Telugu TV Serials Latest TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ సీరియలే టాప్-telugu tv serials latest trp ratings released as brahma mudi leads the chart again ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Tv Serials Latest Trp Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ సీరియలే టాప్

Telugu TV Serials Latest TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ సీరియలే టాప్

Hari Prasad S HT Telugu
May 11, 2023 09:48 PM IST

Telugu TV Serials Latest TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే. మళ్లీ బ్రహ్మముడి సీరియలే టాప్ లో నిలిచింది. అంతేకాదు స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది.

స్టార్ మాలో వచ్చే గుప్పెడంత మ‌న‌సు సీరియల్
స్టార్ మాలో వచ్చే గుప్పెడంత మ‌న‌సు సీరియల్

Telugu TV Serials Latest TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ 18వ వారం టీఆర్పీ రేటింగ్స్ రిలీజయ్యాయి. మరోసారి టాప్ 10లో స్టార్ మా, జీ తెలుగు సీరియల్సే ఉండటం విశేషం. అంతకుముందుతో పోలిస్తే ఈ తాజా లిస్టులోనూ పెద్దగా మార్పులేమీ లేవు. దాదాపు అవే సీరియల్స్ ఈసారి కూడా టాప్ 10లో నిలిచాయి.

ఇక టాప్ లో స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి కొనసాగుతోంది. ఈ సీరియల్ కు 12.13 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. టాప్ 5లో అన్నీ స్టార్ మా సీరియల్సే ఉన్నాయి. మొత్తంగా టాప్ 10లో ఏడు స్టార్ మా సీరియల్స్ కాగా.. మరో మూడు జీ తెలుగు నుంచి ఉన్నాయి.

బ్రహ్మముడితోపాటు నాగ పంచమి, కృష్ణా ముకుందా మురారి, గుప్పెడంత మనసు, మల్లీ నిండు జాబిలి, త్రినయని, నువ్వు నేను ప్రేమ, ప్రేమ ఎంత మధురం, పడమటి సంధ్యారాగం, ఇంటికి దీపం ఇల్లాలు లాంటి సీరియల్స్ ఉన్నాయి.

ఈ టీఆర్పీ రేటింగ్స్ ను బార్క్ మే 6 వరకూ అప్‌డేట్ చేసింది. తాజా లిస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

టాప్ 10 సీరియల్స్ ఇవే

బ్రహ్మముడి (స్టార్ మా) 12.13

నాగ పంచమి (స్టార్ మా) 10.96

కృష్ణా ముకుందా మురారి (స్టార్ మా) 10.68

గుప్పెడంత మనసు (స్టార్ మా) 9.21

మల్లీ నిండు జాబిలి (స్టార్ మా) 7.67

త్రినయని (జీ తెలుగు) 7.49

నువ్వు నేను ప్రేమ (స్టార్ మా) 7.12

ప్రేమ ఎంత మధురం (జీ తెలుగు) 6.88

పడమటి సంధ్యారాగం (జీ తెలుగు) 6.32

ఇంటికి దీపం ఇల్లాలు (స్టార్ మా) 5.90

IPL_Entry_Point

సంబంధిత కథనం