తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Adventure Sports In Manali : మనాలిలో మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిన అడ్వెంచర్స్ లిస్ట్ ఇదే.. ధరలు ఎంతంటే..

Adventure Sports in Manali : మనాలిలో మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిన అడ్వెంచర్స్ లిస్ట్ ఇదే.. ధరలు ఎంతంటే..

10 January 2023, 10:54 IST

    • Adventure Sports in Manali : చాలామంది టూర్ లిస్ట్​లో కచ్చితంగ మానాలి ఉంటుంది. అద్భుతమైన సీనరీ లుక్స్​తో అందరినీ మానాలి ఆకట్టుకుంటుంది. అయితే మీరు అడ్వెంచర్ గేమ్స్ పట్ల ఆసక్తి కలిగినవారు అయితే మీకు మానాలి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 
అడ్వెంచర్ గేమ్స్
అడ్వెంచర్ గేమ్స్

అడ్వెంచర్ గేమ్స్

Adventure Sports in Manali : అద్భుతమైన వీక్షణలు, అందమైన లోయలతో లక్షలాది మంది ఇష్టపడే హిల్ స్టేషన్లలో మనాలి ఒకటి. హనీమూన్ అయినా.. స్నేహితులతో సరదాగా అయినా.. లేదా కుటుంబంతో సెలవు అయినా.. అందరినీ మానాలి ఆకర్షిస్తుంది. పైగా అందరికీ సరైన గమ్యస్థానం కూడా.

ట్రెండింగ్ వార్తలు

Jeera Rice : ఉదయం అల్పాహారంగా జీలకర్ర రైస్ ఇలా చేసుకోండి.. 10 నిమిషాల్లో రెడీ..

Tuesday Motivation : అందాన్ని చూసి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకు.. అంతమించిన విషయాలు చాలా ఉంటాయి

Talking In Sleep : నిద్రలో మాట్లాడే సమస్య ఉంటే బయటపడేందుకు సింపుల్ చిట్కాలు

Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు

మనాలి అన్ని విధాలుగా పర్యాటకుల హృదయాల్లోకి ప్రవేశిస్తుది. మీకు అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఉంటే.. మీకు మనాలి మరచిపోలేని మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. మీరు మనాలికి వెళ్లాలనే ప్లాన్ చేస్తూ ఉంటే.. అక్కడ కచ్చితంగా వీటిని ట్రై చేయండి.

మనాలిలో ట్రెక్కింగ్

మనాలిలో ట్రెక్కింగ్ అనేది అత్యంత ప్రసిద్ధి చెందిన సాహస కార్యకలాపాలలో ఒకటి. మీరు ఇక్కడ అనేక పర్యాటక ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు. పర్వతాలు, అడవుల గుండా అనేక కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ను ఆస్వాదించడానికి ట్రెక్కర్లు తయారు చేస్తారు. ఈ మార్గాల నుంచి మీరు నదులు, జలపాతాలు, ఎత్తైన పర్వతాలను చూడవచ్చు.

ఇక్కడ పర్యాటకులు వారి కోరిక, సామర్థ్యానికి అనుగుణంగా ట్రెక్కింగ్ మార్గాన్ని సులభంగా నుంచి కష్టతరమైన స్థాయికి ఎంచుకోవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్ ఒక వ్యక్తికి రూ. 5,600 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రుసుము కూడా నిర్వాహకుని ప్యాకేజీపై ఆధారపడి ఉంటుంది.

మనాలి మోటర్ బైకింగ్

పర్వతాలలో మోటర్‌బైక్‌ను తొక్కడం గొప్ప ధైర్యం, ఉత్సాహంతో కూడిన చర్యగా పరిగణిస్తారు. పర్యాటకులు గటా లూప్స్, మోరీ ప్లెయిన్స్, బరాలాచా లా పాస్, ఖర్దుంగ్ లా పాస్, నుబ్రా వ్యాలీ, కార్గిల్, ద్రాస్, పాంగోంగ్ త్సో, కీలాంగ్, టాన్‌లాంగ్ లా, రమ్సే వంటి పర్యాటక ప్రదేశాల ద్వారా డ్రైవింగ్ చేస్తూ ఇక్కడ మోటర్‌బైకింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇక్కడ మోటర్‌బైకింగ్‌కు రుసుము రూ.6,000 నుంచి మొదలవుతుంది.

