Thalapathy 67 Title Reveal: విజయ్-లోకేష్ కనగరాజ్ సినిమా టైటిల్ ప్రకటన.. ఏంటంటే?-vijay and lokesh kanagaraj new movie thalapathy 67 title as leo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay And Lokesh Kanagaraj New Movie Thalapathy 67 Title As Leo

Thalapathy 67 Title Reveal: విజయ్-లోకేష్ కనగరాజ్ సినిమా టైటిల్ ప్రకటన.. ఏంటంటే?

Maragani Govardhan HT Telugu
Feb 03, 2023 07:07 PM IST

Thalapathy 67 Title Reveal: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాకు లియో అనే టైటిల్‌ను ఖరారు చేసింది.

దళపతి 67
దళపతి 67

Thalapathy 67 Title Reveal: దళపతి విజయ్ ఈ ఏడాది వారిసు చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో మెరుగైన వసూళ్లను సాధించింది. దీంతో ఆయన తదుపరి చిత్రంపై బజ్ ఏర్పడింది. గతేడాది విక్రమ్ చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకున్న లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా చేస్తున్నారు విజయ్. దళపతి 67(Thalapathy 67) అనే వర్కింగ్ టైటిల్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రిష, ప్రియా ఆనంద్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ చేస్తున్న ఈ సినిమాకు లియో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం. అలాగే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కశ్మీర్‌లో మొదటి షెడ్యూల్ జరగనుంది. ఈ షడ్యూల్‌లో విజయ్, త్రిషతో పాటు ముఖ్యమైన పాత్రదారులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు మేకర్స్.

టైటిల్ ప్రకటనతో పాటు గ్లింప్స్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియో గమనిస్తే.. విజయ్ ఇంట్రడక్షన్ సీన్ అని తెలుస్తుంది. బ్లడీ స్వీట్ అంటూ దళపతి విజయ్ చెప్పే డైలాగ్ ఆకర్షణీయంగా ఉంటుంది.

7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగదీష్ పళనీసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారట. త్రిష, ప్రియా ఆనంద్‌తో పాటు అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మ్యాథ్యూ థామస్, శాండీ మాస్టర్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే లోకేష్ దర్శకత్వంలో విజయ్.. మాస్టర్ చిత్రాన్ని చేశారు. 2021 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో వీరి కాంబోలో రాబోతున్న లియోపై అంచనాలు భారీగా పెరిగాయి. తన సినిమాటిక్ యూనివర్స్‌గా విక్రమ్, ఖైదీ సినిమాల కథలను కలిపిన లోకేష్.. ఈ చిత్రాన్ని కూడా తన మిగిలిన చిత్రాలతో జోడించనున్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point