NTR in Thalapathy 68: విజయ్ సినిమాలో ఎన్టీఆర్.. డైరెక్టర్ హింట్ ఇచ్చినట్లేనా?
NTR in Thalapathy 68: కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తలపతి విజయ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీ ప్రకటన వచ్చింది. అయితే ఇందులో ఎన్టీఆర్ కూడా నటించబోతున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది.
NTR in Thalapathy 68: కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ఈ ఏడాది వారసుడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. తమిళంలో ఈ మూవీ ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో ఆయన నటించబోయే తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమాను చేస్తున్న విజయ్.. ఆ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో మూవీకి ప్లాన్ చేశారు. ఇటీవలే ఆ సినిమా ప్రకటన వచ్చింది. తలపతి 68(Thalapathy 68) అనే వర్కింగ్ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన వీడియోను గమనిస్తే హీరో, దర్శకుడు, నిర్మాత పేర్లను పజిల్ రూపంలో వైవిధ్యం చూపించారు. పేపర్ పజిల్‌లో అక్షరాలను ఒక్కొక్కటిగా జత చేస్తూ పేర్లు వచ్చేలా రౌండప్ చేయడం గమనంచవచ్చు. తలపతి విజయ్ అని, వెంకట్ ప్రభు అని హీరో, దర్శకుల పేర్లు వచ్చేలా అరేంజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నారనే టాక్ ఊపందుకుంది.
అయితే ఈ వార్త రావడానికి కారణం లేకపోలేదు. తలపతి 68 నుంచి విడుదలైన వీడియో పజిల్‌లో విజయ్ పేరు పక్కన ఎన్టీఆర్(NTR) అనే ఆంగ్ల అక్షరాలు స్పష్టంగా కనిపించడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం.. విజయ్ పేరుతో పాటు ఎన్టీఆర్ పేరును రౌండప్ చేసి ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందని అనిపించడం లేదని, మేకర్స్ పొరపాటున ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారని తాము అనుకోవడం లేదని అంటున్నారు. ఏదైతేనేం కావాలని కాకపోయినా.. విజయ్ సినిమాలో ఎన్టీఆర్ చేయబోతున్నాడనే వార్త మాత్రం అభిమానుల్లో ఆత్రుతను, ఉత్కంఠను పెంచుతోంది. ఈ కాంబో నిజంగా జరిగితే బాగుండని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంపై మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
తలపతి 68 చిత్రంలో విజయ్ హీరోగా చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. వెంకట్ ప్రభు నాగచైతన్యతో చేసిన కస్టడీ మూవీ ఇటీవల విడుదలైంది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు.