Brahmamudi Serial Today Episode : అందరి ముందు రాహుల్ నిజ స్వరూపం బయటపెట్టిన స్వప్న-brahmamudi serial today episode appu and kalyan rescue kavya and shruti ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Brahmamudi Serial Today Episode Appu And Kalyan Rescue Kavya And Shruti

Brahmamudi Serial Today Episode : అందరి ముందు రాహుల్ నిజ స్వరూపం బయటపెట్టిన స్వప్న

HT Telugu Desk HT Telugu
May 30, 2023 07:59 AM IST

Brahmamudi Serial May 30 Episode : ఓ వైపు స్వప్న నిశ్చితార్థం. మరోవైపు కావ్య, శృతి కిడ్నాప్ అయ్యారు. మరోవైపు రాహుల్- వెన్నెల్ నిశ్చితార్థం అయిపోతుంది. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.

బ్రహ్మముడి సీరియల్
బ్రహ్మముడి సీరియల్

స్వప్న నిశ్చితార్థానికి కావ్య ఎందుకు రాలేదని చుట్టుపక్కల వాళ్లు అడుగుతారు. వాళ్ల ఇంట్లో కూడా ఫంక్షన్ ఉందని, రాహుల్ కు నిశ్చితార్థమని కనకం సమాధానమిస్తుంది. గదిలో నుంచి ఈ విషయాన్ని స్వప్న విని షాక్ అవుతుంది. వాళ్లు రమ్మని చెప్పారని, కానీ మన పరిస్థితి ఇలా ఉందని అంటుంది. మరోవైపు కావ్య, స్వప్న కిడ్నాప్ అయి ఉంటారు. ఎవర్రా మీరు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారని కావ్య ప్రశ్నిస్తుంది. మాకు ఒక కాల్ వస్తుందని, అప్పుడే వదిలిపెడతామని అంటాడు రౌడీ సలీమ్.

తన దగ్గర రాజ్ ఫోన్ ఉన్న విషయం కావ్యకు గుర్తుకువచ్చి.. చేతులు కట్టేసి ఉన్నా.. మెల్లగా పర్సులో చేయి పెట్టి.. ఫోన్ తీస్తుంది. అప్పుకు మెసేజ్ పంపిస్తుంది. మీ అన్న మెుబైల్ నుంచి నాకు మెసేజ్ పెట్టాడని, అప్పు మేం కిడ్నాప్ అయ్యాం.., వచ్చి కాపాడండని వచ్చిందంటుంది అప్పు. ఇది విని కల్యాణ్ షాక్ అవుతాడు. మా అన్నను కిడ్నాప్ చేశారా? ఎవరు చేశారు? అని కంగారు పడుతాడు. మా అన్న దేవుడు అప్పు వెళ్లి హెల్ప్ చెద్దామంటాడు. అప్పు అని ప్రేమగా పిలిచారంటే.. కిడ్నాప్ అయింది.. మీ అన్న కాదు.. మా అక్క అని అప్పు అంటుంది.

వాళ్లు ఎక్కడున్నారో తెలియకుండా.. ఎలా వెళ్దామని కల్యాణ్ ప్రశ్నిస్తాడు. కల్యాణ్ తెచ్చిన లెటర్ ను తీసుకెళ్లి.. స్వప్నకు పంపించి బయల్దేరుతారు. రాహుల్ నిశ్చితార్థం గురించి తెలిసి షాక్ లోనే ఉంటుంది స్వప్న. ఎవరిని నమ్మాలని మనసులో అనుకుంటుంది. ఇదే సమయంలో పనివాడు వచ్చి.. అప్పు అక్క లెటర్ ఇవ్వమని చెప్పిందని, చాలా ఇంపార్టెట్ అందని ఇచ్చి వెళ్లిపోతాడు. నడి సంద్రంలో నావలాగా నా బతుకు ఏడ్చిందని నేను బాధపడుతుంటే.. ఇదొక్కటని కసురుకుంటుంది స్పప్న.

