Deepika Padukone Look in Project k: ప్రాజెక్ట్ కే టీమ్ స‌ర్‌ప్రైజ్ - దీపికా ప‌డుకోణ్ పోస్ట‌ర్ రిలీజ్‌-deepika padukone birthday project k team released special poster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deepika Padukone Look In Project K: ప్రాజెక్ట్ కే టీమ్ స‌ర్‌ప్రైజ్ - దీపికా ప‌డుకోణ్ పోస్ట‌ర్ రిలీజ్‌

Deepika Padukone Look in Project k: ప్రాజెక్ట్ కే టీమ్ స‌ర్‌ప్రైజ్ - దీపికా ప‌డుకోణ్ పోస్ట‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 05, 2023 01:37 PM IST

Deepika Padukone Look in Project k: దీపికా ప‌డుకోణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గురువారం ప్రాజెక్ట్ కే టీమ్ స‌ర్‌ప్రైజ్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో దీపికా ప‌డుకోణ్ పోరాట యోధురాలిగా క‌నిపిస్తోంది.

దీపికా ప‌డుకోణ్
దీపికా ప‌డుకోణ్

Deepika Padukone Look in Project k: దీపికా ప‌డుకోణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ప్రాజెక్ట్ కే టీమ్ అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. దీపికా ప‌డుకోణ్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఆమె ముఖం క‌నిపించ‌కుండా రిలీజ్ చేసిన ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ పోస్ట‌ర్‌లో అస్త‌మించే సూర్యుడి కిర‌ణాల మ‌ధ్య కొండ‌పై నిల్చొని దీపికా ప‌డుకోణ్ క‌నిపిస్తోంది. షార్ట్ హెయిర్‌లో ఆమె లుక్ డిఫ‌రెంట్‌గా ఉంది.

మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్స్ ధ‌రించే క్లాత్ ఆమె చేతుల‌కు చుట్టి ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. ప్రాజెక్ట్ కే సినిమాలో పోరాట యోధురాలి పాత్ర‌లో దీపికా ప‌డుకోణ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ పోస్ట‌ర్‌పై నిశీధిలో ఆశాకిర‌ణం అనే అర్థం వ‌చ్చే క్యాప్ష‌న్ ఆస‌క్తిని పంచుతోంది. ప్రాజెక్ట్ కే సినిమాతోనే దీపికా ప‌డుకోణ్ టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ది.

ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు మ‌హాన‌టి ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో ప్ర‌భాస్ సూప‌ర్ హీరో పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

ఆధునిక యుగంలో త‌న‌కున్న సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో దుష్ట శ‌క్తుల‌పై అత‌డు సాగించే పోరాటం నేప‌థ్యంలో ప్రాజెక్ట్ కే సినిమా తెర‌కెక్క‌బోతున్న‌ట్లు తెలిసింది. దాదాపు ఐదు వంద‌ల కోట్ల‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.

వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వినీద‌త్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో ప్రాజెక్ట్ కే సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.