తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hangover: హ్యాంగోవర్‌‌గా ఉందా?... ఈ హోం రెమెడీస్‌తో వెంటనే దిగిపోద్ది!

Hangover: హ్యాంగోవర్‌‌గా ఉందా?... ఈ హోం రెమెడీస్‌తో వెంటనే దిగిపోద్ది!

HT Telugu Desk HT Telugu

29 May 2022, 21:17 IST

    • హ్యాంగోవర్‌గా అనిపిస్తోందా?.. అయితే ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తున్నారా..? ఐతే... ఈ హోం రెమీడీస్‌తో ఈజీగా వదిలించుకోండి.
Hangover
Hangover

Hangover

వీకెండ్స్.. ఇంకేంటి ప్రెండ్స్,సార్టీస్ ఇలా ఆ రోజంతా బిజీ.. బిజీ. అందరూ ఒక చోట కలిశారంటే.. ఇంకేముందు బాటిల్స్.. బాటిల్స్ లేవాల్సిందే. ఎంజాయ్ సరే ప్రొద్దున వచ్చే హ్యాంగోవర్ సంగతేంటీ.. సాధరణంగా ఆల్కహాల్ వినియోగం శారీరక, మానసికంగా ప్రభావం చూపుతుంది. వేగవంతమైన హృదయ స్పందన, ఆందోళన, శరీర నొప్పి, మైకము, దుర్వాసన, తలనొప్పి, బద్ధకం, వికారం, ఫోటోఫోబియా, చిరాకు, అలసట, కడుపు నొప్పి,వాంతులు హ్యాంగోవర్‌లో ఉండే సాధారణ లక్షణాలు. అందరికీ ఒకే లక్షణాలను కలిగి ఉంటాయని లేదు. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా హ్యాంగోవర్ లక్షణాలను సలభంగా తొలిగించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

హ్యాంగోవర్‌ని తగ్గించడానికి 5 ఎఫెక్టివ్ హోం రెమెడీస్:

నీరు: హ్యాంగోవర్ లక్షణాలను వదిలించుకోవడానికి సులభమైన టెక్నిక్ నీరు త్రాగటం. ఆల్కహాల్ ద్వారా శరీరంలో వ్యర్దాలు ఏర్పడుతాయి. కాబట్టి, క్రమం తప్పకుండా నీటిని తాగడం ద్వారా రీహైడ్రేట్ చేయాలి. నీరు మీ కడుపులో మిగిలి ఉన్న కాలుష్య కారకాలను కూడా పలుచన చేస్తుంది.

తేనె: హ్యాంగోవర్ లక్షణాలకు తేనె కూడా మంచి విరుగుడు. తేనెలోని పొటాషియం కంటెంట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలో ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది, ఇది శరీరంలోని అదనపు ఆల్కహాల్ తొలిగించడంలో ఉపయోగపడుతుంది. హ్యాంగోవర్ లక్షణాలను తగ్గిస్తుంది.

అల్లం: హ్యాంగోవర్ లక్షణాలకు తొలిగించడానికి ఉపయోగపడే మరొక ప్రత్యమ్నాయం అల్లం. ఇది ఆల్కహాల్ జీర్ణం చేయడంలో సహాయపడుతుంది, కడుపులో అసౌఖర్యం నుండి ఉపశమనం కలిగిస్తోంది. త్వరగా ఉపశమనం అందిస్తుంది.

అరటిపండ్లు : అధికంగా తాగడం వల్ల మీ శరీరం నుండి పొటాషియం ఎక్కువగా బయటకు పోతుంది. పొటాషియం, కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను భర్తీ చేయడానికి అరటిపండ్లు తినడం సులభమైన మార్గం. అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అరటిపండ్లు కడుపుని రిలాక్స్ చేయడానికి, ఎనర్జీ లెవెల్స్‌ని పెంచడానికి కూడా సహకరిస్తాయి.

టొమాటో జ్యూస్: హ్యాంగోవర్ లక్షణాలను తగ్గించడానికి మరో సాధారణ టెక్నిక్ టొమాటో జ్యూస్ తాగడం. ఈ రసంలో ఫ్రక్టోజ్ ఉంటుంది, ఇది ఆల్కహాల్ వేగవంతమైన జీవక్రియలో సహాయపడే చక్కెర రూపాన్ని కలిగి ఉంటుంది.

తదుపరి వ్యాసం