Thalapathy67: క్రేజీ కాంబినేషన్‌.. విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ మూవీ ప్రారంభం-thalapathy67 of vijay and lokesh kangaraj started with pooja ceremony ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy67: క్రేజీ కాంబినేషన్‌.. విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ మూవీ ప్రారంభం

Thalapathy67: క్రేజీ కాంబినేషన్‌.. విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ మూవీ ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 02:50 PM IST

Thalapathy67: క్రేజీ కాంబినేషన్‌ అయిన దళపతి విజయ్‌, లోకేశ్ కనగరాజ్‌ మూవీ ప్రారంభమైంది. సోమవారం (డిసెంబర్‌ 5) పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ సినిమాను లాంచ్‌ చేశారు.

విజయ్, లోకేశ్ కనగరాజ్
విజయ్, లోకేశ్ కనగరాజ్

Thalapathy67: తమిళ సూపర్‌ స్టార్ దళపతి విజయ్‌, మాస్టర్‌, విక్రమ్‌ మూవీల ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ దళపతి67. విజయ్‌ 67వ మూవీ ఇది. ఇదొక గ్యాంగ్‌స్టార్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమా సోమవారం (డిసెంబర్‌ 5) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అయితే ఈ సినిమాను అధికారికంగా ఇంకా అనౌన్స్‌ చేయాల్సి ఉంది.

yearly horoscope entry point

సౌత్‌ ఇండస్ట్రీలో దళపతి 67 మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే ఫ్యాన్స్‌లో విపరీతమైన హైప్‌ క్రియేట్ చేసింది. ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమా కొత్త రికార్డులను బ్రేక్‌ చేసింది. ఇప్పటికే రూ.500 కోట్ల బిజినెస్‌ చేయడం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం.

విజయ్‌ నటించిన వారసుడు మూవీ సంక్రాంతికి రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత విజయ్‌ నటిస్తున్న మూవీ ఇదే. ఇప్పటికే లోకేశ్‌ తన స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్‌ కశ్మీర్‌లోనే జరగనుంది. నిజానికి మొదట ఈ సినిమాను మున్నార్‌లో తీయాలని అనుకున్నా.. ఇప్పుడు కశ్మీర్‌కు లొకేషన్‌ను మార్చినట్లు ఈ మూవీ వర్గాలు వెల్లడించాయి.

జనవరిలోనూ మొదటి షెడ్యూల్‌ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దళపతి67లో విజయ్‌ ఓ గ్యాంగ్‌స్టార్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా కనిపించనున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమాలో తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన భారీ తారాగణం నటించనుందనీ వార్తలు వస్తున్నాయి.

దళపతి67లో త్రిష ఫిమేల్‌ లీడ్‌లో కనిపించనుందనీ తెలుస్తోంది. మాస్టర్‌, విక్రమ్‌లను మించిన స్థాయిలో దళపతి 67ను నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Whats_app_banner