Prashanth Neel Ugram Review: ప్రశాంత్ నీల్ ఉగ్రం రివ్యూ - ఈ గ్యాంగ్‌స్టర్ మూవీ రీమేక్‌గా ప్రభాస్ సలార్ రూపొందిందా?
Prashanth Neel Ugram Review: ప్రశాంత్ నీల్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ రూపొందించిన కన్నడ మూవీ ఉగ్రం. శ్రీమురళి హీరోగా నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా ఆధారంగానే ప్రభాస్ సలార్ రూపొందినట్లు కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తోన్నాయి. ఉగ్రం సినిమా ఎలా ఉందంటే..
Prashanth Neel Ugram Review: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న సలార్ మూవీ శుక్రవారం (రేపు) వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కన్నడ మూవీ ఉగ్రమ్ రీమేక్‌గా సలార్ రూపొందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
సలార్ ప్రమోషన్స్‌లో ప్రశాంత్ నీల్ సైతం సలార్ ... ఉగ్రమ్ రీమేక్ అంటూ కన్ఫామ్ చేశాడని కథనాలు వెలువడుతోన్నాయి. ఉగ్రమ్ మూవీతోనే ప్రశాంత్ నీల్ డైరెక్టర్‌గా సాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఉగ్రమ్ మూవీలో శ్రీమురళి హీరోగా నటించాడు.
2014లో రిలీజైన ఉగ్రమ్ మూవీ ఎలా ఉంది? ఎలాంటి అంచనాలు లేకుండా సెలైంట్‌గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి కారణం ఏమిటి? ఉగ్రం సినిమా ఆధారంగానే ప్రశాంత్ నీల్ సలార్‌ను తెరకెక్కించాడా? పదేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఇప్పుడు వార్తల్లో నిలవడానికి కారణం ఏమిటి?అన్నది తెలియాలంటే ఉగ్రమ్ కథలోని వెళ్లాల్సిందే...
గ్యాంగ్‌స్టర్ కమ్ బైక్ మెకానిక్...
అగస్త్య (శ్రీమురళి) ఓ బైక్ మెకానిక్ (శ్రీమురళి). ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నిత్య (హరిప్రియ) అనే అమ్మాయిని పొలిటీషియన్ కమ్ గ్యాంగ్‌స్టర్ శివరుద్రలింగయ్య (అవినాష్) మనుషులు చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రౌడీల బారి నుంచి నిత్యను ఆగస్త్య కాపాడుతాడు. నిత్య ఆస్ట్రేలియా వెళ్లకుండా శివరుద్ర అడ్డుకోవడంతో తన ఇంట్లోనే ఆమెకు ఆశ్రయం ఇస్తాడు ఆగస్త్య.
నిత్యను పనిమనిషిగా తన తల్లికి పరిచయం చేస్తాడు ఆగస్త్య. కొన్నాళ్లలోనే ఆగస్త్య మంచితనం చూసి అతడిని ప్రేమిస్తుంది నిత్య. అగస్త్య కోసం తరచుగా అతడి ఇంటికి పోలీసులు వస్తుంటారు. అతడిని చూస్తేనే ఇంటి చుట్టుపక్కల వారందరూ భయపడుతుంటారు. చివరకు నిత్యపై ఎటాక్ చేసిన శివరుద్రలింగయ్యతో పాటు అతడి మనుషులు కూడా ఆగస్త్యను చూసి భయపడిపారిపోతారు.
అసలు ఆగస్త్య ఎవరు? ముగోర్ అనే క్రైమ్ సిటీలో తిరుగులేని గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన ఆగస్త్య ఆ నేర ప్రపంచాన్ని వదిలిపెట్టి బైక్ మెకానిక్‌గా ఎందుకు బతుకుతున్నాడు? అతడి గతం ఏమిటి? స్నేహితుడు బాలాకు చిన్నతనంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆగస్త్య ఏం చేశాడు? తనను గ్యాంగ్‌స్టర్‌గా నిలబెట్టిన ఆగస్త్యను బాలా ఎందుకు చంపాలని అనుకున్నాడు? ఆగస్త్య, నిత్య ఎలా ఒక్కటయ్యారు అన్నదే ఉగ్రం సినిమా కథ.
కేజీఎఫ్ ఛాయలతోనే...
ఉగ్రం సినిమా చాలా వరకు కేజీఎఫ్ ఛాయలతోనే సాగుతుంది. కేజీఎఫ్‌లోని హీరోయిజం, ఎలివేషన్స్ సీన్స్‌కు ఉగ్రం స్ఫూర్తిగా నిలిచినట్లుగా అనిపిస్తుంది. ఒకరకంగా స్మాల్ బడ్జెట్‌తో తెరకెక్కించిన కేజీఎఫ్‌లా ఉగ్రం సినిమా ఉంటుంది. రొటీన్ కథను తనదైన శైలి టిపికల్ స్క్రీన్‌ప్లేతో ఎంగేజింగ్‌గా సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. హీరోను కరుడుగట్టిన రాక్షసుడిగా ప్రజెంట్ చేస్తూ వచ్చే డైలాగ్స్, అతడి గతం గురించి ప్రతి ఒక్కరూ భయపడే సీన్స్ ఉత్కంఠను కలిగిస్తాయి.
గూస్‌బంప్స్...
ముగోర్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే క్రైమ్ సీన్స్‌లో శ్రీమురళిలోని హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించారు ప్రశాంత్ నీల్. సిండికేట్ నాయకుల్ని ఒక్కొక్కరిని హీరో ప్లానింగ్‌తో హత్య చేసే సీన్స్, సిండికేట్ లీడర్ శెట్టికి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. చివరకు హీరో చేతికి ఉన్న టాటూకు కూడా భారీ హైప్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌తోనే చాలా వరకు హీరోయిజాన్ని చూపించిన తీరు మెప్పిస్తుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాకు సమాంతరంగా వచ్చే లవ్ స్టోరీ, మదర్ సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
ఆగస్త్యగా...
ఆగస్త్య అనే గ్యాంగ్‌స్టర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో శ్రీమురళి యాక్టింగ్ బాగుంది. సీరియస్ రోల్ లో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. నిత్యాగా అమాయకత్వం, ఎమోషన్ కలగలసిన పాత్రలో హరిప్రియ సహజ నటనను కనబరిచింది. బాలాగా తిలక్ శేఖర్ మెప్పించాడు. ఈ సినిమాలో విలన్స్‌గా అవినాష్, అతుల్ కులకర్ణి కనిపించారు.
యూ ట్యూబ్‌లో…
ఉగ్రం సినిమా యూ ట్యూబ్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ గ్యాంగ్‌స్టర్ ట్రెండ్‌కు ఆరంభంగా నిలిచిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. కేజీఎఫ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.