Sanjay Dutt In Thalapathy 67 : లోకేష్ కనగరాజ్ ‘దళపతి 67’లో సంజయ్ దత్-sanjay dutt playing key role in thalapathy 67 makers announce officially ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sanjay Dutt Playing Key Role In Thalapathy 67 Makers Announce Officially

Sanjay Dutt In Thalapathy 67 : లోకేష్ కనగరాజ్ ‘దళపతి 67’లో సంజయ్ దత్

Anand Sai HT Telugu
Jan 31, 2023 05:12 PM IST

Sanjay Dutt In Thalapathy 67 : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ సినిమా చేస్తున్నాడు. గతంలో ఇద్దరి కాంబినేషన్లో మాస్టర్ సినిమా వచ్చి.. సూపర్ హిట్ అయింది. దళపతి 67కు సంబంధించి.. తాజాగా మరో ఇంట్రస్టింగ్ విషయం మేకర్స్ పంచుకున్నారు.

దళపతి 67లో సంజయ్ దత్
దళపతి 67లో సంజయ్ దత్

Thalapathy 67 Movie : తమిళ హీరో దళపతి విజయ్ 67వ సినిమాకు సిద్ధమయ్యాడు. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో మళ్లీ వస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా మేకర్స్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. దళపతి 67లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt) నటించనున్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు.. ప్రియా ఆనంద్ కూడా ఈ సినిమాలో నటించనుంది.

సౌత్ సినిమాల్లో నటించేందుకు బాలీవుడ్ నటులు సైతం కొన్ని రోజులుగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ కేజీఎఫ్ 2లో కనిపించాడు. విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో సౌత్ సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. దళపతి 67 ప్రాజెక్టును మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంజయ్ దత్, ప్రియా ఆనంద్ ఈ సినిమాలో నటిస్తున్నట్టుగా వెల్లడించారు.

ఈ క్రేజీ కాంబోపై విపరీతంగా హైప్ క్రియేట్ అయింది. లోకేష్ కానగరాజ్ విక్రమ్ హిట్ తర్వాత తీస్తున్న సినిమా ఇది. దీంతో భారీ అంచనాలు ఉన్నాయి. సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడని ప్రకటించేసరికి.. ఇక ఈ భారీ ప్రాజెక్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

'తమిళ సినిమాకు సంజయ్ దత్ సార్‌ను స్వాగతిస్తున్నందుకు మేం గౌరవంగా భావిస్తున్నాం. ఆయన #Thalapathy67లో భాగమని ప్రకటించడానికి మేం సంతోషిస్తున్నాం.' అని ప్రొడక్షన్ హౌస్ సెవెన్ స్క్రీన్ స్టూడియో ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఉండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో సంజయ్ దత్(Sanjay Dutt) పాత్ర గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు.

7 స్క్రీన్‌ స్టూడియో సోమవారం ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేసింది. సంజయ్​ దత్ ఈ చిత్రంలో​ నటిస్తారనే కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఇందులో హీరోయిన్​గా ​ త్రిష నటించనుంది. అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

మరోవైపు లెజెండరీ నటుడు కమల్ హాసన్(Kamal Haasan), చియాన్ విక్రమ్(Chiyaan Vikram) దళపతి 67లో నటించనున్నట్టుగా ప్రచారం జరిగింది. బ్లాక్ బస్టర్ విక్రమ్ సినిమాలోని పాత్రకు కొనసాగింపుగా కమల్ పాత్ర ఉంటుందని అంటున్నారు. కమల్ సినిమా క్లైమాక్స్ లో కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఈ విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

ఇటీవలి ఇంటర్వ్యూలలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాను ఖైదీ, విక్రమ్ రెండింటి సీక్వెల్స్‌లో పనిచేస్తున్నట్లు ధృవీకరించారు. అనుకున్నట్లు జరిగితే దళపతి 67 విడుదలైన వెంటనే ఖైదీ 2 సెట్స్‌పైకి వెళ్లవచ్చు. తరువాత విక్రమ్ 2 నిర్మాణం ప్రారంభం కావొచ్చు. దీని తర్వాత సూర్య 'రోలెక్స్' క్యారెక్టర్ తో సినిమా ఉండే అవకాశం ఉందని టాక్.

IPL_Entry_Point