Pathaan Box Office Records: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న పఠాన్ - షారుఖ్‌ఖాన్ సినిమా బ్రేక్ చేసిన రికార్డులు ఇవే
Pathaan Box Office Records: మొదటి వారంలో 634 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన షారుఖ్‌ఖాన్ పఠాన్ మూవీ పలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఆ రికార్డులు ఏవంటే...

Pathaan Box Office Records: షారుఖ్‌ఖాన్ హీరోగా నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా 634 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ వీక్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇండియా వైడ్‌గా పఠాన్ సినిమా 350 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. భారతీయ సినిమాల్లో అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా షారుఖ్‌ఖాన్ సినిమా నిలిచింది.
రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమా రిలీజైంది. తొలిరోజు ఈ సినిమా 57 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన బాలీవుడ్ సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పటివరకు రిపబ్లిక్ డే రోజున రిలీజైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించింది పఠాన్ సినిమానే కావడం గమనార్హం.
రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న బాలీవుడ్ సినిమా ఇదే. అంతేకాకుండా షారుఖ్‌ఖాన్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా పఠాన్ నిలిచింది. 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన షారుఖ్‌ఖాన్ తొలి సినిమాగా పఠాన్ మరో రికార్డ్‌ను నెలకొల్పింది.
స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటించింది. జాన్ అబ్రహం విలన్‌గా కనిపించాడు. ఇండియాలో విధ్వంసానికి ప్లాన్ చేసిన ఓ డేంజరస్ క్రిమినల్‌ను పఠాన్ అనే రా ఏజెంట్ ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా కథ.
యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత షారుఖ్‌ఖాన్ నటించిన సినిమా ఇది.