Manjummel Boys OTT: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!
06 May 2024, 16:16 IST
- Manjummel Boys OTT Response: మంజుమ్మల్ బాయ్స్ సినిమా చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అయిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రానికి ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక ఎలాంటి స్పందన వస్తోందంటే..
Manjummel Boys OTT Response: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!
Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ సినిమా థియేటర్లలో దుమ్మురేపింది. మలయాళంలో రికార్డులను తిరగరాసిన ఈ మూవీ తమిళంలోనూ అదరగొట్టింది. తెలుగులోనూ థియేటర్లలో అంచనాలకు మించి కలెక్షన్లను కొల్లగొట్టింది. ఫిబ్రవరి 22వ తేదీన మలయాళంలో థియేటర్లలో రిజైన ఈ చిత్రం తెలుగులో ఏప్రిల్ 6న విడుదలైంది. మలయాళ ఇండస్ట్రీలో ఆల్‍టైమ్ హిట్‍గా ఈ మూవీ నిలిచింది. అయితే, మలయాళంలో రిలీజైన 73 రోజుల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇంత బ్లాక్‍బస్టర్ అయిన మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి ఓటీటీ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తోందో ఇక్కడ చూడండి.
అద్భుతం అంటూ..
మంజుమ్మల్ బాయ్స్ చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మే 5వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఎక్స్ (ట్విట్టర్) ప్లాట్‍ఫామ్‍లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
మంజుమ్మల్ బాయ్స్ సినిమా అద్భుతంగా ఉందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‍లోనే ఇంత క్వాలిటీ చిత్రాన్ని ఎలా తెరకెక్కించారని మేకర్లను అభినందిస్తున్నారు. ఈ మూవీని అందరూ తప్పకుండా చూడాలని రాసుకొస్తున్నారు. అలాగే, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఉండాల్సిందని కొందరు పేర్కొంటున్నారు. మొత్తంగా మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
మంజుమ్మల్ బాయ్స్ చిత్రంలో చాలా సీన్లు గూజ్‍బంప్స్ తెప్పించేలా ఉన్నాయని, ఉత్కంఠతో కట్టిపడేసిందని కొందరు అంటున్నారు. ఈ చిత్రంలో ఫ్రెండ్‍షిప్‍ను కూడా గొప్పగా చూపించారని ప్రశంసిస్తున్నారు.
ముంజుమ్మల్ బాయ్స్ సినిమాలో శ్రీనాథ్ బాసీ పోషించిన సుభాశ్ క్యారెక్టర్.. చిన్నతనం నుంచి గుహలో ప్రమాదంలో చిక్కుకునే ట్రాన్సిషన్ అదిరిపోయిందని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ సీన్‍ను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. అలాగే, సుభాష్‍ను కాపాడే క్లైమాక్స్ సీన్ కూడా అద్భుతంగా ఉందని అంటున్నారు.
అద్భుతమైన కథ చెప్పేందుకు భారీ బడ్జెట్ తప్పనిసరి కాదని మంజుమ్మల్ బాయ్స్ నిరూపించిందని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు, టెన్షన్ అదిరిపోయారనని అభిప్రాయపడుతున్నారు. మాస్టర్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మలయాళ ఇండస్ట్రీలో ఆల్‍టైమ్ రికార్డు
మంజుమ్మల్ బాయ్స్ సినిమా ఓవరాల్‍గా రూ.242 కోట్ల కలెక్షన్లను దక్కించుకుంది. రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన తొలి మలయాళ మూవీగా చరిత్ర సృష్టించింది. రూ.20కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో ఆల్‍టైమ్ రికార్డును దక్కించుకుంది.
మంజుమ్మల్ బాయ్స్ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసీ, దిలాన్ డెరిన్, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్ ప్రధాన పాత్రలు చేశారు. దర్శకుడు చిదంబరం ఈ మూవీని తెరకెక్కించారు. సౌహిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించిన ఈ సినిమాకు సుషిన్ శ్యామ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన చిదంబరంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ సుషిన్‍పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అయింది.
టాపిక్