తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Records: కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్ చేసిన ప‌ఠాన్‌ - బాహుబ‌లి -2 మాత్ర‌మే బ్యాలెన్స్

Pathaan Records: కేజీఎఫ్ -2 రికార్డ్ బ్రేక్ చేసిన ప‌ఠాన్‌ - బాహుబ‌లి -2 మాత్ర‌మే బ్యాలెన్స్

09 February 2023, 11:25 IST

  • Pathaan Records: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమా ఇండియా వైడ్‌గా హ‌య్యెస్ట్ నెట్‌ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్ సినిమాల జాబితాలో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. య‌శ్ కేజీఎఫ్ -2 రికార్డ్‌ను ప‌ఠాన్ బ్రేక్ చేసింది. ఈ జాబితాలో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న సినిమా ఏదంటే...

షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్
షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్

షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్

Pathaan Records: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. గ‌త సినిమాల రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కు దూసుకుపోతున్న‌ది. ప‌దిహేను రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌ఠాన్ 900 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Manjummel Boys OTT: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

ఇండియాలో 446 కోట్ల క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ది. ఇండియా వైడ్‌గా హ‌య్యెస్ట్ నెట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన హిందీ సినిమాల్లో సెకండ్ ప్లేస్‌కు ప‌ఠాన్ చేరుకున్న‌ది. గ‌తంలో ఈ రికార్డ్ య‌శ్ కేజీఎఫ్ -2 సినిమా పేరు మీద ఉంది. కేజీఎఫ్ 2 హిందీ వెర్ష‌న్ ఇండియాలో 434 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. ఆ రికార్డ్‌ను ప‌ఠాన్ ప‌దిహేను రోజుల్లోనే బ్రేక్ చేసింది.

ఓవ‌రాల్‌గా ఈ జాబితాలో 510 కోట్ల‌తో ప్ర‌భాస్ బాహుబ‌లి -2 ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. బాహుబ‌లి -2 రికార్డ్‌ను మ‌రో రెండు రోజుల్లో ప‌ఠాన్ అధిగ‌మించే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప‌ఠాన్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

దాదాపు నాలుగేళ్ల గ్యాప్ త‌ర్వాత షారుఖ్‌ఖాన్ ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రా ఏజెంట్‌గా షారుఖ్‌ఖాన్ యాక్టింగ్‌, అత‌డిపై తెర‌కెక్కించ‌న యాక్ష‌న్ సీక్వెన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఇండియాలో విధ్వంసానికి కుట్ర‌లు ప‌న్నిన ఓ ప్రైవేట్ ఏజెంట్‌ను ప‌ఠాన్ ఎలా అడ్డుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ.

షారుఖ్‌కు జోడీగా దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టించింది. ఐఎస్ఐ ఏజెంట్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో దీపికా క‌నిపించింది. స‌ల్మాన్‌ఖాన్ గెస్ట్‌లో రోల్‌లో న‌టించాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.