తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Thalapathy Remuneration : ఆ సినిమాకు రూ.200 కోట్లు తీసుకుంటున్న విజయ్ దళపతి

Vijay Thalapathy Remuneration : ఆ సినిమాకు రూ.200 కోట్లు తీసుకుంటున్న విజయ్ దళపతి

Anand Sai HT Telugu

24 May 2023, 12:06 IST

    • Vijay Thalapathy Remuneration : విజయ్ దళపతికి సౌతిండియాలో మంచి క్రేజ్ ఉంది. ఇటీవల వచ్చిన వరిసు సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే లోకేశ్ కనగరాజ్ తో రాబోయో సినిమాకు విజయ్ భారీ మెుత్తంలో తీసుకుంటున్నాడట.
దళపతి విజయ్
దళపతి విజయ్

దళపతి విజయ్

మొన్నటి వరకు అత్యధిక పారితోషికం తీసుకునే నటుల ప్రశ్న తలెత్తినప్పుడల్లా సల్మాన్, ప్రభాస్ పేర్లు బయటకు వచ్చేవి. సల్మాన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌లతో భారీ పారితోషికం అందుకునేవాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ కూడా భారీ మెుత్తంలోనే తీసుకుంటున్నాడు. సాధారణంగా ఈ ఇద్దరి పేర్లు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేవారిగా వార్తలు వస్తాయి. అయితే దళపతి విజయ్ తన కొత్త చిత్రం LEOతో అగ్రస్థానంలో ఉంటున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chitram Choodara OTT Release Date: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

దశాబ్ద కాలంగా తన ఇమేజ్‌ని పెంచుకుంటూ వస్తున్నాడు విజయ్(Vijay). వరిసు వంటి యావరేజ్ సినిమాలు కూడా కొనుగోలుదారులకు డబ్బు సంపాదించి పెట్టాయి. దీంతో సౌత్‌లో మోస్ట్ వాంటెండ్ స్టార్‌గా నిలిచాడు దళపతి. తమిళంతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా విజయ్‌కి చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది. ఇది కూడా అతనికి భారీ రెమ్యూనరేషన్(Remuneration) ఇవ్వడానికి మరో కారణం.

తన చివరి చిత్రం వరిసు(Varisu)కు విజయ్ భారీ మెుత్తంలో అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. వచ్చే సినిమాకు రూ.200 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమ నివేదికల ప్రకారం లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్ తన రాబోయే గ్యాంగ్‌స్టర్ చిత్రం LEO కోసం అందుకుంటున్న పారితోషికం ఇది. లియో ఈ ఏడాది అక్టోబర్ 19న విడుదల కానుంది.

దళపతి 67వ సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. ఈ చిత్రంలో సంజయ్ దత్(sanjay dutt), గౌతమ్ మీనన్, నివిన్ పౌలీ నటిస్తున్నారు. అర్జున్ సర్జా కూడా ఉన్నాడు. ఈ సినిమా కోసం అర్జున్ 4.5 నుంచి 5 కోట్ల పారితోషికం(Remuneration) తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సంజయ్ దత్ రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. దళపతి విజయ్ 200 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ సినిమా కావడంతో క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమా డిజిటల్‌ హక్కులకు(digital rights) ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చి పడింది. సౌతిండియాలోనే అత్యధిక మొత్తానికి ఈ సినిమా డిజిటల్‌ హక్కులు అమ్ముడయ్యాయని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ(OTT) నెట్‌ఫ్లిక్స్‌ విజయ్‌, లోకేష్‌ సినిమా డిజిటల్‌ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అన్ని భాషల డిజిటల్‌ హక్కులు ఈ డీల్‌ కింద నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందట.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.