Vikram Collections: విక్రమ్‌ కలెక్షన్ల సునామీ.. ఇండియాలో మరో రికార్డు-vikram movie collections cross 300 crores in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vikram Movie Collections Cross 300 Crores In India

Vikram Collections: విక్రమ్‌ కలెక్షన్ల సునామీ.. ఇండియాలో మరో రికార్డు

HT Telugu Desk HT Telugu
Jul 04, 2022 04:23 PM IST

Vikarm Collections: కమల్‌హాసన్‌ నటించిన విక్రమ్‌ మూవీ ఏమాత్రం తగ్గడం లేదు. రిలీజై ఐదు వారాలైనా.. బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది.

విక్రమ్ సినిమాలో కమల్ హాసన్
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ (PTI)

తమిళ సూపర్‌స్టార్‌ కమల్‌హాసన్‌ కష్టాలను దూరం చేస్తోంది విక్రమ్‌ మూవీ. ఏ టైమ్‌లో రిలీజ్‌ చేశారోగానీ ఈ సినిమా దూకుడుకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అంచనాలను మించి సక్సెస్‌ అందుకున్న విక్రమ్‌.. బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల విషయంలో జోరు కొనసాగిస్తోంది. సినిమా రిలీజైన ఐదో వీకెండ్‌లో ఈ మూవీ రూ.5.25 కోట్లు రాబట్టింది.

నాలుగో వీకెండ్‌ కంటే ఇది 62 శాతం తక్కువ. సాధారణంగా ఏ సినిమా అయినా రెండో వారంలోనే ఈ స్థాయిలో పడే అవకాశం ఉంటుంది. విక్రమ్‌ విషయంలో మాత్రం ఐదో వారానికిగానీ కలెక్షన్లు ఇంత భారీగా తగ్గలేదు. ఇప్పటి వరకూ కేవలం ఇండియాలోనే విక్రమ్ మూవీ రూ.300 కోట్లు కలెక్ట్‌ చేయడం విశేషం. వచ్చే శుక్రవారం హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా.. రూ.310 కోట్ల దగ్గర ఆగిపోవచ్చు.

తొలి వారంలో విక్రమ్‌ రూ.164.75 కోట్లు రాబట్టంది. ఆ తర్వాత రెండో వారంలో రూ.72.50 కోట్లు, మూడో వారంలో రూ.38.5 కోట్లు, నాలుగో వారంలో రూ.21.5 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఇండియాలో రూ.302.5 కోట్లు వచ్చాయి. తమిళనాడులో ఇప్పటికే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా విక్రమ్‌ నిలిచింది. ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకూ రూ.179 కోట్లు రావడం విశేషం. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళలో రూ.40 కోట్లు, కర్ణాటకలో రూ.25 కోట్లు వసూలు చేసింది. ఇక మిగతా దేశం మొత్తం కలిపితే రూ.17 కోట్లు వచ్చాయి.

IPL_Entry_Point