Star Maa Serials Latest TRP Ratings: స్టార్ మా సీరియల్స్‌లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్నవి ఇవే-star maa serials latest trp ratings are here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serials Latest Trp Ratings: స్టార్ మా సీరియల్స్‌లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్నవి ఇవే

Star Maa Serials Latest TRP Ratings: స్టార్ మా సీరియల్స్‌లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్నవి ఇవే

Hari Prasad S HT Telugu
May 19, 2023 03:16 PM IST

Star Maa Serials Latest TRP Ratings: స్టార్ మా సీరియల్స్‌లో టాప్ టీఆర్పీ రేటింగ్స్ ఉన్నవి ఇవే. తాజాగా మే 6 నుంచి మే 12 వరకూ ఉన్న టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి.

స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి సీరియల్
స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి సీరియల్

Star Maa Serials Latest TRP Ratings: తెలుగు సీరియల్స్ లో టాప్ సీరియల్స్ చాలా వరకూ స్టార్ మాలోనే వస్తున్నాయి. ఈ ఛానెల్ ఇటు సీరియల్స్, అటు రియాల్టీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తెలుగులో నంబర్ వన్ ఛానెల్ అయిన స్టార్ మాలో వచ్చే సీరియల్స్ లో టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్నవి ఏవి? లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం.. మరోసారి బ్రహ్మముడి టాప్ లో నిలిచింది.

తాజాగా మే 6 నుంచి మే 12తో ముగిసిన వారానికిగాను స్టార్ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ ను బార్క్ రిలీజ్ చేసింది. ఓవరాల్ గా తెలుగు సీరియల్స్ లోనూ స్టార్ మా సీరియల్సే టాప్ లో ఉంటాయన్న విషయం తెలిసిందే. నిజానికి అందులో టాప్ 5లో ఉన్న సీరియల్స్ అన్నీ స్టార్ మాలో వచ్చేవే. ఆ తర్వాత జీ తెలుగు కూడా తన మార్క్ సీరియల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

బ్రహ్మముడి 11.78

కృష్ణా ముకుందా మురారి 9.94

నాగ పంచమి 9.86

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 8.21

నువ్వు నేను ప్రేమ 6.81

మల్లీ నిండు జాబిలి 6.32

ఇంటికి దీపం ఇల్లాలు 5.69

వంటలక్క 5.26

జానకి కలగనలేదు 5.23

పాపే మా జీవన జ్యోతి 5.10

Whats_app_banner

సంబంధిత కథనం