Zee Telugu Serials Latest TRP Ratings: జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
19 May 2023, 15:52 IST
- Zee Telugu Serials Latest TRP Ratings: జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే. తాజాగా మే 6 నుంచి మే 12తో ముగిసిన వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి.
జీ తెలుగులో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్
Zee Telugu Serials Latest TRP Ratings: తెలుగులోని టాప్ ఛానెల్స్ లో ఒకటైన జీ తెలుగులో ప్రేక్షకులు మెచ్చే సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. వారం వారం రిలీజయ్యే ఓవరాల్ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ 10లో స్టార్ మా కాకుండా జీ తెలుగు సీరియల్స్ మాత్రమే చోటు సంపాదిస్తాయి. అయితే జీ తెలుగులో వచ్చే సీరియల్స్ లో ఏది టాప్?
తాజాగా మే 6 నుంచి మే 12తో ముగిసిన వారానికి సంబంధించి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. కేవలం జీ తెలుగు సీరియల్స్ కు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ ఇవి. బార్క్ ఈ లేటెస్ట్ టీఆర్పీలను రిలీజ్ చేసింది. జీ తెలుగు వరకూ వస్తే ఇందులోని ప్రేమ ఎంత మధురం సీరియల్ టాప్ లో నిలిచింది. టాప్ 10లో చాలా వరకూ ప్రేక్షకులు మెచ్చే సీరియల్సే ఉన్నాయి.
జీ తెలుగు టాప్ 10 సీరియల్స్ ఇవే
ప్రేమ ఎంత మధురం 8.16
త్రినయని 7.50
పడమటి సంధ్యారాగం 6.86
అమ్మాయిగారు 6.20
చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి 5.12
రాధకు నీవేరా ప్రాణం 4.62
ముక్కుపుడక 4.40
గుండమ్మ కథ 4.27
రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ 3.96
రాధమ్మ కూతురు 3.73