లెటర్ లో ఏం ఉందని తెరుస్తుంది స్వప్న. 'అక్క నాకు తెలుసు నువ్ నమ్మవని, నేం ఏం చెప్పినా అబద్ధమని అనుకుంటావ్. కానీ నిజం వేరేలా ఉంది. నువ్ రాహుల్ ని ప్రేమించావ్. రాహుల్ కూడా నిన్ను ప్రేమించాడని అనుకున్నావ్. రాహుల్ నిన్ను ప్రేమించలేదు అక్క. ప్రేమించినట్టు నటించాడు. నిన్ను నమ్మించినట్టు మోసం చేశాడు. నీలా చాలామందిని మోసం చేశాడు. నిజం నువ్ తెలుసుకోవాలంటే.. ఒక్కసారి మా ఇంటికి రా. నాకోసం కాదు.. నీ కోసం. శ్రీరాముడని నువ్ అనుకుంటున్న రాహుల్ నిజం రంగు నీకు తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో అక్క. నువ్ రాకపోయినంత మాత్రన, నీ రాహుల్ రాముడు అయిపోడు. తెలియని తప్పుకు నువ్వే నీ జీవితాన్ని బలి చేసుకుంటున్నావ్.. నిజాన్ని నువ్ తెలుసుకోవాల్సిందే. అన్యాయాన్ని ఎదురించి.. నిజాన్ని బయటపెట్టాల్సిందే.' అని కావ్య లెటర్లో రాస్తుంది. మరోవైపు కనకం స్వప్నను పిలుస్తుంది.

మరోవైపు రాహుల్- వెన్నెల నిశ్చితార్థం పూర్తవుతుంది. రాజ్ నువ్ కావ్య కూడా అంక్షితలు వేయండని పెద్దలు చెబుతారు. కావ్య ఏది అని ప్రశ్నిస్తారు. ఏమైంది మళ్లీ కనపడకుండా పోయిందా అని రుద్రాణి అడుగుతుంది. అదేం మాట అని అరుంధతీ అంటుంది. ఏదో పనిలో ఉండి ఉంటుందని చెబుతుంది. నేనే బయటకు పంపానని రాజ్ అంటాడు. ఫోన్ రిపేర్ అయిందని, కల్యాణ్ తో కలిసి పంపించానని చెబుతాడు రాజ్. కావ్య ఎక్కడకు వెళ్లిందో రాజ్ కు తెలుసా లేదా అని రాహుల్ అనుకుంటాడు. అయినా కిడ్నాప్ చేయించాం కదా ఏం కాదులే అని మనసులో చెప్పుకుంటాడు. ఈ టైమ్ లో అనవసరంగా బయటకు వెళ్లావ్, ఎక్కడకు వెళ్లావని రాజ్ మనసులో అనుకుంటాడు.

ఇంకోవైపు స్వప్న ఇంటికి నిశ్చితార్థం కోసం పెళ్లి కొడుకు వస్తాడు. అబ్బాయి ఏం చేస్తాడని చుట్టుపక్కల వాళ్లు అడుగుతారు.. డాక్టర్ బాబు అని ఇంట్లో వాళ్లు సమాధానం ఇస్తారు. ఇలా కాసేపు ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటారు. లోపల మాత్రం స్వప్న రాహుల్ నిశ్చితార్థం జరగకముందే వెళ్లాలని మనసులో అనుకుంటుంది. బయటకు వెళ్దామంటే.. అమ్మ కాళ్లు విరగ్గొడుతుందని ఆలోచిస్తుంది

మరోవైపు రాజ్ తన బాబాయ్ ని ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. తన ఫోన్ కు కాల్ చేస్తానని చెబుతాడు. కాల్ చేయగా.. అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. నెట్వర్క్ పరిధిలో లేకపోవడం ఏంటని, అనుకుంటాడు రాజ్. మళ్లీ ట్రై చేస్తాడు. ఈసారి రింగ్ అవుతుంది. అక్కడే ఉన్న రౌడీలు ఫోన్ లాక్కుంటారు. రాజ్ మళ్లీ ట్రై చేయగా.. స్విచ్ఛాప్ అని వస్తుంది. అసలు ఏమైంది.. ఎక్కడ ఉందని రాజ్ అనుకుంటాడు. ఇదే సమయంలో అప్పు డోర్లు తెరుచుకుని కిడ్నాప్ చేసిన ప్రదేశానికి వస్తుంది.

