Telugu Programs TRP Ratings: ఈటీవీని కొట్టేసిన స్టార్ మా.. టాప్ టీఆర్పీ సాధించిన తెలుగు ప్రోగ్రామ్ ఇదే-telugu programs trp ratings as star maa over takes etv ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Programs Trp Ratings: ఈటీవీని కొట్టేసిన స్టార్ మా.. టాప్ టీఆర్పీ సాధించిన తెలుగు ప్రోగ్రామ్ ఇదే

Telugu Programs TRP Ratings: ఈటీవీని కొట్టేసిన స్టార్ మా.. టాప్ టీఆర్పీ సాధించిన తెలుగు ప్రోగ్రామ్ ఇదే

Hari Prasad S HT Telugu
May 16, 2023 04:42 PM IST

Telugu Programs TRP Ratings: ఈటీవీని కొట్టేసింది స్టార్ మా. టాప్ టీఆర్పీ సాధించిన తెలుగు ప్రోగ్రామ్స్ లో స్టార్ మాకు చెందిన సిక్త్స్ సెన్స్ ఉండటం విశేషం.

స్టార్ మాలో వచ్చే సిక్త్స్ సెన్స్ ప్రోగ్రామ్
స్టార్ మాలో వచ్చే సిక్త్స్ సెన్స్ ప్రోగ్రామ్

Telugu Programs TRP Ratings: స్టార్ మా అటు సీరియల్స్ లోనే కాదు ఇటు రియాల్టీ షోలలోనూ తిరుగులేదని నిరూపిస్తోంది. ఇన్నాళ్లూ సీరియల్స్ లోనే సత్తా చాటిన ఆ ఛానెల్.. ఈ రియాల్టీ షోలలోనూ ఈటీవీని మించిపోయింది. తాజాగా టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మా ఛానెల్లో వస్తున్న సిక్త్స్ సెన్స్ టాప్ లో నిలవడం విశేషం.

ఈ క్రమంలో ఈటీవీ ప్రోగ్రామ్స్ వెనక్కి తగ్గాయి. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 28తో ముగిసిన వారానికిగాను తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ టీఆర్పీ రేటింగ్స్ టాప్ 5లో రెండు స్టార్ మా కార్యక్రమాలు ఉన్నాయి. తొలి స్థానంలో సిక్త్స్ సెన్స్ తోపాటు మూడోస్థానంలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం నిలిచింది. ఇక టాప్ 10లో ఎప్పటిలాగే ఈటీవీలోని ప్రోగ్రామ్సే ఎక్కువగా ఉన్నాయి.

బార్క్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం సేకరించిన టీఆర్పీ రేటింగ్స్ ఇవి. టాప్ 10 ప్రోగ్రామ్స్ లో ఆరు ఈటీవీకి చెందినవి కావడం విశేషం. రెండు స్టార్ మా, మరో రెండు జీ తెలుగు ఛానెల్స్ లో వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. నిజానికి చాలా కాలం నుంచి ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ టాప్ లో ఉండగా.. ఈసారి స్టార్ మాలోని సిక్త్స్ సెన్స్ దానిని బీట్ చేసింది.

టాప్ తెలుగు టీవీ ప్రోగ్రామ్స్

సిక్త్స్ సెన్స్ (స్టార్ మా) 3.91

శ్రీదేవి డ్రామా కంపెనీ (ఈటీవీ) 3.89

ఆదివారం విత్ స్టార్ మా పరివారం (స్టార్ మా) 3.70

ఎక్స్‌ట్రా జబర్దస్త్ (ఈటీవీ) 2.93

ఢీ15 (ఈటీవీ) 2.49

జబర్దస్త్ (ఈటీవీ) 2.29

సరిగమప ఛాంపియన్‌షిప్(జీ తెలుగు) 2.12

సూపర్ క్వీన్ సీజన్ 2(స్టార్ మా) 1.79

సుమ అడ్డా (ఈటీవీ) 1.49

పాడుతా తీయగా (ఈటీవీ) 1.25

Whats_app_banner

సంబంధిత కథనం