Dil Raju on Vaarasudu: మహేష్‌ బాబు, రామ్ చరణ్ కాదన్న తర్వాతే విజయ్‌ చేతికి వారసుడు-dil raju on vaarasudu says their first choice were mahesh babu and ram charan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dil Raju On Vaarasudu: మహేష్‌ బాబు, రామ్ చరణ్ కాదన్న తర్వాతే విజయ్‌ చేతికి వారసుడు

Dil Raju on Vaarasudu: మహేష్‌ బాబు, రామ్ చరణ్ కాదన్న తర్వాతే విజయ్‌ చేతికి వారసుడు

HT Telugu Desk HT Telugu
Dec 16, 2022 08:13 AM IST

Dil Raju on Vaarasudu: మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌ కాదన్న తర్వాతే విజయ్‌ చేతికి వారసుడు మూవీ వెళ్లిందా? తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజుయే ఈ విషయాన్ని వెల్లడించాడు.

వారసుడు మూవీలో విజయ్
వారసుడు మూవీలో విజయ్

Dil Raju on Vaarasudu: వారసుడు.. రానున్న సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాల్లో ఇది కూడా ఒకటి. వచ్చే ఏడాది జనవరి 11న వారసుడు రిలీజ్‌ కాబోతోంది. తమిళ సూపర్‌ స్టార్‌ దళపతి విజయ్‌ నటించిన మూవీ ఇది. తెలుగుతోపాటు తమిళంలోనూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్‌ రాజు నిర్మించాడు.

ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్‌, దిల్‌ రాజు, వంశీలాంటి క్రేజీ కాంబినేషన్‌లో రెండు భాషల్లో సంక్రాంతి మూవీగా వస్తుండటంతో చిరంజీవి వాల్తేర్‌ వీరయ్య, బాలకృష్ణ వీర సింహా రెడ్డిలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు నిర్మాత దిల్‌ రాజు ఇంట్రెస్టింగ్‌ విషయాలు వెల్లడించాడు.

అసలు వారసుడు మూవీకి విజయ్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదని.. తాము మొదట మహేష్‌ బాబు, ఆ తర్వాత అల్లు అర్జున్‌ను అనుకున్నట్లు దిల్‌ రాజు చెప్పాడు. "వంశీ పైడిపల్లి మొదట స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు మహేష్‌ బాబు సరిపోతాడని అనుకున్నాం. కానీ మహేష్‌ మరో ప్రాజెక్ట్‌కు కమిట్‌ అవడంతో అది సాధ్యం కాలేదు" అని దిల్‌ రాజు వెల్లడించాడు.

ఇక ఆ తర్వాత రామ్‌ చరణ్‌ను అనుకున్నా.. అతడూ మరో ప్రాజెక్ట్‌తో బిజీ ఉండటంతో కుదరలేదన్నాడు. "మహేష్‌ కాదనడంతో రామ్‌ చరణ్‌ ఈ మూవీ సరిపోతాడని అనుకున్నాం. కానీ అతడు కూడా ఆర్సీ15తో బిజీగా ఉన్నాడు. రెండు సిసిమాలూ ఒకేసారి కుదరదనడంతో ఆ ప్లాన్‌ కూడా వర్కవుట్‌ కాలేదు. దీంతో విజయ్‌కి కథ చెప్పాం. మొత్తానికి అతనితో సినిమా పూర్తి చేశాం" అని దిల్‌ రాజు అన్నాడు.

ఇక ఈ వారసుడు సినిమా షూటింగ్ పూర్తికాక‌ముందే డిజిట‌ల్ హ‌క్కులు అమ్ముడుపోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌మిళంతో పాటు తెలుగు హ‌క్కుల విష‌యంలో భారీ పోటీ నెల‌కొన్న‌ట్లు స‌మాచారం. ఈ పోటీ మ‌ధ్య అమెజాన్ ప్రైమ్ డిజిట‌న్ రైట్స్‌ను ద‌క్కించుకున్న‌ట్లు చెబుతున్నారు. వార‌సుడు శాటిలైట్ రైట్స్‌ను స‌న్ టీవీ సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌కానుంది. ఈ సినిమాలో శ‌ర‌త్‌కుమార్‌, ప్ర‌కాష్‌రాజ్‌, శ్రీకాంత్, సంగీత‌, ఖుష్బూ కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌నున్నారు.

Whats_app_banner