తెలుగు న్యూస్  /  Lifestyle  /  5 Reasons About Raisin Water Include Your Diet To Get Health Benefits

Raisin Water Health Benefits : కిస్మిస్​ను అలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో..

29 November 2022, 8:28 IST

    • Raisin Water Health Benefits : కొందరు పాయసం వంటి స్వీట్స్ నుంచి ఎండుద్రాక్షలను తీసేస్తారు. దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం.. అడిగి మరి వేయించుకుంటారు. ఎందుకంటే.. వీటిని తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి.
ఎండుద్రాక్షలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
ఎండుద్రాక్షలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

ఎండుద్రాక్షలతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

Raisin Water Health Benefits : ప్రపంచంలోని అత్యంత పోషకాలు కలిగిన డ్రై ఫ్రూట్​లలో ఎండుద్రాక్ష ఒకటి. దీనినే కిస్మిస్ అంటారు. వీటిని కొందరు ఇష్టంగా తింటే.. మరికొందరు అయిష్టంతో దూరం పెడతారు. అయితే దీని ప్రయోజనాలు తెలుసుకుంటే.. కచ్చితంగా వాటిని మీ డైట్​లో యాడ్ చేసుకుంటారు.

అయితే ఎండు ద్రాక్షల ప్రయోజనం ఎక్కువగా పొందాలంటే.. వాటిని నానబెట్టి తీసుకుంటే మంచిది. ఎందుకంటే నానబెట్టిన ఎండుద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్​ను ఎక్కువ స్థాయిలో పొందవచ్చు. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి.. ఎవరైనా వీటిని తీసుకోవచ్చు. అంతేకాదండోయ్.. ఈ ఎండు ద్రాక్షలు నానబెట్టిన నీటిని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇంతకీ నానబెట్టిన ఎండుద్రాక్ష, దాని వాటర్ తీసుకుంటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

యాసిడ్ రిఫ్లక్స్, ఇతర కడుపు సమస్యలు దూరం

కడుపులో యాసిడ్‌ రిఫ్లక్స్​తో సమస్యలు ఉన్నట్లయితే.. ఎండుద్రాక్షను నానబెట్టి.. ఆ నీటితో పాటు తీసుకోవడం ఒక అద్భుతమైన విధానం. ఇవి పేగు పనితీరును మెరుగుపరిచే, గట్ బ్యాక్టీరియాను నియంత్రించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి రైసిన్ వాటర్ మీ జీర్ణవ్యవస్థకు అద్భుతమైనది.

టాక్సిన్స్, శరీర నిర్విషీకరణకై..

శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి.. రక్త శుద్ధి చేయడంలో నానబెట్టిన ఎండుద్రాక్షలు, దాని నీరు.. ముఖ్యపాత్ర పోషిస్తాయి. కనీసం ఒక వారం పాటు ఈ నీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మీ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. దాని పనితీరును మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

చాలా మంది జుట్టు రాలిపోతుంది అంటూ బాధపడుతూ ఉంటారు. అయితే మీరు ఈ సమస్యను అధిగమించడానికి నానబెట్టిన ఎండుద్రాక్ష, దాని నీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని ఆపడానికి.. హెయిర్ ఫోలికల్స్‌ను మరింత ప్రేరేపిస్తాయి.

నిద్రలేమిని మెరుగుపరుస్తుంది

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమిని సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమయంలో నిద్ర రుగ్మతలను దూరం చేసుకోవడానికి.. నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్‌ను కలిగి ఉన్న ఎండుద్రాక్షను, దాని నీటిని తీసుకోవచ్చు.

ఒక్కరోజు తాగి ఫలితాలు పొందాలంటే కష్టమే. కాబట్టి.. రెగ్యూలర్​గా వీటిని తీసుకుంటే.. సరైన జీవనశైలిని పాటిస్తే.. ఈ సమస్యలను అధిగమించవచ్చు.