Sanjay Dutt Injured: బాంబు పేలుడులో సంజయ్ దత్‌కు గాయాలు.. అతని పరిస్థితి ఎలా ఉందంటే?-sanjay dutt injured during the shooting of kd movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sanjay Dutt Injured: బాంబు పేలుడులో సంజయ్ దత్‌కు గాయాలు.. అతని పరిస్థితి ఎలా ఉందంటే?

Sanjay Dutt Injured: బాంబు పేలుడులో సంజయ్ దత్‌కు గాయాలు.. అతని పరిస్థితి ఎలా ఉందంటే?

Hari Prasad S HT Telugu
Apr 12, 2023 07:50 PM IST

Sanjay Dutt Injured: బాంబు పేలుడులో సంజయ్ దత్‌కు గాయాలయ్యాయి. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా పేలుడు సీన్ తీస్తున్న సమయంలో అతడు గాయపడినట్లు సమాచారం.

సంజయ్ దత్
సంజయ్ దత్ (Ashish Vaishnav)

Sanjay Dutt Injured: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఓ సినిమా షూటింగ్ లో గాయాలయ్యాయి. ప్రస్తుతం సౌత్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న అతడు.. ఓ కన్నడ సినిమా షూటింగ్ సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. విజయ్ నటిస్తున్న లియో మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంజయ్ దత్.. ప్రస్తుతం కన్నడ మూవీ కేడీలో నటిస్తున్నాడు.

ధ్రువ సర్జా లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. ఈ మూవీలో ఓ బాంబు పేలుడు సీన్ షూట్ చేస్తున్న సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమాదంలో అతడి చెయ్యి, మోచేయి, ముఖానికి గాయాలయ్యాయి. సంజయ్ గాయపడిన తర్వాత చాలాసేపటి వరకూ షూటింగ్ నిలిచిపోయింది.

బెంగళూరులోని మగాడి రోడ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే సంజయ్ కు మరీ తీవ్ర గాయాలేమీ తగల్లేదని, అతడు వేగంగా కోలుకుంటున్నాడని మూవీ వర్గాలు వెల్లడించాయి. కేడీ ది డెవిల్ మూవీలో సంజయ్ దత్ విలన్ గా కనిపిస్తున్నాడు. కేజీఎఫ్ 2లో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించిన సంజయ్.. మరోసారి కన్నడలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

ప్రేమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా కన్నడతోపాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలలో రిలీజ్ కానుంది. ఈ కేడీ మూవీలో సంజయ్ దత్ తో పాటు మరో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కూడా నటిస్తోంది. ఈ మూవీలో సత్యవతి అనే పాత్రలో ఆమె కనిపించనుంది.

IPL_Entry_Point

టాపిక్