Uric acid problem: ఈ ఆకుతో యూరిక్‌ యాసిడ్‌ సమస్యకు.. ఈజీగా చెక్‌ పెట్టండి..!-uric acid problem ayurveda expert on easy lifestyle changes to treat the condition naturally ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Uric Acid Problem Ayurveda Expert On Easy Lifestyle Changes To Treat The Condition Naturally

Uric acid problem: ఈ ఆకుతో యూరిక్‌ యాసిడ్‌ సమస్యకు.. ఈజీగా చెక్‌ పెట్టండి..!

HT Telugu Desk HT Telugu
Jul 11, 2022 07:19 PM IST

అదుపు తప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా హైపర్‌ యూరిసెమియా బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది.ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఆయుర్వేద నిపుణులు డాక్టర్ భావ్సార్ సలహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

High uric acid
High uric acid

హైపర్‌ యూరిసెమియా బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. ఇటీవల కాలంలో ఈ కేసుల విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమస్య అనేక దీర్ఘకాలిక ఆనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తక్కువ నీరు తీసుకోవడం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటివి యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా పెరగడానికి కారణమవుతున్నాయి. శరీరంలోని విపరితంగా పెరిగిపోతున్న యూరిక్ యాసిడ్ ఎముకలు, కీళ్లలో పేరుకుపోతుంది, గౌట్ వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది, ఇది గుండె, మూత్రపిండాల సమస్యలతో పాటు కీళ్ళనొప్పులకు కారణమవుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవ్వడం వల్ల మాత్రమే హైపర్‌యూరిసెమియాను సమస్యను తగ్గించుకోవచ్చు. సహజమైన పద్దతుల ద్వారా యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించవచ్చని డాక్టర్ భావ్సార్ వెల్లడించారు

అధిక యూరిక్ యాసిడ్ కారణాలు

జీవక్రియ ఇబ్బందులతో పాటు పేగు ఆరోగ్యం దెబ్బతినడం

- అదుపు తప్పిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం

- ఎక్కువ ప్రోటీన్లు, తక్కువ కొవ్వుల వినియోగం

- అధిక అకలి

- నిద్ర, క్రమ రహితమైన డైట్

- తక్కువ నీరు తీసుకోవడం

కిడ్నీ పనిచేయకపోవడం (వృద్ధ రోగులు)

- నాన్ వెజ్ ఎక్కువగా తినడం

సహజంగా యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవడానికి డాక్టర్ భావ్సార్ సలహలు

ప్రతిరోజూ 45 నిమిషాల పాటు వ్యాయామం చేయండి

- తగినంత నీరు త్రాగాలి

- కాయధాన్యాలు/బీన్స్, గోధుమలతో కూడిన పదార్థాలను రాత్రి భోజనంలో తీసుకోవాలి

- రాత్రి 8 గంటలకు ముందే తేలికపాటి భోజనం చేయడానికి ప్రయత్నించండి

- ఉసిరి, బెర్రీలు మొదలైన పుల్లని పండ్లను తీసుకోవాలి.

- ఒత్తిడిని తగ్గించుకోండి, ఇది జీవక్రియలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది

- తగినంత నిద్ర ఉండాలి. మంచి నిద్ర జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది

అధిక యూరిక్ యాసిడ్ చికిత్సకు ఆయుర్వేద వైద్యం

తిప్పతీగ (Giloy) వినియోగం

గిలోయ్ అద్భుతమైన ఆయుర్వేదిక గుణాలు కలిగిన మూలికగా డాక్టర్ భావ్సర్ వెల్లడించారు. Giloy స‌హ‌జంగా వ్యాధి నిరోధ‌క శ‌క్తి కలిగి ఉంటుందని తెలిపారు. కొన్ని తాజా ఆకులు, కాండం తీసుకుని రాత్రంతా నానబెట్టండి. ఉదయం వాటిని ఒక గ్లాసు నీటిలో సగం వచ్చేవరకు చూర్ణం చేసి ఉడకబెట్టండి.

kaishor guggulu, పునర్నవ, ఉసిరి, కలబంద వంటివి యూరిక్ యాసిడ్ నియంత్రించడంలో తోడ్పడుతాయి. దీనికి స్వంత వైద్యం పనికి రాదని.. నిపుణుల పర్యవేక్షణలో చికిత్ప ఉండాలని డాక్టర్ భావ్సార్ అంటున్నారు. సహజంగా ఆయుర్వేద మందులతో ఉత్తమ ప్రయోజనాల ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండనప్పటికీ ఇతర వ్యాధులు, శరీర రకాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. కాబట్టి సూచించిన మోతాదులో మూలికలను వినియోగించాలనిడాక్టర్ భావ్సార్ తెలిపారు.

WhatsApp channel

టాపిక్