Trisha in Thalapathy 67: దళపతి 67లో విజయ్ సరసన త్రిష-trisha in thalapathy 67 revealed by the makers on wednesday february 1st ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Trisha In Thalapathy 67 Revealed By The Makers On Wednesday February 1st

Trisha in Thalapathy 67: దళపతి 67లో విజయ్ సరసన త్రిష

Hari Prasad S HT Telugu
Feb 01, 2023 04:52 PM IST

Trisha in Thalapathy 67: దళపతి 67లో విజయ్ సరసన త్రిష నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ బుధవారం (ఫిబ్రవరి 1) అధికారికంగా అనౌన్స్ చేశారు. 14 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నారు.

త్రిష
త్రిష

Trisha in Thalapathy 67: వారిసు తర్వాత విజయ్ నటిస్తున్న మూవీ దళపతి 67. కోలీవుడ్ లో ఎంతో హైప్ ఉన్న ఈ మూవీ నుంచి ఏ అప్‌డేట్ వచ్చిన ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఓ పెద్ద అప్‌డేట్ తో వచ్చారు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటించనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని వాళ్లు ఓ స్పెషల్ ప్రోమో ద్వారా చెప్పారు.

గతంలో విజయ్, త్రిష కలిసి నటించిన సినిమాల నుంచి హిట్ సీన్స్ ను ఈ ప్రోమోలో వాడారు. ఈ జోడీ 14 ఏళ్ల తర్వాత మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరవనున్నట్లు మేకర్స్ చెప్పారు. దళపతి 67లో నటించే వాళ్ల గురించి రోజుకో అప్‌డేట్‌తో మేకర్స్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతున్నారు. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు మంగళవారం (జనవరి 31) అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

సంజయ్ దత్ తో పాటు గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, అర్జున్ సర్జా, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై భారీ ఎత్తున దళపతి 67ను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్