మనాలి స్నో స్కూటర్

మనాలిలోని సరదా సాహస క్రీడలలో స్నో స్కూటర్ ఒకటి. ఈ క్రీడ విపరీతమైన ప్రజాదరణ పొందింది. పర్యాటకులు కూడా ఎక్కువగా దీనిని ఇష్టపడతారు. ఈ స్కూటర్ ద్వారా మంచులో డ్రైవింగ్ చేస్తూ 2 కి.మీ వరకు వెళ్లవచ్చు. మీరు ట్రైనర్ సహాయంతో ఈ స్కూటర్‌ని నడపవచ్చు లేదా ఈ స్కూటర్‌ని మీరే నడపడం ద్వారా ఆనందించవచ్చు. మీరు సోలాంగ్ వ్యాలీ లేదా రోహ్‌తంగ్ పాస్‌లో మంచు స్కూటర్‌లను ఆస్వాదించవచ్చు. దీనిని మీరు రూ. 200 నుంచి 1000 రూపాయల మధ్య వెళ్లవచ్చు.

మనాలిలో జిప్‌లైనింగ్

ఈ చర్య అడవులలోని ఎత్తైన పర్వతాల మధ్యలో జరుగుతుంది. జిప్‌లైనింగ్‌లో నడుముకు తాడు కట్టుకుని ఒక చివర నుంచి మరొక చివరకి వెళ్లాలి. ఈ పనిని పూర్తి చేయడానికి చాలా మంది శిక్షకులు మీతో ఉంటారు. వారు మీ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జిప్‌లైనింగ్ అనేది చాలా థ్రిల్లింగ్, హృదయాన్ని కదిలించే చర్య. మనాలిలో జిప్‌లైనింగ్ హరిపూర్, సోలాంగ్ వ్యాలీలో జరుగుతుంది. ఈ యాక్టివిటీ ఇక్కడ రూ.1,300 నుంచి ప్రారంభమవుతుంది.

మనాలిలో రివర్ క్రాసింగ్

మీరు నదిలో బోటింగ్‌ను ఆస్వాదించి ఉండాలి. మీకు స్విమ్మింగ్ అంటే కూడా ఇష్టం ఉండవచ్చు కానీ.. పైనుంచి తాడు సహాయంతో నదిని దాటడం ఎలా? ఇది మీ మనాలి ట్రిప్‌లో ఖచ్చితంగా మిస్ చేయకూడని ఒక సాహస కార్యకలాపం. వాన్ విహార్, సోలాంగ్ వ్యాలీ వద్ద నది దాటడం జరుగుతుంది. దీని రుసుము ఒక్కొక్కరికి 350 రూపాయలు.

మనాలిలో స్కీయింగ్

రోహ్తంగ్ పాస్ వద్ద స్కీయింగ్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రారంభ, అనుభవజ్ఞులైన వ్యక్తుల కోసం స్కీయింగ్ ఉంది. నిపుణుల పర్యవేక్షణలో స్కీయింగ్ చేసే అవకాశం ఉంటుంది. సోలాంగ్ వ్యాలీ, రోహ్‌తంగ్, మధి, గులాబా, ధుండి స్కీయింగ్‌కు చాలా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ రూ.300తో స్కిన్నింగ్ చేస్తారు.

మనాలిలో పారాగ్లైడింగ్

మనాలిని సందర్శించే పర్యాటకుల జాబితాలో పారాగ్లైడింగ్ తరచుగా అగ్రస్థానంలో ఉంటుంది. మనాలిలోని అందమైన మైదానాల మీదుగా పక్షిలా ఎగిరే థ్రిల్‌ను ఊహించలేము. ఇది ఎగురుతున్నప్పుడు మాత్రమే అనుభూతి చెందుతుంది. మీరు కూడా వేసవిలో మనాలికి వెళుతున్నట్లయితే, పారాగ్లైడింగ్‌ను మిస్ చేయకండి. సోలాంగ్ వ్యాలీ, మధిలో పారాగ్లైడింగ్ చేస్తారు. ఇక్కడ పారాగ్లైడింగ్ ఫీజు రూ.600 నుంచి రూ.1,800 వరకు ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం