Salman Khan : 19 అంతస్తుల భవనాన్ని లగ్జరీ హోటల్‌గా మార్చనున్న సల్మాన్ ఖాన్-salman khan 19th floors building convert into hotel in mumbai ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Salman Khan 19th Floors Building Convert Into Hotel In Mumbai

Salman Khan : 19 అంతస్తుల భవనాన్ని లగ్జరీ హోటల్‌గా మార్చనున్న సల్మాన్ ఖాన్

Anand Sai HT Telugu
May 21, 2023 07:17 AM IST

Salman Khan Hotel Business : సల్మాన్ ఖాన్ ముంబైలోని చాలా ప్రాంతాల్లో ఆస్తులను కలిగి ఉన్నాడు. ముంబై శివార్లలో ఒక ఫాంహౌస్ ఉంది. ఇప్పుడు సల్లూ హోటల్ వ్యాపారంపై దృష్టి పెట్టాడు.

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ (twitter)

బాలీవుడ్‌(Bollywood)లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరో సల్మాన్ ఖాన్(Salman Khan). ఎన్నో సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న ఆయనకు వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. సల్మాన్ ఖాన్ ఆదాయ వనరుగా సినిమాలపై మాత్రమే ఆధారపడడు. చాలా రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. సల్లూకు రియల్ ఎస్టేట్ అంటే ప్రత్యేక ఆసక్తి. అవకాశం దొరికినప్పుడల్లా ఆస్తులు కొంటాడు. ఇప్పుడు విలాసవంతమైన హోటల్(Hotel) కట్టడానికి సల్లూ రెడీ అయ్యాడని అంటున్నారు. దీని ద్వారా కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు.

సల్మాన్ ఖాన్ ముంబై(Mumbai)లోని పలు ప్రాంతాల్లో ఆస్తులను కలిగి ఉన్నాడు. ముంబై శివార్లలో ఒక ఫాంహౌస్ ఉంది. సల్లూ హోటల్ వ్యాపారంపై దృష్టి పెట్టాడు. బాంద్రాలో సల్మాన్ ఖాన్‌కు 19 అంతస్తుల భవనం ఉంది. హోటల్‌గా మార్చే ఆలోచనలో ఉన్నాడు.

నివాసయోగ్యమైన ఇంటిని వాణిజ్య అవసరాలకు ఉపయోగించాలంటే పర్మిషన్ తీసుకోవాలి. సల్మాన్ ఖాన్ ఏడాది క్రితం దీనికోసం అనుమతి కోరాడు. గ్రేటర్ ముంబై కార్పొరేషన్ దీనికి ఆమోదం తెలిపింది. మరికొద్ది రోజుల్లో నివాసయోగ్యమైన భవనాన్ని హోటల్ గా మారుస్తామని చెబుతున్నారు.

మొదటి రెండు అంతస్తులలో ఒక కేఫ్, రెస్టారెంట్ ఉంటుంది. మూడవ అంతస్తులో స్విమ్మింగ్ పూల్, జిమ్ ఉంటుంది. నాలుగో అంతస్తులో సేవా మందిరం ఉంటుంది. ఐదో, ఆరో అంతస్తుల్లో వేడుకలకు హాళ్లు ఉంటాయి. 7వ-19వ అంతస్తులు హోటల్ పని కోసం ఉపయోగిస్తారు.

సల్మాన్ ఖాన్ నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' ఇటీవల విడుదలైంది. అనుకున్నంత స్థాయిలో సినిమా ఆడలేదు. సినిమా ఓ మోస్తరు వసూళ్లు సాధించింది. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'(Tiger 3) సినిమా పనుల్లో పాల్గొంటున్నాడు. ఇక ఆశలన్నీ టైగర్-3పైనే పెట్టుకున్నాడు. ఇందులో షారుఖ్ కూడా గెస్ట్ రోల్ పోషించనుండటంతో సినిమాపై బజ్ ఏర్పడింది. టైగర్-3ని భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.35 కోట్లు వెచ్చిచ్చిస్తున్నారట. సల్మాన్-షారుఖ్ ఇద్దరూ ఇందులో భాగమవుతారట.

అంతేకాదు కరణ్ జోహార్ తో సల్మాన్ కొత్త సినిమా చేయనున్నాడని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేదు. మెుత్తానికి సల్లూ భాయ్.. ఇటు సినిమాల్లోనూ.. అటు వ్యాపారాల్లోనూ బాగా సంపాదిస్తున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.