తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mountain Passes। రోడ్ ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? మిమల్ని మంత్రముగ్ధుల్ని చేసే పర్వత బాటలు ఇవిగో!

Mountain Passes। రోడ్ ట్రిప్‌కు ప్లాన్ చేస్తున్నారా? మిమల్ని మంత్రముగ్ధుల్ని చేసే పర్వత బాటలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu

14 December 2022, 17:43 IST

    • Mountain Passes: మీరు ఏదైనా సాహసోపేతమైన రోడ్డు ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారా? హిమాలయా శిఖరాల నడుమ ఉన్న ఈ అద్భుతమైన అబ్బురపరిచే పర్వతబాటల గురించి తెలుసుకోండి.
Mountain Passes Dungri La pass
Mountain Passes Dungri La pass

Mountain Passes Dungri La pass

ఏదైనా రోడ్డు ట్రిప్ (Road Trip) కు వెళ్లేటపుడు సమాంతరంగా ఉండే రహదారులపై ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. వేగంగా దూసుకెళ్తూ, త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కానీ వంపులు తిరుగుతూ ఎత్తైన కొండల నడుమ ప్రయాణం ఉత్కంఠభరితంగా ఉంటుంది. థ్రిల్ కోరుకునే సాహసికులు ఇలాంటి ప్రయాణాలనే ఎక్కువ ఇష్టపడతారు. ఇదే ప్రయాణం ఇంకా ఎత్తులో మంచు పర్వత శిఖరాగ్రాల నడమ సాగుతుంటే అది మాటల్లో చెప్పలేని అనుభూతి. అక్కడి నుంచి కనిపించే దృశ్యాలు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

హిమాలయాలు భారతదేశానికి సహజంగా లభించిన గొప్ప సంపద. ఈ చోట కఠినమైన భూభాగాలు లెక్కించలేని సంఖ్యలో ఉన్నాయి. అవి ఘనమైన పర్వత పాస్‌లకు నిలయంగా ఉన్నాయి. ఈ మౌంటైన్ పాస్‌లు భారతదేశ విలక్షణతను చాటుతాయి. వాటి వైభవాన్ని స్వయంగా అనుభూతి చెందేందుకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు. మెలికలు తిరిగే ఎత్తైన రహదారుల్లో ప్రయాణాలు చేస్తూ తమ యాత్రను ఆస్వాదిస్తారు.

Himalayan Mountain Passes- హిమాలయా పర్వత బాటలు

భారతదేశంలోని అలాంటి కొన్ని అత్యంత సుందరమైన పర్వత మార్గాలను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం. మీరు ఇక్కడకు రోడ్ ట్రిప్ చేస్తే గనక అవి వాటి సౌందర్యం, సహజ వైభవంతో మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

ఖార్దుంగ్ లా పాస్- Khardung La Pass

భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సాహస మార్గాలలో ఒకటి ఖర్దుంగ్ లా పాస్ ఒకటి. ఇది 17,582 అడుగుల ఎత్తులో నుబ్రా వ్యాలీ- ష్యోక్ లోయలను కలుపుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రయాణం చేయాలంటే డ్రైవింగ్ శిక్షణలో ఆరితేరి ఉండాలి. ఎందుకంటే మీరు అనేక పదునైన మలుపులు, కష్టమైన భూభాగాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఇక్కడికి ప్రయాణం చేస్తే మాత్రం ఇక్కడి అద్భుతమైన దృశ్యాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు ఒక్కసారిగా మీ హృదయాన్ని తరింపజేస్తాయి. ఇక్కడికి చేరుకోవడానికి, మీకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నేరుగా లేహ్‌కి చేరుకొని అక్కడ్నించి ఈ పాస్‌కు ప్రయాణం ప్రారంభించండి.

