Thalapathy on Instagram: లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా ఎంట్రీ.. ఇన్‌స్టాలో అడుగుపెట్టిన దళపతి.. క్రేజ్ మాములుగా లేదుగా..!-thalapathy vijay enters into instagram followers crossed 1 million within one hour ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Thalapathy On Instagram: లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా ఎంట్రీ.. ఇన్‌స్టాలో అడుగుపెట్టిన దళపతి.. క్రేజ్ మాములుగా లేదుగా..!

Thalapathy on Instagram: లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా ఎంట్రీ.. ఇన్‌స్టాలో అడుగుపెట్టిన దళపతి.. క్రేజ్ మాములుగా లేదుగా..!

Maragani Govardhan HT Telugu
Apr 02, 2023 08:06 PM IST

Thalapathy on Instagram: కోలీవుడ్ స్టార్ విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన అడుగుపెట్టిన ఒక్క గంటలోనే ఒక మిలియన్ ఫాలోవర్లను వచ్చారు. సామాన్యూలే కాకుండా సెలబ్రెటీలు సైతం ఆయనను అనుసరించడం ప్రారంభించారు.

దళపతి విజయ్
దళపతి విజయ్

Thalapathy on Instagram: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానులను ఎంతో ఆదరించే విజయ్.. ఇంత వరకు సోషల్ మీడియా సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో లేరు. తాజాగా ఫ్యాన్స్‌కు మరింత చేరువయ్యేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన అడుగుపెట్టిన ఒక్క గంట వ్యవధిలోనే 1 మిలియన్ ఫాలోవర్లు వచ్చేశారు. దీంతో విజయ్‌కు బయటే కాకుండా సోషల్ మీడియాలోనూ ఏ విధంగా ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం.

విజయ్ ప్రస్తుతం తను నటిస్తున్న లియో సినిమా స్టిల్‌ను పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ పెట్టిన మిలియన్ల లైకులు, వేల కొద్ది కామెంట్లు వచ్చాయి. ఇన్‌స్టాలో ఆలస్యంగా అడుగుపెట్టినప్పటికీ ఫాలోయింగ్ విషయంలో తన తర్వాతే అన్నట్లుగా విజయ్ అదరగొట్టేశారు. ప్రస్తుతం విజయ్‌ను 2.1 మిలియన్ల మంది ఫాలో అవుతన్నారు.

అభిమానులు, నెటిజన్లే కాదు.. సెలబ్రెటీలు కూడా విజయ్‌ను ఫాలోవర్లుగా మారిపోయారు. దళపతి ఇన్‌స్టాలో ఎంట్రీ ఇవ్వగానే కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శిని లాంటి హీరోయిన్లు ఫాలో కొట్టేశారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు విజయ్‌ను ట్విటర్‌లోనూ ఫాలో అవుతున్నారు. దీంతో ఇన్‌స్టాలోనూ తనదైన శైలి ఎంట్రీతో అదరగొట్టారు దళపతి విజయ్

విజయ్ చివరగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన వారిసు(తెలుగులో వారసుడు) చిత్రంలో కనిపించారు. ఈ సినిమా కోలీవుడ్‌లో సూపర్ సక్సెస్ కాగా.. తెలుగులో మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాడులో ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల కొల్లగొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌తో లియో అనే సినిమా చేస్తున్నారు విజయ్. విక్రమ్ లాంటి సూపర్ హిట్ తర్వాత లోకేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

IPL_Entry_Point