తెలుగు న్యూస్  /  Entertainment  /  Telugu Tv Serials Trp Ratings This Week As Brahmamudi Tops Again

Telugu TV Serials TRP Ratings this week: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. తిరుగులేని బ్రహ్మముడి

Hari Prasad S HT Telugu

30 May 2023, 14:55 IST

    • Telugu TV Serials TRP Ratings this week: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే. తిరుగులేని రీతిలో బ్రహ్మముడి దూసుకెళ్తోంది. తాజా రేటింగ్స్ లోనూ టాప్ లో నిలిచింది.
బ్రహ్మముడి సీరియల్
బ్రహ్మముడి సీరియల్

బ్రహ్మముడి సీరియల్

Telugu TV Serials TRP Ratings this week: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ లో ఉండే సీరియల్స్ ఏవి? ఇది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వాళ్ల కోసం తాజాగా బార్క్ రిలీజ్ చేసిన టీఆర్పీ రేటింగ్స్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ లోనూ బ్రహ్మముడి టాప్ లో ఉండగా.. స్టార్ మా, జీ తెలుగు హవా కొనసాగింది.

ట్రెండింగ్ వార్తలు

Mahesh Babu: మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన ల‌వ్ స్టోరీ థియేట‌ర్ల‌లో ఏడాది ఆడింది- ఆ సినిమా ఏదంటే?

NNS May 2nd Episode: మనోహరికి షాక్ ఇచ్చిన మిస్సమ్మ.. చివరిసారిగా వీడ్కోలు పలికిన అరుంధతి.. ముగియనున్న పాత్ర

Flop Movies: 100 డేస్ ఆడి కూడా ప్లాప్ అయిన సినిమాలు.. మహేష్ బాబువే ఎక్కువ!

Aha OTT: ఆహా ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో అద‌ర‌గొడుతోన్న కామెడీ మూవీ -అలాంటి వారికి ఓ ఎగ్జాంపుల్ ఈ సినిమా!

ఈ రెండు ఛానెల్స్ కు చెందిన సీరియల్సే టాప్ 15లో ఉండటం విశేషం. ఇక స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి టాప్ లో కొనసాగుతున్నా.. టీఆర్పీ కాస్త తగ్గింది. తాజాగా మే 13 నుంచి మే 19తో ముగిసిన వారానికిగాను సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. తాజా ర్యాంకింగ్స్ లో టాప్ 10లో ఏకంగా ఏడు సీరియల్స్ స్టార్ మాకు చెందినవే కాగా.. మిగతా మూడు జీ తెలుగులో వచ్చే సీరియల్స్.

ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న బ్రహ్మముడి, నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, ఎన్నెన్నో జన్మలబంధం, ఇంటికి దీపం ఇల్లాలు, త్రినయనిలాంటి సీరియల్స్ ఉన్నాయి.

తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

బ్రహ్మముడి (స్టార్ మా) 11.24

నాగ పంచమి (స్టార్ మా) 10.65

కృష్ణా ముకుందా మురారి (స్టార్ మా) 10.59

ప్రేమ ఎంత మధురం (జీ తెలుగు) 7.42

త్రినయని (జీ తెలుగు) 7.36

మల్లీ నిండు జాబిలి (స్టార్ మా) 7.13

నువ్వు నేను ప్రేమ (స్టార్ మా) 6.81

పడమటి సంధ్యారాగం (జీ తెలుగు) 6.44

ఇంటికి దీపం ఇల్లాలు (స్టార్ మా) 5.93

జానకి కలగనలేదు (స్టార్ మా) 5.76

వంటలక్క (స్టార్ మా) 5.62

పాపే మా జీవనజ్యోతి (స్టార్ మా) 5.45

మధురానగరిలో (స్టార్ మా) 5.44

ఎన్నెన్నో జన్మలబంధం (స్టార్ మా) 5.29

అమ్మాయిగారు (జీ తెలుగు) 5.27

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.