రోహ్‌తంగ్ పాస్- Rohtang Pass

మనాలి నుండి 51 కి.మీ దూరంలో లేహ్-మనాలి హైవేపై రోహ్‌తంగ్ పాస్ ఉంది. ఇది కూడా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పాస్‌లలో ఒకటి. ఈ రహదారి డ్రైవర్లకు ఎంతో ఇష్టమైనది, ఇది కులు వ్యాలీని లాహౌల్ అలాగే స్పితి ప్రాంతాలతో కలుపుతుంది. అయితేఇక్కడికి వెళ్లాలంటే మీకు రోహ్‌తంగ్ పాస్ పర్మిట్ అవసరం. వాతావరణం లేదా ఇతర భద్రతా కారణాల వల్ల భారత ప్రభుత్వం ఏడాది పొడవునా ఈ మార్గాన్ని తరచుగా మూసివేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి, మీరు ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ముందస్తు రిజర్వేషన్‌లు చేసుకోవడం మంచిది.

చాంగ్ లా పాస్- Chang La Pass

చాంగ్ లా అనేది ప్రపంచంలోనే మూడవ ఎత్తైన మోటరబుల్ పాస్. ఇది 17,688 అడుగుల ఎత్తులో ఉంది. లేహ్ - ష్యోక్ రివర్ వ్యాలీ ఈ అద్భుతమైన పర్వత మార్గం ద్వారా అనుసంధానించి ఉన్నాయి. మీరు చాంగ్ లా గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఉత్కంఠభరితమైన వీక్షణలు, అబ్బురపరిచే దృశ్యాలు చూడవచ్చు. బాలీవుడ్ చిత్రం '3 ఇడియట్స్' లో కనిపించే అద్భుతమైన లొకేషన్ పాంగోంగ్ త్సో సరస్సును కూడా ఇక్కడ చూడవచ్చు.

డుంగ్రి లా పాస్- Dungri La Pass

భారత్ అలాగే టిబెట్ భూభాగాలను కలిపే ఒక ముఖ్యమైన ప్రదేశం డుంగ్రి లా పాస్. దీనినే మనా పాస్ అని కూడా పిలుస్తారు. ఇది 5610 మీటర్ల ఎత్తులో ఉండే మోటారు రోడ్లలో ఒకటి. హిందూ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయాన్ని డుంగ్రి లా మీదుగానే చేరుకోవాల్సి ఉంటుంది. చాలా మంది మోటార్‌సైకిల్ రైడర్లు, సాహస యాత్రికులు ఈ పాస్ గుండా ప్రయాణిస్తారు. అయితే డుంగ్రి లా పాస్ అనుమతులు పొందడం అంత సులభం కాదు.

ఉమ్లింగ్ లా పాస్- Umling La Pass

ఇది కూడా ఒక ప్రపంచంలోనే ఎత్తైన మోటరబుల్ పాస్. ఇది చిస్ములే, డెమ్‌చోక్‌లను లేహ్‌కు కలుపుతుంది. ఇది లద్దాఖ్ అద్భుతమైన, వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలకు కేంద్రం. ఇది ఉత్తర సరిహద్దు అయిన భారత్- చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్నందున ఇక్కడకు వెళ్లడానికి ఇన్‌సైడ్ లైన్ పర్మిట్ అవసరం.

డోంగ్ఖా లా పాస్- Dongkha La Pass

తూర్పు హిమాలయాల్లోని సిక్కింను, టిబెట్‌ను కలుపుతూ భారతదేశంలో డోంగ్ఖా లా పాస్ ఉంది. ఇది 18,000 అడుగుల ఎత్తులో ఉన్న అత్యంత కష్టతరమైన బాట. అయినప్పటికీ, ఉత్కంఠభరితమైన వీక్షణలు, దాని చుట్టూ ఉన్న సుందర పరిసరాలు మీ యాత్రను ఎంతో విలువైనవిగా చేస్తాయి. ఇండో-టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉన్నందున, ఇక్కడికి వెళ్లడానికి మీరు తప్పనిసరిగా ఇన్నర్ లైన్ అనుమతిని పొందాలి.

టాపిక్

తదుపరి వ్యాసం