లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు.

అడ్వెంచర్లలో పాల్గొనే ముందు మీరు శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి.

ఏదైనా సాహస క్రీడను ప్రయత్నించే ముందు, దానిలోని కష్టనష్టాల గురించి మీ సొంతంగా కొంత పరిశోధన చేయడం ముఖ్యం. అవసరమైన పరికరాలు లేదా ముందస్తు శిక్షణ గురించి తెలుసుకోండి.

Dos and don'ts for attempting adventure sports- అడ్వెంచర్లు చేసేటపుడు చేయాల్సినవి, చేయకూడనివి

  1. అడ్వెంచర్లలో పాల్గొనేటపుడు వాటికి తగినట్లుగా హెల్మెట్‌లు, లైఫ్ జాకెట్‌లు, వాతావరణానికి తగిన దుస్తులు కచ్చితంగా ధరించాలి.
  2. చాలా సాహస క్రీడలకు కొంత శిక్షణ అవసరం. క్రీడలో అనుభవం ఉన్న నిపుణులచే శిక్షణ పొందడం ముఖ్యం. వారు మీకు సరైన పద్ధతులను నేర్పించగలరు, అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో మీకు సహాయపడగలరు.
  3. సాహస క్రీడలలో పాల్గొంటున్నప్పుడు అకస్మాత్తుగా వాతావరణం మారవచ్చు. ఊహించని సవాళ్లు ఎదురవచ్చు. కాబట్టి గైడ్స్ చెప్పే మాటలు, జాగ్రత్తలు శ్రద్ధగా వినండి. ఏవైనా ప్రశ్నలు అడగడానికి లేదా మీ ఆందోళనలను వ్యక్తం చేయడానికి బయపడకండి. అవి అనుకోని పరిస్థితులలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి.
  4. మీరు ఎండలో శ్రమిస్తున్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. మీరు అడ్వెంచర్ కు ముందు, తర్వాత, ఎప్పుడైనా పుష్కలంగా నీరు త్రాగాలని నిర్ధారించుకోండి.
  5. మీ సామర్థ్యానికి మించిన కార్యాచరణను ప్రయత్నించండి, మీ సరిహద్దులను తెలుసుకోవడం కీలకం. మీకు నైపుణ్యం లేదా అనుభవం లేని వాటిని ప్రయత్నించవద్దు.

చివరగా చెప్పేది ఏమిటంటే.. అడ్వెంచర్లను ఆస్వాదించండి, భయపడి మీ ఆనందాన్ని కోల్పోకండి. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సాహసం శ్వాసగా సాగిపోండి.