Soul of Vaarasudu: వారసుడు నుంచి మనసును హత్తుకునే మెలోడీ సాంగ్-soul of vaarasudu is melodious with meaningful lyrics ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Soul Of Vaarasudu: వారసుడు నుంచి మనసును హత్తుకునే మెలోడీ సాంగ్

Soul of Vaarasudu: వారసుడు నుంచి మనసును హత్తుకునే మెలోడీ సాంగ్

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 07:22 PM IST

Soul of Vaarasudu: వారసుడు మూవీ నుంచి మనసును హత్తుకునే మెలోడీ సాంగ్‌ రిలీజైంది. ఈ పాటను చిత్ర పాడగా.. తమన్‌ మ్యూజిక్‌ అందించాడు. ది సోల్‌ ఆఫ్‌ వారసుడుగా ఈ పాట ఆడియెన్స్‌ ముందుకు వచ్చింది.

వారసుడు మూవీలో విజయ్
వారసుడు మూవీలో విజయ్

Soul of Vaarasudu: ఈసారి సంక్రాంతి రిలీజ్‌లలో ఎంతో ఆసక్తి రేపుతున్న మూవీ వారసుడు. తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌ నటించిన ఈ బైలింగువల్ మూవీ తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్‌ కాబోతోంది. చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డిలతో ఈ సినిమా పోటీ పడనుంది. అయితే తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉన్న విజయ్‌ వారసుడుతో మ్యాజిక్‌ చేస్తాడని భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సింగిల్స్‌ రాగా.. అవి తమిళ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే తెలుగు ఆడియెన్స్‌ను మాత్రం అంతగా మెప్పించలేకపోయాయి. ఇక ఇప్పుడు ఇదే వారసుడు నుంచి ఓ మెలోడీ సాంగ్‌ రిలీజైంది. ది సోల్ ఆఫ్‌ వారసుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట ఎంతో ఎమోషనల్‌గా ఉంది.

తమన్‌ మ్యూజిక్ అందించగా.. సీనియర్‌ సింగర్‌ చిత్ర పాడింది. ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమా అవకాశం కొట్టేస్తున్న తమన్‌.. ఈ పెద్ద ప్రాజెక్ట్‌ను కూడా దక్కించుకున్నాడు. మెలోడీ అందించడంలో తనదైన మార్క్‌ చూపించే అతడు.. ఈ వారసుడు సాంగ్‌ను కూడా మనసుకు హత్తుకునేలా కంపోజ్‌ చేశాడు. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌ కూడా చాలా బాగున్నాయి.

తల్లీకొడుకుల మధ్య ఉన్న బంధాన్ని చాటేలా ఈ లిరిక్స్‌ ఉన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేసిన ఈ మూవీ జనవరి 11న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ రిలీజ్‌ కానుంది. విజయ్‌తోపాటు రష్మిక మందన్నా, శరత్‌కుమార్‌, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point