తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu: మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన ల‌వ్ స్టోరీ థియేట‌ర్ల‌లో ఏడాది ఆడింది- ఆ సినిమా ఏదంటే?

Mahesh Babu: మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన ల‌వ్ స్టోరీ థియేట‌ర్ల‌లో ఏడాది ఆడింది- ఆ సినిమా ఏదంటే?

02 May 2024, 12:57 IST

  • Mahesh Babu: టాలీవుడ్ ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టైన నువ్వే కావాలి సినిమాలో హీరోగా తొలుత మ‌హేష్ బాబును అనుకున్నారు. కానీ అత‌డు రిజెక్ట్ చేయ‌డంతో త‌రుణ్‌కు అవ‌కాశం ద‌క్కింది. మ‌హేష్ రిజెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షాన్ని కురిపించింది.

మ‌హేష్ బాబు
మ‌హేష్ బాబు

మ‌హేష్ బాబు

Mahesh Babu: ఓ హీరో రిజెక్ట్ చేసిన మూవీలో మ‌రో హీరో న‌టించ‌డం అన్న‌ది అన్ని ఇండ‌స్ట్రీల‌లో కామ‌న్‌గా క‌నిపిస్తుంది. హీరోలు రిజెక్ట్ చేసే సినిమాల విష‌యంలో కొన్నిసార్లు జ‌డ్జ్‌మెంట్‌లు త‌ప్ప‌వుతుంటాయి. వారు వ‌దులుకున్న సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలుస్తుంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

OTT Weekend Movies: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఈ సినిమాలు, వెబ్ సిరీస్‍ను మిస్ అవ్వొద్దు!

Furiosa A Mad Max Saga: మ్యాడ్‌మ్యాక్స్‌కు ప్రీక్వెల్ వ‌స్తోంది… 1400 కోట్ల విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

అలాంటి సినిమాలు మ‌హేష్ బాబు కెరీర్‌లో చాలానే ఉన్నాయి. త‌న ఇమేజ్‌కు సూట్ అయ్యే క‌థ కాద‌నో, హీరోయిజం ఛాయ‌లు లేని సాఫ్ట్‌ క్యారెక్ట‌ర్స్‌లో త‌న‌ను అభిమానులు చూడ‌లేర‌నే భావ‌న‌తో మ‌హేష్ ప‌లు తెలుగు సినిమాల్ని వ‌దులుకున్నారు. అందులో ఎక్కువ‌గా ల‌వ్‌స్టోరీలే ఉన్నాయి. మ‌హేష్ వ‌దులుకున్న ఈ సినిమాలు అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించాయి.

త్రివిక్ర‌మ్ డైలాగ్ రైట‌ర్‌గా...

మ‌హేష్ బాబు వ‌దులుకున్న సినిమాల్లో నువ్వే కావాలి ఒక‌టి. త్రివిక్ర‌మ్ డైలాగ్ రైట‌ర్‌గా విజ‌య‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 2000 ఏడాదిలో రిలీజైన ఈ మూవీ టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది.

ఈ సినిమాను రామోజీరావుతో క‌లిసి స్ర‌వంతి ర‌వికిషోర్ ప్రొడ్యూస్ చేశాడు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన నిర‌మ్ ఆధారంగా నువ్వే కావాలి మూవీ తెర‌కెక్కింది.

మ‌హేష్ బాబు ఫ‌స్ట్ ఛాయిస్‌...

నిర‌మ్ రీమేక్ రైట్స్ తీసుకున్న స్ర‌వంతి ర‌వికిషోర్ హీరోగా మ‌హేష్ బాబును ఫ‌స్ట్ ఛాయిస్‌గా అనుకున్నారు.అప్ప‌టికి హీరోగా మ‌హేష్ బాబు తొలి మూవీ రాజ‌కుమారుడు మాత్ర‌మే రిలీజైంది.

మ‌హేష్ అయితేనే హీరో క్యారెక్ట‌ర్‌కు ప‌ర్‌ఫెక్ట్ యాప్ట్ అవుతాడ‌ని స్ర‌వంతి ర‌వికిషోర్ భావించారు. నువ్వే కావాలి రీమేక్ గురించి చెప్పి నిర‌మ్ సినిమాను చూడ‌మ‌ని మ‌హేష్‌కు చెప్పార‌ట ప్రొడ్యూస‌ర్‌. హీరో పాత్ర త‌న ఇమేజ్‌కు స‌రిపోతుందో లేదా అనే డైలామాలో మ‌హేష్‌బాబు నువ్వే కావాలి రీమేక్‌లో న‌టించ‌లేక‌పోయారు.

సుమంత్ కూడా...

మ‌హేష్ కాద‌న‌డంతో ఆ త‌ర్వాత సుమంత్‌, బాలీవుడ్ హీరో అప్తాబ్ శివ‌దాస‌నీతో పాటు మ‌రికొంద‌రిని హీరో రోల్ కోసం ఆడిష‌న్ చేశారు. కానీ వారు ఎవ‌రూ సూట్ కాక‌పోవ‌డంతో ఓ యాడ్‌లో క‌లిసి న‌టించిన త‌రుణ్‌, రిచాల‌ను హీరోహీరోయిన్లు సెలెక్ట్ చేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

30 కోట్ల క‌లెక్షన్స్‌...

కేవ‌లం కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన నువ్వే కావాలి మూవీ అప్ప‌ట్లోనే 30 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. తెలుగు సినీ చ‌రిత్ర‌లో నిర్మాత‌ల‌కు అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. దాదాపు ఇర‌వైకిపైగా థియేట‌ర్ల‌లో 250 రోజుల‌కుపైగా ఆడింది. కొన్ని థియేట‌ర్ల‌లో షిప్ట్ విధానంలో ఏడాదిపైగా ఆడింది. ఈ సినిమాతో త‌రుణ్‌, రిచాల‌కు యూత్‌లు ఫుల్ క్రేజ్ ఏర్ప‌డింది.

నువ్వే కావాలి సినిమా గ‌నుక మ‌హేష్‌బాబు మిస్ చేసుకోక‌పోయి ఉంటే రెండో మూవీతోనే ఇండ‌స్ట్రీ హిట్‌ను అందుకున్న హీరోగా నిలిచేవాడు.

ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళితో అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోన్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్‌ప‌నులు జ‌రుగుతోన్నాయి. ఈ ఏడాది ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం