Krishna Mukunda Murari May 11th Episode : మురారి బర్త్ డే సెలబ్రేట్ చేసిన కృష్ణ.. ముకుంద ఏం చేసింది?-krishna mukunda murari may 11th episode krishna celebrates murari birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Krishna Mukunda Murari May 11th Episode : మురారి బర్త్ డే సెలబ్రేట్ చేసిన కృష్ణ.. ముకుంద ఏం చేసింది?

Krishna Mukunda Murari May 11th Episode : మురారి బర్త్ డే సెలబ్రేట్ చేసిన కృష్ణ.. ముకుంద ఏం చేసింది?

Anand Sai HT Telugu
May 11, 2023 08:11 AM IST

Krishna Mukunda Murari May 11th Episode : పుట్టిన రోజున రాత్రి 12 గంటలకు ముకుంద కేక్ కట్ చేయిస్తాను అని చెప్పిన విషయం గుర్తుకురావడంతో నిద్రలో నుంచి లేస్తాడు మురారి. బెడ్ మీద ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న అతడి దగ్గరకు కృష్ణ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే.. మే 11 ఎపిసోడ్ చూడాల్సిందే.

కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్
కృష్ణ ముకుంద మురారి ఎపిసోడ్

మురారి బర్త్ డేను ఓ వైపు కృష్ణ, మరోవైపు ముకుంద గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అర్ధరాత్రి 12 గంటలకు సెలబ్రేట్ చేసే టైమ్ రానే వస్తుంది. స్పెషల్ బర్త్ డే గిఫ్ట్ ఇస్తానని ముకుంద చెప్పిన విషయం గుర్తుకు వచ్చి.. భయం భయంగా బెడ్ మీద నుంచి మురారి లేస్తాడు. ఏసీపీ సర్.. లేవండి అంటూ కృష్ణ వచ్చేస్తుంది. పాపం ఏసీపీ సార్.. తన పెద్దమ్మ విషెస్ చెప్పట్లేదని బాధపడుతున్నాడేమోనని కృష్ణ మనసులో అనుకుంటుంది. మరో ఐదు నిమిషాలు మాత్రమే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం టైమ్ ఉంటుంది.

కానీ ముకుంద మాత్రం.. అర్ధరాత్రి పూట మురారి తనకు దగ్గరకు వచ్చినట్టుగా ఊహించుకుంటుంది. ముకుంద ఊహల్లో ఎవరైనా చూస్తారని మురారి భయపడుతూ ఉంటాడు. పెద్దమ్మ వాళ్లకు తెలిస్తే.. సమస్య వస్తుందని చెబుతాడు. ముకుంద ప్రేమతో కేక్ కట్ చేయిస్తుంది. ఆ తర్వాత ఓ రింగ్ తీసి గిఫ్ట్ గా ఇస్తుంది. అది చూసి షాక్ అయిన మురారి. ముకుందా.. ఏంటిది అని ప్రశ్నిస్తాడు. కానీ పట్టించుకోని ముకుంద.. రింగ్ తీసి మురారి చేతికి పెడుతుంది. రింగ్ తొడిగేసా.. అంటే మనకు ఎంగేజ్ మెంట్ అయిపోయినట్టే.. అని అంటుంది. ఏం చెప్పాలో ముకుందకు అర్థం కాదు. ఆలోచనల్లో పడతాడు.

ఇదే సమయంలో ప్రస్తుతంలోకి వచ్చేస్తుంది ముకుంద. తాను మురారి వచ్చినట్టుగా ఊహించుకున్నానని అనుకుంటోంది. నీ ఫ్యామిలీ కోసం నన్ను ఎందుకు పిచ్చిదాన్ని చేస్తున్నావ్ అని.. తనలో తానే అనుకుంటుంది. నీకే నా ప్రేమ అర్థంకాకపోతే.. నేనేమై పోవాలి.. ఏం చేయాలంటూ.. బాధపడుతుంది.

మరోవైపు కృష్ణ మాత్రం.. మురారితో కేక్ కట్ చేయిస్తూ ఉంటుంది. అటువైపుగా వచ్చిన ముకుంద ఈ విషయాన్ని చూస్తుంది. మురారితో కృష్ణ కేక్ కట్ చేయించడం చూసి తట్టుకోలేదు. కేక్ కట్ చేసిన మురారి.. కృష్ణకు తినిపించేందుకు ట్రై చేస్తూ.. మధ్యలోనే ఆగిపోతాడు. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది ఏసీపీ సార్.. ఒంట్లో బాగాలేదా అని కృష్ణ ప్రశ్నిస్తుంది. బాగానే ఉంది కదా అంటూ.. మురారి చేతిలో ఉన్న కేక్ తీసి అతడికే తినిస్తుంది. తర్వాత.. మురారి కృష్ణకు కేక్ తినిపిస్తాడు.

ఇద్దరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఈ విషయాన్ని అంతా.. దూరం నుంచి ముకుంద చూస్తూ ఉంటుంది. అస్సలు తట్టుకోదు. ఇంత ప్రేమగా కృష్ణ, మురారి ఉండటం చూసి.. తాను తెచ్చిన రింగ్ తీస్తుంది. ఆ రింగ్ మురారి వేలికి తొడగకపోతే.. నా ప్రేమకు అర్థమే లేదు అంటుంది. ఏడుస్తూ వెళ్లి బెడ్ మీద పడుతుంది. ఇంకోవైపు మురారి కృష్ణతో సెలబ్రేషన్స్ లో మునిగిపోతాడు. కృష్ణను వెనకాల నుంచి కౌగిలించుకుంటాడు మురారి. దీంతో కృష్ణ కాసేపు ఆగిపోతుంది. ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. ఆలోచనల్లో పడతారు.

ఆ తర్వాత వెళ్లి పడుకుంటారు. మురారి నిద్రపోతాడు బెడ్ పక్కన కూర్చొని కృష్ణ ఏదో పనిచేసుకుంటుంది. ఇదే సమయంలో మురారి పెద్దమ్మ రేవతి వచ్చి చూస్తుంది. పెద్దమ్మ నన్ను క్షమించవా అంటూ నిద్రలో మురారి అంటుంటాడు. నువ్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి నాన్నా అంటూ రేవతి మనసులోనే దీవిస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోతుంది.

కృష్ణ, మురారి కలిసి ఎంజాయ్ చేసిన దృశ్యాలను మురారి గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. మురారి గురించి తనలో తానే మాట్లాడుకుంటుంది. నువ్ నా నుంచి దూరం అయినా.. నేను నీ నుంచి దూరం కాలేను అని చెప్పుకుంటోంది. ఇది నీలో వచ్చిన మార్పో.. లేకుంటే.. కృష్ణ తీసుకొచ్చిన మార్పో అంటూ బాధపడుతుంది. రోజురోజుకి తనలో నిరాశ, నిస్పృహ పెరుగుతుందని అనుకుంటుంది. నీ ఫ్యామిలీ కోసం నువ్ చేసింది చేశావ్.. నా ప్రేమ కోసం నేనే చేయాల్సింది చేస్తానని ముకుంద శపథం చేస్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు ఉదయం బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తారు? ఈ వేడుకలకు పెద్దమ్మ వచ్చిందా? ముకుందా వచ్చి ఏం చేసింది? తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే..

IPL_Entry_Point