కల్యాణ్ కుడా అక్కడకు ఎంట్రీ ఇస్తాడు. ఎవర్రా మీరు అని కిడ్నాపర్లు అడుగుతారు. వాళ్ల అక్కను ఒక్క మాట అంటేనే ఊరుకోదు.. ఇప్పుడు మీరు కిడ్నాప్ చేశారని కల్యాణ్ అంటాడు. కిడ్నాపర్లను అప్పు కొడుతుంది. ఓ వైపు కల్యాణ్ కట్లు విప్పుతాడు. కావ్య, శృతి కట్లు విప్పుకొని సేఫ్ అవుతారు. మిమ్మల్ని ఎవరు పంపించారని కిడ్నాపర్లను ప్రశ్నిస్తారు. రౌడీలు సైలెంట్ గా ఉండేసరికి.. రాహుల్ కదా పంపిందని కావ్య అంటుంది. అసలు ఏమైందని అప్పు అడుగుతుంది. ఇప్పుడు చెప్పే ఓపిక లేదని, తర్వాత మాట్లాడుకుందామని కావ్య అంటుంది. మీరు ఇంటికి వెళ్లి స్వప్నక్కను తీసుకురండి.. నేను, శృతి వేరే ప్లేసుకు వెళ్తామని కావ్య బయల్దేరుతుంది.

సీన్ కట్ చేస్తే.. రాహుల్, వెన్నెల బట్టలు మార్చుకుని కిందకి దిగుతారు. మీడియా వాళ్లు వచ్చి.. కంగ్రాట్స్ చెప్పి.. మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసుకోవచ్చా అని ప్రశ్నిస్తారు. రాహుల్ సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు ఆస్తుల గురించి ఎందుకని ఇంట్లో వాళ్లు చెబుతారు. ఆదర్శంగా రాజ్ పేదింటి అమ్మాయిని చేసుకున్నాడని, మరి మీరు ఇంత రిచ్ సంబంధం ఎందుకు చేసుకుంటున్నారని మీడియా నుంచి ప్రశ్నలు వస్తాయి. మా రాజ్ పెళ్లి చేసుకుంది.. పేదించి అమ్మాయినే కావొచ్చు, కానీ ఒక కళాకారిణి అని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతారు. కళకు పేదరికమనేది లేదు అని చెబుతారు. ఇలా మీడియాతో కాసేపు చర్చ జరుగుతుంది. తన స్టేటస్ పెరగాలని మీడియాను పిలిపించింది అపర్ణే. ఈ విషయం అక్కడ ఎవరికీ తెలియదు.

మరోవైపు కావ్య, శృతి ఓ హోటల్ దగ్గరకు వస్తారు. శృతి ఇక్కడకు ఎందుకు తీసుకోచ్చావ్ అని కావ్య ప్రశ్నిస్తుంది. రాహుల్ నన్ను ఎప్పుడు కలిసినా.. ఇదే హోటల్ లో కలిసేవాడని శృతి చెబుతుంది. ఇక్కడ తనకో మేనేజర్ ఉన్నాడని, ఇక్కడ ఏదైనా ఆధారాలు దొరుకుతాయని శృతి అంటుంది. రాహుల్ ఆరోజు అక్కను తీసుకొచ్చింది కూడా ఇదే హోటల్ కి.. ఆధారాలు దొరకొచ్చు అని కావ్య అంటుంది. అయితే ఈ మేనేజర్ కు నేను తెలుసు అని గుర్తుపట్టే అవకాశం ఉందని, అయినా నేను వస్తానని కావ్య అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో కావ్య, స్వప్న, అప్పు, కల్యాణ్ నిశ్చితార్థం జరిగే ప్లేసుకు వస్తారు. పెళ్లి మండపం నుంచి నేను లేచిపోలేదని, ఈ రాహులే లేవదీసుకుని పోయాడని అంటుంది స్వప్న. అందరూ షాక్ అవుతారు.

IPL_Entry_Point