తెలుగు న్యూస్ / ఫోటో /
Mustard Oil During Winters। శీతాకాలంలో ఆవనూనెతో అవాక్కయ్యే ప్రయోజనాలు తెలుసా?
- Mustard Oil During Winters: ఆవ నూనెను మనం అవకాయల్లో, వంటల్లో ఉపయోగిస్తాం. అయితే చలికాలంలో ఈ ఆవనూనెను ఉపయోగించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో చూద్దామా..
- Mustard Oil During Winters: ఆవ నూనెను మనం అవకాయల్లో, వంటల్లో ఉపయోగిస్తాం. అయితే చలికాలంలో ఈ ఆవనూనెను ఉపయోగించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో చూద్దామా..
(1 / 7)
శీతాకాలంలో మన ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, సులభంగా అనారోగ్యం బారినపడతాం. ముప్పును నివారించడానికి ఆవనూనె కూడా ఒక ఔషధం.(Unsplash)
(2 / 7)
ఆవాల నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దురద, మంట, నొప్పిని నయం చేస్తుంది. ఇది ఇది చెవిలో చేరిన డస్ట్‌ను మృదువుగా మార్చి, చెవి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చెవిలో 2-3 చుక్కలు ఆవనూనె వేసుకోవచ్చు. గొంతు వద్ద, ఛాతీపైన ఆవనూనె రాసుకుంటే గొంతునొప్పి, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.(Unsplash)
(3 / 7)
చలికాలంలో చర్మం సులభంగా పొడిబారుతుంది. ఆవనూనెను చర్మానికి పట్టించి గంట సేపు అయ్యాక నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేసి, పూర్తిగా హైడ్రేట్ చేస్తుంది. చర్మపు రంగును మెరుగుపరుస్తుంది.(Unsplash)
(4 / 7)
ఆవనూనె తలలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆవనూనె తలకు రాసుకుంటే చుండ్రు నశిస్తుంది.(Unsplash)
(5 / 7)
చలికాలంలో ఎముకలు, కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నొప్పి ఉన్న ప్రదేశంలో కొద్దిగా వెచ్చని ఆవాల నూనెను మర్దన చేయడం వల్ల చాలా ఉపశమనం పొందవచ్చు.(Unsplash)
(6 / 7)
ఆవాల నూనె క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. వంటల్లో ఆవనూనె ఉపయోగిస్తే ప్రయోజనం పొందవచ్చు.(Pixabay)
ఇతర గ్యాలరీలు