Guppedantha Manasu May 11th Episode: రిషి-వసుకు ఎంగేజ్మెంట్‌ చేయాలన్న శైలేంద్ర.. ఆందోళనలో జగతీ-guppedantha manasu 2023 may 11th episode shailendra suggests rishi vasudhara engagement ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu 2023 May 11th Episode Shailendra Suggests Rishi-vasudhara Engagement

Guppedantha Manasu May 11th Episode: రిషి-వసుకు ఎంగేజ్మెంట్‌ చేయాలన్న శైలేంద్ర.. ఆందోళనలో జగతీ

Maragani Govardhan HT Telugu
May 11, 2023 07:20 AM IST

Guppedantha Manasu May 11th Episode: గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్‌లో కొంతమంది మహిళలు వ్రతానికి పిలవడానికని వచ్చి రిషి-వసు బంధాన్ని తప్పుపడతారు. తాళీ లేకుండా ఇంట్లో ఉండకూడదని చెప్పడమే కాకుండా తలో మాట అంటారు. ఇందుకు శైలేంద్ర వారిద్దరికి నిశ్చితార్థం చేయాలని ప్లాన్ చేస్తాడు.

గుప్పెడంత మనసు మే 11 ఎపిసోడ్
గుప్పెడంత మనసు మే 11 ఎపిసోడ్

Guppedantha Manasu May 11th Episode: గుప్పెడంత మనసు నిన్నిటి ఎపిసోడ్‌లో రిషి తనపై జరిగిన దాడి గురించి సౌజన్యరావును ఆరా తీయడం ప్రారంభిస్తాడు. ఇందుకు సౌజన్యరావు మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలంటే లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం అని అంటాడు. ఇంతలో శైలేంద్ర.. రిషిని అడ్డుకొని వీడికి నేను వార్నింగ్ ఇస్తానని చెప్పి రిషిని కారులో కూర్చొమంటాడు. అనంతరం సౌజన్యరావుతో శైలేంద్ర యాక్టింగ్ షురూ చేస్తాడు. బాగా చేస్తున్నావని, ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెబుతాడు. రిషి చూసినప్పుడు మాత్రం అతడికి వార్నింగ్ ఇస్తున్నట్లు తెగ వార్నింగ్ ఇస్తాడు. చూసుకుందాం అంటూ ఇద్దరూ వెళ్లిపోతారు. సీన్ కట్ చేస్తే ఈ రోజు ఎపిసోడ్‌లో ఇంటికి కొంతమంది మహిళలు వస్తారు. ఇంట్లో వ్రతం చేస్తున్నామంటూ దేవయానికి చెప్పి వారిని ఆహ్వానిస్తున్నామని చెబుతారు.

దేవయానితో పాటు జగతీకి కూడా బొట్టు పెట్టి వ్రతానికి ఆహ్వానిస్తారు. వారి నుదుటిపైనే కాకుండా తాళిబొట్టుపై బొట్టుపెడతారు. వసు దగ్గరకు కూడా వచ్చి అలాగే చేయబోయి.. తాళిని తీయమని అడుగుతారు. ఇందుకు వసు లేదని బదులిస్తుంది. లేకపోవడమేంటని సదరు మహిళలు అడుగుతారు. మొన్నటివరకు నీ మెడలో తాళి ఉంది కదా.. ఇప్పుడు లేదంటున్నావెంటి అని అడుగుతారు. ఇందుకు వసు మేము త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని, ముహూర్తాలు కూడా చూస్తున్నారని చెబుతుంది. మీరిద్దరూ భార్య, భర్తలు కదా తాళీ ఏమైందని అడుగుతారు. అందరూ ఇబ్బంది పడుతూ చూస్తుంటారు. ఇదంతా చూసి దేవయాని మనసులో ఆనంద పడుతుంది.

శైలేంద్ర బిల్డప్..

తాళీ లేకుండా పెళ్లి చేసుకోవడమేంటి? అని తలో మాట అంటారు. వారు సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోలేదని అందుకే మళ్లీ వివాహం చేసుకోబోతున్నారని జగతీ చెప్పినా వారు వినరు. ఇంతలో పెద్ద మహానుభావుడిలా శైలేంద్ర ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు జనరేషన్‌లో ఇదంతా కామన్ అని, అందరూ మీలాగే ఉంటారనకోకండి, ఇద్దరికి ఇష్టమైతే కలిసి ఉండవచ్చు అంటూ బిల్డప్ ఇస్తాడు. ఇందుకు మహిళలు ఒప్పుకోరు. విడిపోవడానికి మాత్రమే నువ్వు చెప్పిన చట్టాలు వర్తిస్తాయని, కలిసి ఉండడానికి సంప్రదాయాలు కావాలని, అలాంటి వాటిని పక్కనపెట్టడమేంటని అడుగుతారు. ఇందుకు వసు కూడా మేము సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోకపోవచ్చు కానీ, మేము ఒకరినొకరం ఇష్టపడ్డాం, ప్రేమించుకున్నాం మేము భార్య, భర్తలమే అని వసు అంటుంది. ఇది పద్దతిగా కాదని మహిళలు తలో మాట అంటారు.

ఇంతలో రిషి ఎంట్రీ ఇచ్చి భార్య-భర్తల మధ్య బంధం నిలబడాలంటే ప్రేమ ఉండాలని, ఆ ప్రేమ మా మధ్య ఉందని చెబుతాడు. ఇందుకు సదరు మహిళలు మాత్రం అంగీకరించరు. తప్పని చెప్పల్సింది పోయి మీరే ఇంట్లో పెట్టుకున్నారేంటి అని అడుగుతారు. ఇందుకు మహేంద్ర కూడా వారి నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదు అందుకే అడ్డు చెప్పలేదని అంటాడు. అయినా కన్నవారిగా మాకు లేని ఇబ్బంది మీకు ఎందుకు చెప్పండి అంటూ మహేంద్ర అంటాడు. మీరుంటుంది జనం మధ్యలో మీకు నచ్చినట్టుగా కాదు.. కొంచెం సమాజానికి నచ్చేట్టుగా ఉండాలని, దేవయాని మీరైనా చెప్పొచ్చు కదాని దేవయానితో అంటారు.

