Waltair Veerayya Release Date: సంక్రాంతి బరిలో వాల్తేర్‌ వీరయ్య.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌-waltair veerayya release date announced as the movie coming on sankranthi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Waltair Veerayya Release Date Announced As The Movie Coming On Sankranthi

Waltair Veerayya Release Date: సంక్రాంతి బరిలో వాల్తేర్‌ వీరయ్య.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 04:36 PM IST

Waltair Veerayya Release Date: సంక్రాంతి బరిలో వాల్తేర్‌ వీరయ్య నిలవనున్నాడు. మేకర్స్‌ బుధవారం (డిసెంబర్‌ 7) మూవీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు.

సంక్రాంతికి వస్తున్న వాల్తేర్ వీరయ్య
సంక్రాంతికి వస్తున్న వాల్తేర్ వీరయ్య

Waltair Veerayya Release Date: గాడ్‌ఫాదర్‌ గ్రాండ్‌ సక్సెస్‌తో ఊపు మీదున్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. ఈసారి వాల్తేర్‌ వీరయ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను బుధవారం (డిసెంబర్‌ 7) మేకర్స్‌ అధికారికంగా అనౌన్స్‌ చేశారు.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 13, 2023న రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. బాలయ్య వీర సింహా రెడ్డి రిలీజ్‌ అయిన మరుసటి రోజే వాల్తేర్ వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ.. మేకర్స్‌ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

"ఈ సంక్రాంతికి థియేటర్లలో మాస్‌ మూలవిరాట్‌ దర్శనం. వాల్తేర్‌ వీరయ్య ప్రపంచవ్యాప్తంగా జనవరి 13, 2023న రిలీజ్ అవుతోంది" అని మేకర్స్‌ ప్రకటించారు. వాల్తేర్‌ వీరయ్య మూవీలో చిరంజీవి సరసన శృతి హాసన్‌ నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా.. ఈ మధ్యే మూవీ నుంచి బాస్‌ పార్టీ అనే సాంగ్‌ కూడా వచ్చింది. ఇందులో లుంగీ పైకెత్తుకుంటూ వస్తూ ఊర మాస్‌ అవతారంలో చిరంజీవి కనిపించాడు.

ఆచార్య డిజాస్టర్‌ తర్వాత గాడ్‌ఫాదర్‌ మెగా సక్సెస్‌తో మళ్లీ గాడిలో పడిన మెగాస్టార్‌.. ఇప్పుడీ వాల్తేర్‌ వీరయ్యపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే సంక్రాంతి పోటీని తట్టుకొని ఈ సినిమా ఎలా నిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి ఈ సినిమాకు గట్టి పోటీగా నిలిచే అవకాశం ఉంది.

బాలకృష్ణతోపాటు మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న వీర సింహా రెడ్డి జనవరి 12న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన జై బాలయ్య సాంగ్‌ కూడా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది.

IPL_Entry_Point