తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holiday Adventures| అడ్వెంచర్స్ ఇష్టపడేవారు.. ఈ హాలిడే సీజన్‌లో ఈ ఐదింటిలో ఏదో ఒకటి అదరగొట్టండి!

Holiday Adventures| అడ్వెంచర్స్ ఇష్టపడేవారు.. ఈ హాలిడే సీజన్‌లో ఈ ఐదింటిలో ఏదో ఒకటి అదరగొట్టండి!

HT Telugu Desk HT Telugu

25 December 2022, 11:50 IST

    • Holiday Adventures - క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారా? మీరు అడ్వెంచర్ ప్రియులైతే మీరు ఈ సీజన్‌లో ప్రయత్నించగలిగే కొన్ని ఉత్తేజకరమైన అడ్వెంచర్స్ ఇక్కడ చూడండి.
Exciting Adventure Activities
Exciting Adventure Activities (Pixabay)

Exciting Adventure Activities

Holiday Adventures: ఇది సెలవుల సీజన్, చాలా మంది తమ సెలవులను ఆస్వాదిస్తున్నారు. క్రిస్మస్ (Christmas) మొదలుకొని నూతన సంవత్సరానికి (Happy New Year 2023) స్వాగతం పలకడం వరకు చాలా మందికి చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. కానీ అసలు సమయం వచ్చేసరి ఏం చేయాలో తోచదు. మీ సెలవులను గొప్పగా మార్చేందుకు ఏమేమి చేయవచ్చో మీకు కొన్ని ఉపాయాలను ఇక్కడ అందిస్తున్నాం.

ట్రెండింగ్ వార్తలు

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

Chewing Food : ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలితే ఆరోగ్యానికి మంచిది

Almond Skin Care Tips : బాదం పప్పును ఇలా వాడితే మీ చర్మం మెరిసిపోతుంది.. ట్రై చేయండి

Chana Masala Recipe : శనగలతో ఇలా రెసిపీ చేస్తే.. చపాతీ, రైస్‌లోకి లాగించేయెుచ్చు

ఈ హాలిడే సీజన్ మీరు ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపేందుకు ఒక అవకాశం. మంచి విహారయాత్రకు వెళ్లడం, మనసును సంతోషపరిచే ఎన్నో ఉల్లాసభరితమైన కార్యకలాపాలను మునిగితేలడం ద్వారా మీ సెలవురోజులను వేడుక జరుపుకోవచ్చు.

ముఖ్యంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ ఏడాదికి ఘనమైన ముగింపును ఇవ్వడానికి మిమ్మల్ని థ్రిల్ చేసే అనేక కార్యకలాపాలు ఉన్నాయి. ఈ హాలిడే సీజన్‌లో మీరు తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన ఐదు అడ్వెంచర్ యాక్టివిటీలను హాలిడే ప్లానర్స్ సూచిస్తున్నారు. ఈ అడ్వెంచర్లలో మీరు పాల్గొని, హుషారుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలకండి.

1. బంగీ జంపింగ్

ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సాహస కార్యకలాపాలలో ఒకటి. జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలనుకునే సాహస కార్యకలాపాలలో ఇది ఒకటి. ఇప్పుడు చాలా చోట్ల అడ్వెంచర్ పార్కులు ఉన్నాయి, వాటిలో బంగీ జంప్ ఎంచుకొని మీ కలను నెరవేర్చుకోవచ్చు. రిషికేష్ పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి అడ్వెంచర్లు చాలా జరుగుతాయి. మీరు అటువైపు విహారయాత్రకు వెళ్తే ఈ అడ్వెంచర్‌ను మిస్ చేయకండి.

2. జెయింట్ స్వింగ్

ఇది మరొక ఆహ్లాదకరమైన సాహస కార్యకలాపం, ఇది మీకు ఎంతో ఉత్సాహం, థ్రిల్‌ను పంచుతుంది. సినిమాల్లో టార్జాన్ ఈ చోటు నుంచి మరొక చోటుకు ఊడలు పట్టుకొని వెళ్లటం మీరు చూసే ఉంటారు. అదే తరహాలో మీ నడుముకు సురక్షితంగా కేబుల్స్ కట్టి మిమ్మల్ని తోసేస్తారు. మీరు గాల్లో దూసుకెళ్తుంటే అప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. రిషికేష్ ప్రాంతంలో ఉంది, మన హైదరాబాద్ లోకి కొన్ని అడ్వెంచర్ పార్కుల్లోనూ జెయింట్ స్వింగ్ అడ్వెంచర్లకు అవకాశం కల్పిస్తున్నారు.

3. ఫ్లయింగ్ ఫాక్స్

ఫ్లయింగ్ ఫాక్స్ అనేది మరొక అడ్వెంచర్ యాక్టివిటీ. ఇక్కడ మీరు సూపర్‌మ్యాన్ లాగా, భూమికి సమాంతరంగా సుమారు 150 kmph వేగంతో కొండల నడుమ ఉండే జంప్ ప్లాట్‌ఫారమ్ నుండి జిప్ లైన్‌లో బయలుదేరుతారు. ఇది అందమైన ప్రకృతి దృశ్యాల ద్వారా పక్షిలా ఎగురుతున్న అనుభూతిని ఇస్తుంది. ఫ్లయింగ్ ఫాక్స్ అడ్వెంచర్‌ను మీరు ఎంచుకుంటే అరుపులు, కేకలే. ఎన్నిసార్లయినా ఈ అడ్వెంచర్ చేయాలనిపిస్తుంది.

4. స్కీయింగ్

స్కీయింగ్ అనేది మంచుతో నిండిన కొండలపైన చేయగలిగే అద్భుతమైన సాహస క్రీడ. మన భారతదేశంలో ప్రత్యేకంగా ఈ చలికాలంలో హిమాలయా శ్రేణులలో నిర్వహించే అత్యంత ప్రసిద్ధమైన సాహస క్రీడ. మంచుకురిసే దారుల్లో, చల్లటి గాలిని వెదజల్లుతూ, థ్రిల్లింగ్ పంచే సాహస క్రీడ. ఈ వింటర్ సీజన్‌లో కులు, మనాలి, గుల్మార్గ్ మొదలైన ప్రాంతాల్లో స్కీయింగ్ ఆస్వాదించవచ్చు.

5. ట్రెక్కింగ్

వీకెండ్ వచ్చిందంటే చాలా మంది ట్రెక్కింగ్ వెళ్తారు. ట్రెక్కింగ్ కేవలం ఒక సాహసోపేతమైన కార్యకలాపం మాత్రమే కాదు, ఇది ఒక గొప్ప కార్డియోవాస్కులర్ వ్యాయామం కూడా. జీవితంలో కనీసం ఒక్కసారైనా ట్రెక్కింగ్ చేయడానికి ప్రయత్నించాలి, ముఖ్యంగా శీతాకాలం హాలిడే సీజన్‌లో మంచుతో కప్పబడిన అనేక ప్రాంతాలకు ట్రెక్కింగ్ చేయడం, ఎత్తైన శిఖరాలను అధిరోహించడం, ఉత్కంఠభరితమైన వీక్షణలు ఆస్వాదించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి.

తదుపరి వ్యాసం