రెచ్చిపోయిన దేవయాని..

సమయమొచ్చింది కదాని దేవయాని కూడా రెచ్చిపోతుంది. నేను చెబితే వింటారా.. వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉంటారంటూ వెటకారమడుతుంది. అయితే వచ్చిన మహిళలు మాత్రం సంప్రదాయం, తొక్క తోటకూర అంటూ ఏదోక మాట అంటూ రిషి, వసును బాధపెడతారు. ఎంత చెప్పినా వినకుండా మాట్లాడతారు. పైపెచ్చు ఇలాంటి ఇంటికి తెలియకుండా వచ్చామని, పది మందికి పది మాటలు చెప్పడం కాదు.. మీ ఇళ్లు చక్కదిద్దుకోండని దేవయానికి చెప్పి వెళ్లిపోతారు. అనంతరం దేవయానికి తెగ ఫీలై అయిపోతుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నలుగురు చూస్తే నాలుగు రకాలుగా మాట్లాడతారని, నేను చెప్తే నా మాట వినలేదు కదా అంటూ జగతీతో అంటుంది. ఈ ఇంటికి పెద్దగా ఉన్నందుకు అందరూ నన్ను అంటున్నారని ఫైర్ అవుతుంది.

రిషి-వసు ఎంగేజ్మెంట్?

ఇంతలో శైలేంద్ర వచ్చి ఏంటి మమ్ అలా అంటున్నావ్.. వాళ్లు అలా అంటే వీళ్లు ఏం చేస్తారు అని అంటాడు. వాళ్ల అలా అనడానికి వీళ్లే కదా కారణం.. ఇదంతా తప్పు కాదా అని దేవయాని ప్రశ్నిస్తుంది. శైలేంద్ర మాత్రం రిషి-జగతీపై ప్రేమ ఉన్నవాడిలా రెచ్చిపోయి మాట్లాడతాడు. దేవయానిపై సీరియస్ అయినట్లు నటిస్తాడు. ఇందుకు దేవయాని మాత్రం అందరూ నన్నే అనండి.. నా నోరు మూయించినా.. బయట వాళ్ల నోళ్లు మూయించలేకపోయారుగా అంటూ ఫైర్ అవుతుంది. ఇందుకు శైలేంద్ర స్పందిస్తూ ఇలా అనేబదులు పెళ్లి చేయొచ్చుగా అని సలహా ఇస్తాడు. ముహూర్తాలు లేవని చెప్పాముగా అని దేవయాని బదులిస్తుంది. అయితే ఆ లోపు ఎంగేజ్మెంట్ జరిపించొచ్చుకదా అని సలహా ఇస్తాడు శైలేంద్ర. జగతీ మాత్రం అతడి మాటలకు ఆశ్చర్యపోతుంది. శైలేంద్ర నిర్ణయానికి అందరూ తలొగ్గుతారు.

శైలేంద్ర ప్లాన్‌పై ఆందోళనలో జగతీ..

సీన్ కట్ చేస్తే.. జగతీ, శైలేంద్ర మాటల గురించి ఆలోచిస్తుంటుంది. ఈ నిశ్చితార్థం హడావిడి ఏంటి? అని అనుకుంటూ ఉంటుంది. దీని వెనక కుట్ర ఏంటి? అనుకుంటూ ఆలోచిస్తుంటుంది. జగతీ వద్దకు వచ్చిన నిశ్చితార్థం త్వరలో జరగబోతుందని తెలుసుకున్న వసుధార మాత్రం తెగ సంబరపడి పోతూ ఉంటుంది. జగతీ.. వసుతో శైలేంద్ర గురించి చెప్పడానికి ప్రయత్నించినా రిషి ఎంట్రీ ఇవ్వడంతో జగతీ మిన్నకుండా ఉండిపోతుంది. అనంతరం వసును రిషి షాపింగ్‌కు వెళ్దామని ఆమెను తీసుకెళ్తాడు. శైలేంద్ర గురించి నిజం తెలుసుకున్న జగతీ మాత్రం బాధపడుతుంటుంది.

రిషి-వసులో రూమ్‌కు వస్తారు. ఏంటి సార్ షాపింగ్‌కు వెళ్లకుండా ఇక్కడకు వచ్చామని వసు అడుగుతుంది. వెళ్దాంలే.. షాపింగ్‌లో ఏం కొందామనుకుంటున్నావ్ అని అడుగుతాడు. ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదని చెబుతుంది. రిషి మాత్రం ఓ రింగు చూపిస్తూ ఇలాంటి రెండు తీసుకోవాలి అని అంటాడు. ఒకదానిపై రిషి-వసుధార అని ఉంటుంది.. మరోకదానిపై ఏముంటుందో చెప్పు అనగానే ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే రేపటి ప్రోమో మాత్రం ఆసక్తికరంగా ఉండబోతుంది. రిషిని చంపేందుకు అరేంజ్ చేసిన లారీని చూపిస్తూ జగతీని భయపెట్టేందుకు ప్రయత్నిస్తాడు శైలేంద్ర. అంతేకాకుండా శైలేంద్ర రిషిని చంపుతాని అనడం వసు కూడా వింటుంది. దీంతో రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point