Vijay-Lokesh Kanagaraj Movie Record Deal: విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ మూవీ డిజిటల్‌ హక్కులకు భారీ మొత్తం-vijay lokesh kanagaraj movie record deal with netflix for digital rights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Lokesh Kanagaraj Movie Record Deal With Netflix For Digital Rights

Vijay-Lokesh Kanagaraj Movie Record Deal: విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ మూవీ డిజిటల్‌ హక్కులకు భారీ మొత్తం

Hari Prasad S HT Telugu
Dec 26, 2022 04:16 PM IST

Vijay-Lokesh Kanagaraj Movie Record Deal: విజయ్‌, లోకేష్‌ కనగరాజ్‌ మూవీ డిజిటల్‌ హక్కులకు భారీ మొత్తం రావడం విశేషం. ఇది సౌతిండియాలోనే సరికొత్త రికార్డుగా నిలవనుంది.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న దళపతి 67
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న దళపతి 67

Vijay-Lokesh Kanagaraj Movie Record Deal: తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌ ప్రస్తుతం వారసుడు మూవీ షూటింగ్‌ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానున్నట్లు చెప్పినా.. రిలీజ్ డేట్‌ మాత్రం ఇంకా అనౌన్స్‌ చేయలేదు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్‌ కానుంది.

ఈ సినిమా తర్వాత విజయ్‌ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌తో చేయనున్నాడు. నిజానికి ఈ మూవీ షూటింగ్‌ గత నవంబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా.. వారసుడు కారణంగా ఆలస్యమైంది. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంటే ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని ఆసక్తిని రేపింది. ఈ ఏడాది కమల్‌హాసన్‌తో విక్రమ్‌లాంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ అందించిన లోకేష్‌ కనగరాజ్‌ ఇప్పుడ దళపతి విజయ్‌తో సినిమా చేస్తున్నాడంటే మరో సూపర్‌ హిట్‌ ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.

దీంతో ఈ సినిమా డిజిటల్‌ హక్కులకు ఎక్కడ లేని డిమాండ్‌ ఏర్పడింది. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. సౌతిండియాలోనే అత్యధిక మొత్తానికి ఈ సినిమా డిజిటల్‌ హక్కులు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ విజయ్‌, లోకేష్‌ సినిమా డిజిటల్‌ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకోవడం విశేషం. అన్ని భాషల డిజిటల్‌ హక్కులు ఈ డీల్‌ కింద నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

ఈ ఏడాది బీస్ట్‌ సినిమా బోల్తా కొట్టినా.. అంతకు ముందు వరుస హిట్స్‌ అందుకున్న హీరో విజయ్‌. ఇప్పుడు వారసుడుపైనా భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇక విక్రమ్‌ హిట్‌తో ఊపు మీదున్న డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. అందుకే ఈ రికార్డు డీల్‌. ఈ సినిమాలో త్రిష ఫిమేల్‌ లీడ్‌లో కనిపించనుంది. ఇక సంజయ్‌ దత్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌లాంటి వాళ్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది పాన్‌ ఇండియా లెవల్లో ఈ సినిమా రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

IPL_Entry_Point

టాపిక్