తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Olive Oil Health Benefits । ఆలివ్ నూనెతో వండినవి తింటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

Olive Oil Health Benefits । ఆలివ్ నూనెతో వండినవి తింటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

HT Telugu Desk HT Telugu

31 May 2023, 11:42 IST

    • Olive Oil Health Benefits: ఆలివ్ నూనె అత్యధిక స్థాయిలో ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వంటకోసం ఆలివ్ నూనెను ఉపయోగించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
Olive Oil Health Benefits
Olive Oil Health Benefits (stock pic)

Olive Oil Health Benefits

Olive Oil Health Benefits: మనం ప్రతిరోజూ వండే అనేక రకాల ఆహార పదార్థాలకు వంటనూనెను ఉపయోగిస్తాం. ఈ వంటనూనెల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకోవడం చాలామందికి కష్టంగానే ఉంటుంది. వంటనూనెను ఎంచుకునే విషయంలో స్మోక్ పాయింట్ గురించి అవగాహన ఉండాలి. ప్రతీ వంటనూనెకు ఒక నిర్ధిష్టమైన స్మోక్ పాయింట్ ఉంటుంది. ఈ స్మోక్ పాయింట్ ఏమిటంటే, మనం వంటనూనెను వేడిచేసిన తర్వాత దాని నాణ్యత మారిపొయే ఒక ఉష్ణోగ్రత. చాలా వంటనూనెలు వేడిచేసిన తర్వాత వాటి రంగు, రుచి, నాణ్యత తగ్గిపోతాయి, పోషకాలను కోల్పోతాయి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆలివ్ నూనె ఆదర్శవంతమైన వంటనూనెగా చెప్పవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

World Thalassemia day 2024: తలసేమియా వ్యాధి ప్రాణాలు తీస్తుందా? ఇది ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది?

Carrot Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

ఆలివ్ నూనె స్మోక్ పాయింట్ 374–405°F (190–207°C) మధ్య ఉంటుంది. ఇది పాన్ ఫ్రైయింగ్‌తో సహా అనేక రకాల వంట పద్ధతులకు సురక్షితమైన నూనెగా ఉంటుంది. అయితే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఎంచుకోవడం ముఖ్యం.

ఆలివ్ నూనె అత్యధిక స్థాయిలో ప్రయోజనకరమైన సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వంటకోసం ఆలివ్ నూనెను ఉపయోగించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వంటలకు ఆలివ్ ఆయిల్ వినియోగించడం వల్ల స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆలివ్ ఆయిల్ లోని యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా చూస్తాయి, రక్తపోటును అదుపులో ఉంచుతాఅయి. తద్వారా స్ట్రోక్‌కు గురికాకుండా రక్షణ కల్పిస్తుంది.

బరువు నియంత్రణ

క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆలివ్ నూనె మితంగా వినియోగించినప్పుడు బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. ఆలివ్ ఆయిల్‌లోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మీకు కడుపు నిండిన సంతృప్తిని కలిగిస్తాయి, ఆకలి కోరికలను నియంత్రిస్తాయి. ఈ రకంగా మీరు రోజులో తీసుకునే క్యాలరీలను తగ్గించి, అధిక బరువు పెరగకుండా నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది.

యాంటీ ఇన్ల్ఫమేటరీ ఎఫెక్ట్స్

ఒలియోకాంతల్‌తో సహా ఆలివ్ ఆయిల్‌లో కనిపించే ఫినోలిక్ సమ్మేళనాలు నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు) మాదిరిగానే పనిచేస్తాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నట్లు తేలింది. ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక మంట, నొప్పులు కలిగించే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం

ఆలివ్ ఆయిల్‌లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ప్రత్యేకంగా ఒలీక్ యాసిడ్ ఉంటుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాధారణ వంట నూనెలలో సంతృప్త , ట్రాన్స్ ఫ్యాట్‌లు ఉంటాయి, ప్రత్యామ్నాయంగా ఆలివ్ నూనెను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను (LDL) తగ్గించవచ్చు. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను (HDL) పెంచవచ్చు.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు

ఆలివ్ నూనెలో విటమిన్ E, ఫినోలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శోథ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయి, శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవు.

మెదడు ఆరోగ్యం

ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆలివ్ నూనెలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ల్ఫమేటరీ సమ్మేళనాలు మెదడులో ఆక్సీకరణ ఒత్తిడి, వాపును ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

జీర్ణ ఆరోగ్యం

ఆలివ్ ఆయిల్ సాంప్రదాయకంగా జీర్ణక్రియకు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇది పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, పోషకాలను బాగా గ్రహించడాన్ని ప్రోత్సహిస్తుంది. అదనంగా, దాని యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పెద్దప్రేగులో నొప్పి, గ్యాస్ట్రిటిస్ వంటి పరిస్థితుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.