తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mustard Oil । జుట్టును నల్లబరచడానికి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఆవనూనె బెస్ట్!

Mustard Oil । జుట్టును నల్లబరచడానికి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఆవనూనె బెస్ట్!

HT Telugu Desk HT Telugu

12 May 2023, 15:35 IST

google News
    • Mustard Oil for Hair: మీరు జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారా? మీ జుట్టుకు ఆవనూనె వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ చూడండి.
Mustard Oil for Hair
Mustard Oil for Hair (Unsplash)

Mustard Oil for Hair

Oil for Healthy Hair: మీరు మీ జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారా? మీ జుట్టుకు పోషణ అందించేందుకు తలకు ఎలాంటి నూనెలు వాడినా ఫలితం ఉండటం లేదా? అయితే ఒకసారి ఆవాల నూనెను వాడి చూడండి. ఆవాల నూనె జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆవనూనెలో ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాల సరైన సమతుల్యత ఉంది, ఇంకా విటమిన్ Eని కూడా సమృద్ధిగా కలిగి ఉంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు పెరుగుదలకు చాలా అవసరమయ్యేవి. మీరు ఆవాల నూనెను కేవలం జుట్టుకోసం మాత్రమే కాదు, చర్మానికి సన్‌స్క్రీన్‌గా కూడా ఉపయోగించవచ్చు. పగిలిన పెదవులకు నివారణకు, దంతాలు తెల్లబడటానికి, జలుబు, ఫ్లూ వంటి లక్షణాలను ఎదుర్కొనేందుకు, కండరాల ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ముఖంపై టాన్, డార్క్ స్పాట్‌లను తొలగించడం కోసం, చర్మపు రంగును కాంతివంతం చేయడం మొదలైన ప్రయోజనాలు పొందవచ్చు.

Mustard Oil Benefits for Hair- ఆవనూనెతో జుట్టుకు ప్రయోజనాలు

మీరు ప్రత్యేకించి మీ జుట్టుకు ఆవనూనె వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ చూడండి.

1. సహజ కండీషనర్

ఈ నూనె ఆల్ఫా ఫ్యాటీ యాసిడ్స్‌తో సమృద్ధిగా ఉంటుంది, ఇది మీ జుట్టు తేమను చెక్కుచెదరకుండా ఉంచుతుంది. తద్వారా మీ జుట్టును ఎల్లప్పుడు ఆరోగ్యంగా, ఎగిరిపడేలా ఉంచడంలో సహాయపడుతుంది, ఆవాల నూనె మీ జుట్టును మృదువుగా, సిల్కీగా ఉండేలా చేసే సహజమైన కండీషనర్.

2. జుట్టుకు పోషణనిస్తుంది

నేటి కాలంలో, చాలా మంది వ్యక్తులు జుట్టు రాలడం , జుట్టు పల్చబడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఇది సాధారణంగా మన వెంట్రుకల కుదుళ్లకు పోషకాలు అందకపోవడం వలన జరుగుతుంది. అయితే, మీరు మీ జుట్టు కుదుళ్లను క్రమం తప్పకుండా ఆవాల నూనెతో మసాజ్ చేస్తే, మీరు మీ జుట్టు బలాన్ని, మెరుపును తిరిగి పొందవచ్చు.

3. జుట్టును నల్లబరుస్తుంది

ఆవ నూనెలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్లు ఎ, డి, ఇ, కె వంటి పోషకాలు పుష్కలం. ఇంకా ఈ హెయిర్ ఆయిల్‌లో జింక్, బీటా-కెరోటిన్, సెలీనియం మూలకాలు ఉన్నాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు, తెల్ల జుట్టును నివారిస్తుంది.

4. రక్త ప్రసరణను పెంచుతుంది

హెయిర్ మసాజ్ కోసం ఆవాల నూనెను ఉపయోగించండి. ఇది సహజమైన ఉద్దీపన. తలపై మసాజ్ చేసినప్పుడు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కొన్ని లవంగాలతో ఆవనూనెను వేడి చేసి వాడటం ఉత్తమ మార్గం. ఈ నూనెను మీ వేళ్లను ఉపయోగించి మీ జుట్టుకు సున్నితంగా మసాజ్ చేయండి. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు ఇలా చేయండి.

5. చుండ్రును నివారిస్తుంది

ఆవాల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ స్వభావాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి, దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల తలలో చుండ్రు లేకుండా పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మస్టర్డ్ ఆయిల్‌లో అధిక ఎరుసిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది, ఇది ALA కంటెంట్‌ను కలిగి ఉంటుంది, ఇది మీ స్కాల్ప్‌ను శుభ్రపరచడంలో, వెంట్రుకల కుదుళ్లను అడ్డుకునే బ్యాక్టీరియా, ఫంగస్‌ను నిర్మూలించడంలో సహాయపడుతుంది .

తదుపరి వ్యాసం