తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drinks For A Hangover । డ్రింక్‌ను డ్రింక్ తోనే.. ఈ డ్రింక్స్ తాగితే హ్యాంగోవర్ హాంఫట్!

Drinks for a Hangover । డ్రింక్‌ను డ్రింక్ తోనే.. ఈ డ్రింక్స్ తాగితే హ్యాంగోవర్ హాంఫట్!

HT Telugu Desk HT Telugu

01 January 2023, 8:00 IST

    • Drinks for a Hangover: హ్యాంగోవర్ నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు ఇక్కడ 5 పానీయాలు సూచిస్తున్నాం. మీరు వీటిని తాగి చూస్తే మంచి ఫలితం లభిస్తుంది.
Drinks for a Hangover
Drinks for a Hangover (Unsplash)

Drinks for a Hangover

Drinks for a Hangover: ఆల్కాహాల్ ఎక్కువ సేవించినపుడు మీ శరీరం నీటిని కోల్పోతుంది, ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. శరీరం ఇలా నీటిని కోల్పోయినపుడు ఎలక్ట్రోలైట్‌లు, అవసరమైన ఖనిజాలు క్షీణిస్తాయి. దీని వల్ల హ్యాంగోవర్ వస్తుంది. మీరు నిద్రలేచిన దగ్గర్నించీ తలనొప్పి, తలభారం, కాంతి, ధ్వనికి సున్నితత్వం, అలసట, వికారం మొదలైన లక్షణాలు ఉంటాయి. ఈ హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే ముందుగా శరీరాన్ని హైడ్రేట్ చేయాలి, ఆపైన శరీరం కోల్పోయిన మినరల్స్, ఎలక్ట్రోలైట్‌లను తిరిగి భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని అద్భుతమైన పానీయాలు ఉన్నాయి. మీకు హ్యాంగోవర్ ఉన్నప్పుడు ఇలాంటి పానీయాలు తాగటం వలన శరీరానికి శక్తి లభిస్తుంది, మీరు వికారం, వాంతుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు హాయిగా విశ్రాంతి తీసుకోగలుగుతారు.

ట్రెండింగ్ వార్తలు

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు?

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

World lupus day 2024: శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే వ్యాధి లూపస్, ఇదొక విచిత్రమైన ఆరోగ్య సమస్య

హ్యాంగోవర్ నుంచి త్వరగా ఉపశమనం పొందేందుకు ఇక్కడ 5 పానీయాలు సూచిస్తున్నాం. మీరు వీటిని తాగి చూస్తే మంచి ఫలితం లభిస్తుంది.

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు అద్భుతమైన హ్యాంగోవర్ డ్రింక్. ఇది ఐసోటోనిక్, అంటే ఇతర ద్రవాల కంటే ఈ పానీయాన్ని మీ శరీరం చాలా వేగంగా గ్రహిస్తుంది, త్వరగా రీహైడ్రేట్ చేయడంలో మీకు సహాయపడుతుంది. ఇది మీ రాత్రి పార్టీలో మీరు కోల్పోయిన పొటాషియం వంటి కొన్ని ఎలక్ట్రోలైట్‌లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఉదయం లేచిన తర్వాత కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ కొబ్బరి నీళ్లు తాగండి.

పాయా సూప్

మీరు ఆల్కహాల్ తాగినప్పుడు, మీ శరీరం ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లను కోల్పోతుంది.ఎముకల పులుసులో ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నీ ఉంటాయి, ఇవే కాకుండా మరెన్నో పోషకాలు లభిస్తాయి. ఈ ఉడకబెట్టిన పులుసులో నీరు ఎక్కువగా ఉంటుంది, అంటే మీకు అవసరమైన హైడ్రేషన్ కూడా మీకు లభిస్తుంది. హ్యాంగోవర్ నివారణగా నిపుణులు గుడ్లను కూడా సిఫార్సు చేస్తారు కానీ ఎముకల రసంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు కూడా ఉంటుంది, ఇది గుడ్ల కంటే ప్రభావవంతంగా పని చేస్తుంది.

క్యారెట్, అల్లం ఆపిల్ రసం

ఇది విచిత్రమైన కలయికగా అనిపించినప్పటికీ, ఈ మూడు ఆహారాలు వేగవంతమైన, సమర్థవంతమైన, రుచికరమైన హ్యాంగోవర్ నివారణ. మీరు హ్యాంగోవర్ తగ్గించడానికి కష్టపడుతూ ఉంటే ఇది అద్భుతమైనది. ఈ పానీయంలో అన్ని పదార్థాలు మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తాయి, అయితే ఇందులో అల్లం ఇంకా ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది కడుపు నొప్పిని తగ్గించి, వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నారింజ రసం

హ్యాంగోవర్ తర్వాత మీ చర్మం ఎందుకు కాళావిహీనంగా కనిపిస్తోందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆల్కహాల్ ద్వారా క్షీణించిన ప్రధాన విటమిన్లలో విటమిన్ సి ఒకటి. ఈ విటమిన్ ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్ సి మీ శరీరం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, ఇది మీ చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర తగ్గుతుంది. నారింజ రసం తాగటం ద్వారా మీకు శక్తిని పెంచడానికి అవసరమైన సహజ చక్కెరను అందిస్తుంది.

జింజర్ లెమెన్ టీ

హ్యాంగోవర్ ఉన్నప్పుడు మామూలు కాఫీ, టీలు వద్దు. ఇవి హ్యాంగోవర్ తీవ్రతను ఇంకా పెంచుతాయి. బదులుగా మీరు జింజర్ లెమెన్ టీ తాగవచ్చు. అల్లం వికారం తగ్గించడానికి అద్భుతాలు చేస్తుంది , నిమ్మకాయ మీ కాలేయానికి మద్దతు ఇస్తుంది, ఇది ఇథనాల్ (ఆల్కహాల్) మొత్తాన్ని జీవక్రియ చేయడానికి సహాయపడుతుంది. ఒక కప్పు నీటిని మరిగించి, అందులో తాజా అల్లం ముక్కలు వేసి ఉడికించి ఆపై గోరువెచ్చగా ఉన్నపుడు సగం నిమ్మకాయ రసం పిండుకొని తాగండి, హ్యాంగోవర్ హాంఫట్.

టాపిక్